సాధించాలన్న పట్టుదల, కృషి,అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ఈవిషయాన్నే తన విజయం ద్వారా నిరూపించింది ఓ యువతి. ఒకటి కాదు రెండు ఏకంగా 13 బంగారు పతకాలను సాధించింది. CLATలలో అగ్రస్థానంలో నిలిచి, బంగారు పతకాలు సాధించడమే కాకుండా, యూపీఎస్‌సీలో మంచి (60) సాధించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన శ్రద్ధా గోమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి!
శ్రద్ధా గోమ్ తండ్రి రిటైర్డ్ SBI అధికారి. ఆమె తల్లి వందన గృహిణి. శ్రద్ధా చిన్నప్పటినుంచీ తెలివైన విద్యార్థిని. ఇండోర్‌లోని సెయింట్ రాఫెల్స్ హెచ్‌ఎస్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అగ్రస్థానంలో నిలిచింది.
తరువాత శ్రద్ధా గోమ్ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని బావించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)లో టాపర్‌గా నిలిచింది. ఈ ఘనత ఆమె ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), బెంగుళూరు, భారతదేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందింది. అత్యుత్తమ ప్రతిభకు గాను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రచేతులమీదుగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డుల పరంపరకొనసాగుతూనే ఉంది. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో లీగల్ మేనేజర్‌గా పనిచేసింది. ముంబై, లండన్‌లో విలువైన అనుభవాన్ని పొందింది. తరువాత తన స్వస్థలమైన ఇండోర్‌కు తిరిగొచ్చి, 2021లొ సివిల్ సర్వీసెస్‌కు (సీఎస్‌ఈ) ప్రిపేర్ అయింది. ఇంటర్నెట్ ద్వారా స్టడీ మెటీరియల్ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రద్ధా మంచి ఆర్టిస్ట్ కూడా.
Comments
Please login to add a commentAdd a comment