మేడారంలో పది క్యాంపులు
కోళ్లకు కూడా వైద్య పరీక్షలు
జాతర ముగిసే వరకు మూడు షెడ్యూళ్లు
పశు సంవర్థక శాఖ జాయింట్ డెరైక్టర్ వెంకయ్య నాయుడు
తమ కోర్కెలు తీర్చితే మేడారం జాతరకు ఎడ్లబండ్లపై వస్తామని కొందరు అమ్మవార్లను మొక్కుతుంటారు. ఈ మేరకు మొక్కును తీర్చుకునేందుకు కుటుంబసమేతంగా ఎడ్ల బండ్లపై జాతరకు వస్తుంటారు. ప్రస్తుతం బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఎక్కువ కావడంతో వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. గత జాతరకు సుమారు 15 వేల ఎడ్ల బండ్లు వచ్చాయి. ఈసారి 10 వేలు ఎడ్ల బండ్లు వస్తాయని అంచనా వేస్తున్నాం.
మేడారం పశువులకు టీకాలు
తాడ్వాయి మండలంలోని 43 గ్రామాల్లో ఉన్న పశువులను ఇప్పటికే గుర్తించాం. జనవరి 30 వరకే మండల పరిధిలోని పశువుల కు వ్యాధి నిరోధక టీకాలు వేయించాం. ఆయా గ్రామాల్లోని రైతులు జాతర సమయంలో తమ పశువులను బయటకు వదల వద్దని ఇప్పటికే సూచించాం. జాతర ముగి సిన నెలరోజుల వరకు పశువులను బయట కు పంపించొద్దని సమాచారం అందించాం.
రూ.9 లక్షలు మంజూరు
జాతరలో పశుసంవర్థక శాఖ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో మేడారంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మందులను కొనుగోలు చేస్తాం. ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు సేవలు అందిస్తాం.
10 క్యాంపుల ఏర్పాటు
జాతరకు వచ్చే పశువులకు వైద్య సేవలందించేందుకు 10 క్యాంపులు ఏర్పాటు చేస్తాం. పస్రా, నార్లాపూర్, తాడ్వాయి, ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొం డారుు, కన్నెపల్లి, ఉరట్టం, కొత్తూరు, రెడ్డిగూడెంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ఒక్కో క్యాంపులో ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది, ఒక అటెండర్ విధులు నిర్వర్తిసారు. అలాగే రెండో జాతరగా పేరొందిన అగ్రంపహాడ్‌లో కూడా క్యాంపును ఏర్పాటు చేస్తున్నాం.
పౌల్ట్రీ ఫాంలో నిరంతర నిఘా
జాతరలో ఏర్పాటు చేసే తాత్కాలిక పౌల్ట్రీఫాంలలో నిరంతర నిఘా ఉంటుంది. భక్తులకు విక్రయించే కోళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తాం. వీటిని నిర ం తరంగా తనిఖీ చేసేందుకు రెండు టీంలు ఏర్పాటు చేశాం. వీరు 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటారు. ఈ టీంలో ఒక డాక్టర్, సిబ్బంది ఉంటారు.
ప్లాస్టిక్ కవర్లు తింటే చనిపోతాయి
జాతరలో పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో మూడు షెడ్యూళ్లు ఏర్పాటు చేసుకుని ముం దుకు వెళ్తున్నాం. జాతరకు ముందు, జాతర సమయంలో, తర్వాత పశువులకు వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటాం. మేడారంలో పశువులు బెల్లం, ప్లాస్టిక్ కవర్లు తినకుండా చూడాలి. ప్లాస్టిక్ కవర్లు తినడం ద్వారా పశువులు మృతి చెందే అవకాశం ఉంది. జాతర తర్వాత మేడారం, రెడ్డిగూడెం, నార్లాపూర్, కన్నెపల్లి, ఊరట్టం, కొత్తూరులో వైద్య శిబిరాలు నిర్వహిస్తాం.
10,000 ఎడ్ల బండ్లు వస్తయ్..
Published Wed, Feb 10 2016 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement
Advertisement