సాక్షి,నార్నూర్(గాదిగూడ): ఏజెన్సీ పరిధిలో రోడ్డు, రవాణా సౌకర్యాలు లేక అంబులెన్స్ వెళ్లలేని గ్రామాలకు వెళ్లి బాధితులను ఆస్పత్రికి తీసుకువచ్చేలా ఐటీడీఏ ఎడ్లబండి అంబులెన్స్ ఏర్పాటు చేసింది. గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీనిని అందుబాటులో ఉంచారు. బాధితులను ఆస్పత్రికి తరలించడం ఆలస్యమైతే ప్రాణాలు పోతున్న నేపథ్యంలో ఎడ్లబండి అంబెలెన్స్ ఏర్పాటు చేసినట్లు ఏజెన్సీ అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు.
గ్రామానికి చెందిన వారు ఎవరైనా ఎడ్లబండిపై బాధితులను ఆస్పత్రికి తీసుకొస్తే వారికి రూ.1,300 రవాణా చార్జీ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. గిరిజనులు ఎడ్లబండి అంబులెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చదవండి: రూ.10 కోసం గొడవ.. ఇంటికొచ్చి మరీ కాల్చి చంపిన దుండగులు
Comments
Please login to add a commentAdd a comment