agency roads
-
ఏజెన్సీలో ఎడ్లబండి అంబులెన్స్..
సాక్షి,నార్నూర్(గాదిగూడ): ఏజెన్సీ పరిధిలో రోడ్డు, రవాణా సౌకర్యాలు లేక అంబులెన్స్ వెళ్లలేని గ్రామాలకు వెళ్లి బాధితులను ఆస్పత్రికి తీసుకువచ్చేలా ఐటీడీఏ ఎడ్లబండి అంబులెన్స్ ఏర్పాటు చేసింది. గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీనిని అందుబాటులో ఉంచారు. బాధితులను ఆస్పత్రికి తరలించడం ఆలస్యమైతే ప్రాణాలు పోతున్న నేపథ్యంలో ఎడ్లబండి అంబెలెన్స్ ఏర్పాటు చేసినట్లు ఏజెన్సీ అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. గ్రామానికి చెందిన వారు ఎవరైనా ఎడ్లబండిపై బాధితులను ఆస్పత్రికి తీసుకొస్తే వారికి రూ.1,300 రవాణా చార్జీ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. గిరిజనులు ఎడ్లబండి అంబులెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదవండి: రూ.10 కోసం గొడవ.. ఇంటికొచ్చి మరీ కాల్చి చంపిన దుండగులు -
గిరిసీమలో రహ‘దారిద్య్రం’
ఆపద ముంచుకొచ్చిన వేళా ‘పథం’ కరువు తరాలుగా పీడిస్తున్న సమస్య సర్కార్ల నిర్లక్ష్యం గిరిబిడ్డల దారి గోడు నేటికీ అరణ్యరోదనే రంపచోడవరం : ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవేలనూ; వాటిపై దూసుకుపోయే వాహనాలనూ ప్రగతికి చిహ్నాలుగా చూపుతూ.. అవన్నీ తాము సాధించిన ఘనతలని ప్రచారం చేసుకునే ప్రభుత్వాలు– ఇప్పటికీ దారీతెన్నూ లేని గిరిసీమల దుస్థితిని పట్టించుకోవు. కొండకోనల నడుమనుండే ఓ గూడెం నుంచి.. పురిటినొప్పులు పడుతున్న ఓ నిండుగర్భిణిని చేరువలోని ఆస్పత్రికి తరలించాలంటే ఓ యజ్ఞం చేసినంతగా కష్టపడాల్సిన పరిస్థితే నేటికీ తూర్పు ఏజెన్సీలో అనేక గ్రామాల్లో నెలకొంది. అత్యవసరాల్లోనే కాదు.. ఏ చిన్ని అవసరానికైనా బాహ్యప్రపంచానికి పయనం కావలసిన వెనుకబాటుతనంతో ఉన్న మన్యగ్రామాలను తరాల తరబడి పీడిస్తున్న రహ‘దారిద్య్రం’ ఎందరు పాలకులు మారినా విరగడ కాలేదు. గిరిజనులు కోరేది.. పాలకులు గొప్పలు చెప్పుకొంటున్న మహా రహదారులను కాదు.. ప్రయాణం ప్రయాసపూరితం, ప్రమాదభరితం కాని కనీసస్థాయి బాటలనే! తూర్పు ఏజెన్సీలోని ఎన్నో రోడ్లు అత్యవసర సమయంలో కనీసం వాహనాలు కూడా ప్రయాణించలేనంత అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. ఐటీడీఏ ఉపాధిహామీ ప్రత్యేక ప్రాజెక్టు పేరుతో వీటీడీఏల ద్వారా నిర్మించిన రోడ్లను బినామీ కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి వేశారు. ఫలితంగా ప్రయాణ ం ‘కాకులు దూరని కీకారణ్యంలో గాలి పటాలను ఎగరేసినంత’ కష్టతరంగా మారింది. అటవీశాఖ అభ్యంతరాల కారణంగా నిలిచిపోయిన రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంతోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏజెన్సీ రోడ్లు.. ఐటీడీఏ పరిధిలో : మెటల్ రోడ్లు : 237 కిలోమీటర్లు బీటీ రోడ్లు : 135 కిలోమీటర్లు రోడ్లు, భవనాల శాఖ: రంపచోడవరం డివిజన్: 440 కిలోమీటర్లు చింతూరు డివిజన్: 270 కిలోమీటర్లు 30 గ్రామాల వారికి ముప్పుతిప్పలే.. గంగవరం నుంచి కొత్తపల్లి వరకు 18 కిలోమీటర్లు మేర ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. రెండు సార్లు మరమ్మతులు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. ఈ రోడ్లో మూడు చోట్ల కల్వర్టులు నిర్మించాలి. కానీ ఏళ్ళ తరబడి నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఈ రోడ్లో నిత్యం 30 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారు. అడుగడుగునా గోతులే.. రంపచోడవరం సమీపంలోని పందిరిమామిడి –చవిటిదిబ్బల రోడ్డు దుస్థితికి చేరుకుంది. ఈ రోడ్డుకు రెండుసార్లు మరమ్మతులు చేసికా ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి. ఈ రోడ్లో రంపచోడవరం, వై.రామవరం, మారేడుమిల్లి మండలాలకు చెందిన సుమారు 80 గ్రామాల గిరిజనులు రాకపోకలు సాగిస్తారు. వీరు ఐటీడీఏకి రావాలంటే దగ్గర మార్గం ఇదే. 40 కిలోమీటర్లున్న ఈ రోడ్డు అడుగడుగునా గోతులమయం కావడంతో ఆర్టీసీ బస్సు రాకపోకలను రంప రోడ్డుకి మార్చారు. నడవాలన్నా కష్టమే.. కూనవరం –రేపాక మధ్య ఆరు కిలోమీటర్ల రోడ్డు కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా తయారైంది. మన్యంలో లోతట్టు ప్రాంతంలోని ఈ రోడ్డు అత్యవసర సమయంలో మోటార్‌బైక్‌లు కూడా వెళ్లలేని దుస్థితిలో ఉంది. అధికారులకు మాత్రం ఈ రోడ్డు దుస్థితి పట్టడం లేదు. ఈ రోడ్డులో కల్వర్టు కొట్టుకుపోయి రెండు సంవత్సరాలు దాటుతున్నా నిర్మాణం ఊసే లేదు. చినుకు పడితే దారే ఏరు మోతుగూడెం– డొంకరాయి మధ్య ఆర్ అండ్ బి రోడ్డు గోతులమయంగా మారింది. ఈ రోడ్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే కడుపులో పేగులు కదిలిపోవల్సిందే. పొల్లూరు జంక్షన్ నుంచి ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు వర్షం వస్తే మడుగులా మారుతుంది. ఆపద ముంచుకొచ్చినా వాహనం రాదు.. రాజవొమ్మంగి నుంచి అప్పలరాజుపేట మీదుగా అమ్మిరేకుల వెళ్ళే 12 కిలోమీటర్ల రోడ్డు అధ్వానస్థితికి చేరింది. వర్షం వస్తే ఈ రోడ్లో నడిచి వెళ్లడం కూడా కష్టమే. గిరిజనులు అనారోగ్యం పాలైతే కనీసం అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదు. మారేడుమిల్లి వయా ఆకుమామిడి కోట: మారేడుమిల్లి నుంచి ఆకుమామిడి కోట మీదుగా గుర్తేడు వెళ్లే 50 కిలోమీటర్ల రోడ్డు గోతులమయమైంది. మారేడుమిల్లి మండలం కుందాడ– మల్లిశాల వరకు 12 కిలోమీటర్ల రోడ్డు రాళ్లు లేచిపోయి ప్రమాదకరంగా మారింది. సున్నంపాడు– రామన్నవలస మధ్య 10 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా ఉంది. -
మన్యం రోడ్లకు మహర్దశ
రిజర్వ్ ఫారెస్టుపై కేంద్రం నిబంధనలు సడలింపు మావోయిస్టు ప్రభావిత జిల్లాలకు మాత్రమే వర్తింపు ఏజెన్సీ రోడ్ల నిర్మాణాలకు ఇక త్వరితగతిన అనుమతులు 13 రకాలపై తొలగనున్న అడ్డంకులు జాప్యాన్ని నివారించేందుకు ఆన్లైన్ ప్రక్రియ కొయ్యూరు : ఏజెన్సీ రోడ్లకు మహర్దశ పట్టనుంది. అటవీశాఖ అభ్యంతరాలతో ఆగిపోయిన రోడ్లను,ఇతర నిర్మాణాలకు కేంద్రం నిబంధనల సడలింపుతో ఇబ్బందులు తొలగనున్నాయి. మన్యంలో దాదాపుగా 70 కిపైగా రోడ్ల నిర్మాణం ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక మీదట వాటిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతిలో పూర్తి చేయవచ్చు. విశాఖ మన్యం మావోయిస్టు ప్రభావిత జిల్లా కావడంతో రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సడలించింది. దీని ప్రకారం ఒక గ్రామంలో అంగన్వాడీ భవనం లేదా పాఠశాల భవనం,లేకుంటే సోలార్ కేంద్రం ఎంచక్కా ఏర్పాటు చేసుకోవచ్చు. మొబైల్ టవర్లు ఏర్పాటు కానున్నాయి. 13 అంశాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో హెక్టార్ వరకు అటవీ శాఖకు చెందిన స్థలాన్ని తీసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల విషయంలో రిజర్వ్ ఫారెస్టు ఎంత పోయినా నిర్మాణానికి అనుమతి ఇచ్చే అధికారాన్ని కేంద్రం కట్టబెట్టింది. గతంలో ఐదు హెక్టార్లు దాటితే కేంద్రం నుంచి అనుమతి తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవచ్చు. దీంతో పాటు వాటిలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు వీలుగా ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక రోడ్డు వేసేటప్పుడు ఎంత రిజర్వ్ ఫారెస్టు పోతుందో ఆన్లైన్లో సంబంధిత అధికారులు పేర్కొనాలి. దానిని డీఎఫ్‌వో, సీసీఎఫ్‌తో పాటు పీసీసీఎఫ్ చూస్తారు. అనంతరం పీసీసీఎఫ్ నుంచి డీఎఫ్‌వో వరకు పది రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. నిర్దేశించిన సమయానికి విచారణ పూర్తి చేసి ఆన్‌లైన్‌తో నివేదికను డీఎఫ్‌వో అందజేస్తారు. దానిపై పీసీసీఎఫ్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. దానిని పరిశీలించిన ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇస్తుంది. ఇదంతా నెల రోజుల్లో పూర్తి అవుతుంది. నిబంధనలను సడలించకుండా ఉంటే అటవీశాఖ నుంచి అనుమతి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి జిల్లాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీనిపై నర్సీపట్నం డీఎఫ్‌వో లక్ష్మన్ మాట్లాడుతూ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండడంతో కేంద్రం నిబంధనలు సడలించిందని చెప్పారు. ఇప్పుడు నేరుగా రాష్ట్రం అనుమతులు ఇవ్వవచ్చని తెలిపారు. అనుమతుల విషయంలోను జాప్య ం ఉండదన్నారు. -
రూ.87 కోట్లతో ఏజెన్సీలో రోడ్లు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లా ఏజెన్సీలోని మారుమూల గిరిజన నివాసిత ప్రాంతాలైన 248 హేబిటేషన్లను కలుపుతూ రూ.87 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. వివిధ శాఖలు ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్షించారు. గిరిజన సంక్షేమశాఖ చేపట్టిన 17 అభివృద్ధి పనులను జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచిం చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద 50 బోర్‌వెల్స్ విద్యుద్దీకరణను త్వరితగతిన చేయాలన్నారు. విద్యుత్ పొదుపు పాటించే వారికి ప్రోత్సాహకాలను ఈ నెల 7న పంపిణీ చేస్తున్నామన్నారు. ఏలూరు, తణుకులో తాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. జూలై 15కల్లా ఎర్రకాల్వ ప్రాజెక్టు, ఉప్పటేరు, చినకాపవరం డ్రెయిన్ల పనులన్నిటినీ పూర్తి చేయాలన్నారు. హాస్టళ్ల నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహం జిల్లాలో సాంఘిక సంక్షేమ భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యంపై కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆ శాఖ ఈఈ నాగశేషుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. జూలై నెలాఖరు నాటికి హాస్టళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపాలిటీల్లో రూ.120 కోట్లతో పనులు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో ఒక్కొక్క చోట రూ.30 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ తెలిపారు. మునిసిపాలిటీల్లో పూర్తి సర్వే నిర్వహించి నివేదికలు పంపించాలని కమిషనర్లను ఆదేశించారు. సమావే శంలో ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ, ఖజానా శాఖ డెప్యూటీ డెరైక్టర్ ఎన్వీకే మోహన్‌రావు, ఇరిగేషన్ ఎస్ఈ బి.రమణ, జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజువర్మ పాల్గొన్నారు.