ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లా ఏజెన్సీలోని మారుమూల గిరిజన నివాసిత ప్రాంతాలైన 248 హేబిటేషన్లను కలుపుతూ రూ.87 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. వివిధ శాఖలు ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్షించారు. గిరిజన సంక్షేమశాఖ చేపట్టిన 17 అభివృద్ధి పనులను జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచిం చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద 50 బోర్‌వెల్స్ విద్యుద్దీకరణను త్వరితగతిన చేయాలన్నారు. విద్యుత్ పొదుపు పాటించే వారికి ప్రోత్సాహకాలను ఈ నెల 7న పంపిణీ చేస్తున్నామన్నారు. ఏలూరు, తణుకులో తాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. జూలై 15కల్లా ఎర్రకాల్వ ప్రాజెక్టు, ఉప్పటేరు, చినకాపవరం డ్రెయిన్ల పనులన్నిటినీ పూర్తి చేయాలన్నారు.
హాస్టళ్ల నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహం
జిల్లాలో సాంఘిక సంక్షేమ భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యంపై కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆ శాఖ ఈఈ నాగశేషుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. జూలై నెలాఖరు నాటికి హాస్టళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
మునిసిపాలిటీల్లో రూ.120 కోట్లతో పనులు
నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో ఒక్కొక్క చోట రూ.30 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ తెలిపారు. మునిసిపాలిటీల్లో పూర్తి సర్వే నిర్వహించి నివేదికలు పంపించాలని కమిషనర్లను ఆదేశించారు. సమావే శంలో ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ, ఖజానా శాఖ డెప్యూటీ డెరైక్టర్ ఎన్‌వీకే మోహన్‌రావు, ఇరిగేషన్ ఎస్‌ఈ బి.రమణ, జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజువర్మ పాల్గొన్నారు.
రూ.87 కోట్లతో ఏజెన్సీలో రోడ్లు
Published Tue, Jun 3 2014 1:26 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement