కరీంనగర్ జిల్లా కొండగట్టులోని ఆంజనేయ ఆలయానికి భక్తుల రాక మొదలైంది.
మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టులోని ఆంజనేయ ఆలయానికి భక్తుల రాక మొదలైంది. శుక్రవారం ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల్లో పాల్గొనేందుకు హనుమాన్ మాల ధారులు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కాలినడకన కొండగట్టుకు చేరుకోవటం ఆనవాయితీ. సాయంత్రానికి దాదాపు 40వేల మంది మాలధారులు ఇక్కడికి చేరుకుంటారని అంచనా. రేపు జరిగే ఉత్సవాల్లో లక్ష మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు.