అంజన్న భక్తులతో జనసంద్రమైన కొండగట్టు | Devotees throng Kondagattu temple | Sakshi

అంజన్న భక్తులతో జనసంద్రమైన కొండగట్టు

Published Fri, May 23 2014 11:06 AM | Last Updated on Sat, Jun 2 2018 8:47 PM

అంజన్న భక్తులతో జనసంద్రమైన కొండగట్టు - Sakshi

అంజన్న భక్తులతో జనసంద్రమైన కొండగట్టు

కరీంనగర్‌ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తసంద్రమైంది.

హైదరాబాద్ : కరీంనగర్‌ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తసంద్రమైంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం అంజన్న మాలధారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాయుపుత్రుడు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా ఈరోజు తెల్లవారుజాము నుంచే  పవన పుత్రుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

అయితే ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 50వేలకు పైగా భక్తులు తరలి వచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హనుమన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులతో ఆంజనేయుని ఆలయాలు  కిటకిటలాడుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement