కొండగట్టుకు ఎన్నారై రూ. 5.80లక్షల విరాళం | NRI Rs. 5.80 lakh donation To Kondagattu | Sakshi
Sakshi News home page

కొండగట్టుకు ఎన్నారై రూ. 5.80లక్షల విరాళం

Published Tue, May 26 2015 10:26 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

NRI Rs. 5.80 lakh donation  To Kondagattu

మల్యాల(కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి జగిత్యాలకు చెందిన ధర్మపురి నీతూ వెంకటరమణ అనే ఎన్నారై రూ.5.80 లక్షల విరాళాన్ని అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఆయన మంగళవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భార్య నీతూ, కుమార్తె త్రిషలతో కలిసి విరాళాన్ని ఆలయ ఈవో నర్సింహులుకు అందజేశారు. భోగశాల నిర్మాణానికి రూ. 5 లక్షలు, నిత్యాన్నదానం కోసం రూ. 30 వేలు, నిత్యహోమం కోసం రూ. 50 వేలు వెచ్చించాలని కోరారు. ఆలయ అర్చకులు వెంకటరమణకు ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement