మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టు క్షేత్రానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నానికి 50 వేల మంది భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. క్యూలైన్లు అన్నీ నిండిపోయి భక్తులు బయట బారులు తీరారు. రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రానికి మరో 10 వేల మంది స్వామిని దర్శించుకుంటారని అంచనా.