అంజన్న కొండ.. భక్తులు నిండా.. | kondagattu fulfilled with hanuman devottes | Sakshi
Sakshi News home page

అంజన్న కొండ.. భక్తులు నిండా..

Published Thu, May 14 2015 6:48 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

అంజన్న కొండ.. భక్తులు నిండా..

అంజన్న కొండ.. భక్తులు నిండా..

మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో బుధవారం హనుమాన్ జయంత్యుత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం  భక్తులకు దర్శనం కల్పించారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు, హనుమాన్ దీక్షాపరులు తరలివచ్చారు. మంగళవారం రాత్రికే సుమారు లక్ష మంది కొండపైకి చేరుకున్నారు. రాత్రంతా భజనలు చేశారు. ఉదయం  ఇరుముడులు సమర్పించి మాల విరమణ చేసిన భక్తులు మొక్కులు చెల్లించారు. బుధవారం రాత్రి కరీంనగర్‌లో శ్రీరాముడు, హనుమంతుడు భారీ విగ్రహాలతో శోభాయూత్ర చేపట్టారు. పరిపూర్ణానందస్వామి ప్రజలనుద్దేశించి ప్రసంగిం చారు. హుండీల  ఆదాయూన్ని ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన పోలీసుల కుటుంబాలకు అందజేస్తామని యూత్ర నిర్వాహకులు బండి సంజయ్‌కుమార్ తెలిపారు.
 
రాముడి సన్నిధిలో హనుమాన్ భక్తులు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమజ్జయంత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. సీతారామచంద్రస్వామి, ఆంజనేయస్వామివారికి భక్తులు పూజలు చేశారు. హనుమాన్‌కు ఏకాం త తిరుమంజనం నిర్వహించారు. హనుమాన్ దీక్షధారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.  గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇరుముడులు సమర్పించి, దీక్ష విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement