బేగంపేట పోలీస్‌ లేన్‌లో హనుమాన్‌ జయంతి వేడుకలు | Police Celebrates Hanuman Jayanti At Begumpet | Sakshi
Sakshi News home page

బేగంపేట పోలీస్‌ లేన్‌లో హనుమాన్‌ జయంతి వేడుకలు

Published Thu, Apr 6 2023 8:28 PM | Last Updated on Thu, Apr 6 2023 8:59 PM

Police Celebrates Hanuman Jayanti At Begumpet - Sakshi

ఎప్పుడూ ఖాకీ దుస్తుల్లో కనిపించే రక్షక భటులు కాస్తా.. భక్తులుగా మారిపోయారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. బేగంపేట పోలీస్‌ లేన్‌ క్వార్టర్స్‌లో పోలీసుల కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

బేగంపేట పోలీస్‌ క్వార్టర్స్‌ లోపలి ప్రాంగణంలో దాదాపు మూడు దశాబ్దాల కిందట ఈ గుడిని నిర్మించారు పోలీసుల కుటుంబ సభ్యులు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా గుడిని విశాలంగా, సుందరంగా తీర్చిదిద్దారు. పలువురు రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖుల సహకారంతో గుడి ఆవరణకు ఒక రూపం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతీ హనుమాన్‌ జయంతి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. 

ఈ సారి ఉదయం నుంచే పూజలు నిర్వహించారు పోలీసులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో బేగంపేట ఏసీపీ GS చక్రవర్తి, పోలీసు కుటుంబ సభ్యుల్లో ఒకరైన రవి క్రియాశీలకంగా వ్యవహరించగా, ముఖ్యఅతిథిగా సినీ నటులు కృష్ణ భగవాన్‌, రాజకీయ నాయకులు దాసోజు శ్రవణ్‌ తదితరులు హాజరయ్యారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement