Adipurush Director Om Raut Visits Karmanghat Hanuman Temple In Hyderabad, Pics Viral - Sakshi
Sakshi News home page

Om Raut: హైదరాబాద్‌లోని ఆలయంలో ‘ఆదిపురుష్‌’ డైరెక్టర్‌ ప్రత్యేక పూజలు, ఫొటోలు వైరల్‌

Published Fri, Apr 7 2023 1:47 PM | Last Updated on Fri, Apr 7 2023 3:24 PM

Adipurush Director Om Raut Visits Karmanghat Hanuman Temple in Hyderabad - Sakshi

ఆది పురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు. గురువారం(ఏప్రిల్‌ 6న) హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌లోని ప్రముఖ హానుమాన్‌ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆదిపురుష్‌ టీం, పలువురు ప్రముఖులు ఆలయాన్ని సందర్శించారు. దీంతో ఓం రౌత్‌ను చూసేందుకు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆలయానికి భారీగా తరలివచ్చారు.

హైదరాబాద్‌లోని హనుమాన్‌ ఆలయంలో ఓంరౌత్‌ పూజలు చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆదిపురుష్‌ నుంచి హనుమాన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్‌-కృతిసనన్‌ జంటగా నటించిన ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన స్పెషల్‌ పోస్టర్‌పై ట్రోల్‌ చేశారు. కార్టున్‌ బొమ్మలా ఉందని, సీతకు మెడలో తాళి, కాళ్లకు మెట్టలు లేవంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

అంతేకాదు ఆది పురుష్‌ మూవీ మొదటి నుంచి ట్రోల్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ తర్వాత డైరెక్టర్‌ ఓం రౌత్‌పై ఫ్యాన్స్‌, నెటిజన్లతో పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీంతో గత జనవరిలో విడుదల కావాల్సిన ఈ మూవీని జూన్‌కి వాయిదా వేశారు. జూన్‌ 16ను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement