karmanghat
-
హైదరాబాద్‌లోని ఆలయంలో ఓం రౌత్ ప్రత్యేక పూజలు, ఫొటోలు వైరల్
ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ హైదరాబాద్‌లో సందడి చేశారు. గురువారం(ఏప్రిల్ 6న) హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని ప్రముఖ హానుమాన్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆదిపురుష్ టీం, పలువురు ప్రముఖులు ఆలయాన్ని సందర్శించారు. దీంతో ఓం రౌత్‌ను చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆలయానికి భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో ఓంరౌత్ పూజలు చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ నుంచి హనుమాన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్-కృతిసనన్ జంటగా నటించిన ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌పై ట్రోల్ చేశారు. కార్టున్ బొమ్మలా ఉందని, సీతకు మెడలో తాళి, కాళ్లకు మెట్టలు లేవంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆది పురుష్ మూవీ మొదటి నుంచి ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్ రిలీజ్ తర్వాత డైరెక్టర్ ఓం రౌత్‌పై ఫ్యాన్స్, నెటిజన్లతో పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీంతో గత జనవరిలో విడుదల కావాల్సిన ఈ మూవీని జూన్‌కి వాయిదా వేశారు. జూన్ 16ను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Jai Shri Ram 🏹 Jai Shri Ram 🏹 #OmRaut visited Karmanghat Hanuman Temple, Hyderabad on the occasion of #HanumanJayanti to seek blessings for his upcoming movie Adipurush.#Adipurush releases globally IN THEATRES on June 16, 2023, In 3D.#Prabhas @omraut #SaifAliKhan… pic.twitter.com/VgRMsSNP6u — Vamsi Kaka (@vamsikaka) April 6, 2023 -
చిన్నారి హత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది : కేటీఆర్
-
ఉసా, గస్తీ సంస్మరణ సభ రేపు
సాక్షి, హైదరాబాద్: ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉప్పుమావులూరి సాంబశివరావు(ఉసా), రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ సంస్మరణ ఆదివారం జరగనుంది. కర్మాన్‌ఘాట్ దుర్గానగర్‌లోని జేవీఆర్ ట్రస్ట్ భవన్లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ వీ చంద్రవదన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్. వినయ్‌కుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. దుగ్యాల అశోక్, సీఎల్ఎన్ గాంధీ, ఎస్. రామానందస్వామి, ఎం గంగాధర్, కె. వెంకటేశ్వరరావు, ఆర్. వెంకటేశ్వర్లు, డాక్టర్ సారంగపాణి ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరగనుంది. దళిత బహుజనుల ఆత్మగౌరవం కోసం జీవిత కాలం పోరాడిన ఉసా కరోనా బారిన పడి కన్నుమూశారు. జూలై 25న హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో జన్మించిన ఉసా దళిత, బహుజన, ఉద్యమ మేధావిగా ఎదిగారు. పీడిత ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసి ఉద్యమాల ఉపాధ్యాయుడిగా మన్ననలు అందుకున్నారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అశోక్ గస్తీ(55) సెప్టెంబర్ 17న కరోనాతో చనిపోయారు. కర్ణాటకలో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో అంచెలంచెలు ఎదిగి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ అగ్ర నాయకులు షాక్‌కు గురయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండానే అశోక్ గస్తీ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. -
కర్మన్‌ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
-
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: వీకెండ్ వచ్చిందంటే చాలు నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలను రోడ్డుమీదకు తీసుకు వస్తుండటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిసున్నా.. తాగి వాహనాలు నడిపే వారిని జైలుకి పంపిస్తున్నా వారిలో ఇంకా మార్పు రావడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయటమే కాకుండా.. అమాయకుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలను మరువక ముందే తాజాగా నగరంలో మరో రెండు చోట్ల కార్లు బీభత్సం సృష్టించాయి. కర్మన్‌ఘాట్ కర్మన్‌ఘాట్ చౌరస్తాలో ఆదివారం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. దీన్ని బట్టి అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో మల్లికార్జున్(డ్రైవింగ్), సాయిరామ్, సాయినాథ్‌లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు కళ్యాణ్ సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో గాయాలపాలైన కళ్యాణ్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో సాయిరామ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా.. కళ్యాణ్, సాయినాథ్‌లు పిలిప్స్ కంపెనీ లో మార్కెటింగ్ చేస్తున్నారు. మల్లికార్జున్ ఖాళీగా ఉంటున్నట్లు సమాచారం. గుర్రం గూడలో ఓ గెట్ టు గెదర్ పార్టీకి వెళ్ళి చంపాపేట్కి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు కళ్యాణ్ తెలిపారు. స్థానికల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్ కాగా ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో మరో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రాయల్ టిఫిన్స్ హోటల్లోకి దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తర్వాత అందులో ఉన్న యువకులు కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. కారు నెంబర్ ఆధారంగా యువకులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీకెండ్ కావడంతో ఫుల్లుగా తాగి రోడ్డు మీదకు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
గోడపై గుడి చరిత్ర!
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయం ఎవరు నిర్మించారు.. ఎప్పుడు నిర్మించారు.. ఆలయానికి వెళ్లే భక్తుల్లో చాలామందికి తెలియని విషయాలివి. కానీ, ఇప్పుడు ఆలయానికి వెళ్తే దాన్ని చారిత్రక కారణాలు, ఆలయ నిర్మాణం తర్వాత జరిగిన ఘటనలు కళ్లకు కట్టేలా గోడలపై చిత్రాలతో కూడిన వర్ణన కనిపిస్తుంది. ఈ దేవాలయం వెనక ఇంతటి నేపథ్యం ఉందా అని భక్తులు అబ్బురపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో ఆలయాల గురించి పుస్తకాల్లో తప్ప గుడిలో చెప్పేవారుండరు. అందుకే దేవాదాయశాఖ ఆలయాల చరిత్ర భక్తులకు తెలియజెప్పాలని నిర్ణయించింది. ఇక ఆలయాల చరిత్రకు ఆ గుడిగోడలు ఆలవా లం కానున్నాయి. అన్ని పురాతన దేవాలయాల నిర్మాణ నేపథ్యం వంటి వివరాలు దేవాలయాల గోడలపై రాయించాలని, చిత్రాలు వేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవా దాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయంలో దాని చరిత్రను గోడలపై ఏర్పాటు చేయించారు. దేవాలయాల ప్రాధాన్యం పెంచేందుకే..... పట్టణాలు, పల్లెల్లో ఇప్పుడు విరివిగా ఆలయాలు నిర్మితమవుతున్నాయి. చెత్తకుప్పల పక్కన, చిన్న, చిన్న ఇరుకు గదుల్లో, అపార్ట్మెంట్ తరహా నిర్మాణాలోనూ గుడులు వెలుస్తున్నాయి. కొన్ని గుడుల్లో, కొన్ని సందర్భాల్లో సినిమా పాటలు, రికార్డింగ్ డాన్సులు లాంటి వాటితో హోరెత్తిస్తున్నారు. దీంతో భక్తిభావం సన్నగిల్లేలా అవకాశముందనే ఫిర్యాదులు చాలాకాలంగా ఉన్నాయి. వీటివల్ల పురాతన దేవాలయాల ప్రాభవం తగ్గుతోంది. దీన్ని గమనంలో ఉంచుకుని దేవాదాయశాఖ భక్తుల్లో ఆలయాల ప్రాధాన్యంపై అవగాహన కల్పిం చి వాటి వైభవం పెరిగేలా చేయాలని నిర్ణయించింది. పెయింటింగ్స్‌కు కంటే మెరుగైన పద్ధతిలో... స్థానికులకు, ఆలయాలపై కొంత అవగాహన ఉన్నవారికే వాటి చరిత్ర తెలుస్తోంది. కొత్త భక్తులకు వాటి నేపథ్యంపై అవగాహన ఉండటం లేదు. ఇప్పుడు భక్తులందరికీ గుడుల చారిత్రక నేపథ్యంపై అవగాహన తెచ్చేలా ఈ ఏర్పాటు చేస్తున్నారు. గోడలపై పెయింటింగ్ వేయిస్తే అది ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదు. పండుగలప్పుడు రంగులేస్తే ఈ పెయింటింగ్స్ మలిగిపోయే అవకాశం ఉంది. అవసరమైనప్పుడు వాటిని తొలగించి మళ్లీ ఏర్పాటు చేసే అవకాశం ఉండే పద్ధతులను అనుసరిస్తున్నారు. -
బుల్లితెరపై పల్లెటూరి తార
ఇబ్రహీంపట్నం : బుల్లితెరపై పల్లెటూరి తార తళుక్కుమన్నది. ‘స్టార్ మా’లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్–2 రియాల్టీషోలో సెలబ్రెటీల సరసన ఆ గ్రామీణ యువతికి ఆవకాశం దక్కింది. ఇప్పటికే అబ్బురపరిచే డ్యాన్సులు, అద్బుతమైన డబ్స్మాష్ విన్యాసాలతో యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్‌ల్లో సంచలనం సృష్టించింది. రంగమ్మ మంగమ్మ ఏంపిల్లడూ... అంటూ సాగే పాటను డబ్స్మాష్ చేసి తన అద్భుతమైన నటనా ప్రావీణ్యంతో ప్రేక్షకుల నిరాజనాలను అందుకుంది. కోటీ 23 లక్షల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు. కళకు సృజనాత్మకతను జోడించి సినీ, టీవి, సామాజిక మాధ్యమాల్లో ఒక వెలుగు వెలుగుతోంది దీప్తి సునయన. ఆమె ప్రతిభను గుర్తించి బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెకు బిగ్‌బాస్–2 రియాల్టీషోలో అవకాశం కల్పించారు. హీరో నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో ఆమె తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. ఇంతకు ఈ యువతి ఎవరు..... దీప్తి సునయన ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడ గ్రామ పంచాయతీపరిధిలోని కర్ణంగూడ గ్రామానికి చెందిన బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గసభ్యుడు నల్లబోలు భోజిరెడ్డి కూతురు. ప్రస్తుతం వీరు నగరశివార్లలోని కర్మన్‌ఘాట్‌లో నివాసముంటున్నారు. నగరంలోని సెయింట్ ఆన్స్ కళాశాలలో దీప్తి బీఎస్సీ పూర్తిచేసింది. విద్యనభ్యసిస్తూనే తనలోని కళకు మెరుగులు దిద్దుకుంది. డ్యాన్స్‌లో ప్రతిభాపాటవాలు పొందింది. సినిమాల్లోని హీరో హీరోయిన్లు నటించిన సన్నివేశాలకు అనుగుణంగా వినూత్నరీతిలో నటించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి లక్షలాది మంది విక్షకులను సంపాదించుకుంది. నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా దీప్తి నటించింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్–2 రియల్టీషోలో నటిస్తుండటంతో ఈ ప్రాంతవాసులు ఎంతో గర్వపడుతున్నారు. సంతోషంగా ఉంది తన కుతూరు బిగ్‌బాస్ షోలో పాల్గొంటుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని దీప్తి సునయన తండ్రి భోజిరెడ్డి తెలిపారు. తాను ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తన కుతూరు పట్టుదలతో కృషిచేస్తోందన్నారు. తమ కుటుంబం నుంచి ఒక తార పుట్టుకురావడం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందన్నారు. -
ప్రియుడి మోజులో భర్తనే హత్య చేయించింది
-
‘పోలీసులు ఫోన్ చేశాకే తెలిసింది’
సాక్షి, హైదరాబాద్: ‘నా భర్తను నేను చంపలేదు. నాకేమి తెలియదు. పాలలో నిద్రమాత్రలు కలిపి నా భర్తకు ఇచ్చాను. కార్తీక్ చెబితేనే నిద్రమాత్రలు కలిపాను. నా భర్తను చంపేస్తారని నాకు తెలియదు. అపస్మారక స్థితిలో ఉన్న నా భర్తను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పలేదు. నా భర్తను చంపేశారని పోలీసులు ఫోన్ చేసి చెప్పిన తర్వాతే తెలిసింద’ని భర్త హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు జ్యోతి తెలిపింది. ఈ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన కార్పెంటర్ నాగరాజు హత్య కేసులో అతడి భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్, దీపక్, యాసీన్, నరేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యోతి, కార్తీక్, అతడి స్నేహితులు కలిసి పథకం ప్రకారం నాగరాజును హత్య చేశారని డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు. మీడియా ముందు జ్యోతి, నాగరాజు భిన్నవాదనలు వినిపించారు. భర్తను చంపాలని తాను అనుకోలేదని జ్యోతి చెప్పగా, ఆమె ఒత్తిడి చేయడం వల్లే నాగరాజును చంపామని కార్తీక్ వెల్లడించాడు. ‘డిసెంబర్ 30న పదేపదే ఫోన్లు చేసి జ్యోతి రమ్మని పిలిచింది. పొద్దున నుంచి ఒకటే ఫోన్లు చేసింది. నాగరాజుకు నిద్రమాత్రలు వేసేశానని ఫోన్ చేయడంతో నా ఫ్రెండ్స్‌ను తీసుకుని వెళ్లాను. తర్వాత మేమంతా కలిసి అతడిని చంపేశాం. తర్వాత శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి దూరంగా పడేశామ’ని కార్తీక్ వివరించాడు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. -
కర్మన్‌ఘాట్‌లో విషాదం..
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ దుర్గానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సత్యసాయి అపార్ట్మెంట్లో ఎలాంటి రక్షణలేని లిఫ్ట్.. పదేళ్ల పసిబాలుడి ప్రాణాల్ని మింగింది. ఆదివారం ఉదయం ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దుర్గానగర్‌లోని సత్యసాయి అపార్ట్మెంట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి గతకొంతకాలంగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు పదేళ్ల కొడుకు తస్సావంత్ ఉన్నాడు. ఆదివారం ఉదయం బాలుడు ఆడుకుంటూ.. లిఫ్ట్ కోసం ఏర్పాటుచేసిన బేస్గుంతలోకి తొంగిచూస్తుండగా కిందకు దూసుకొచ్చిన లిఫ్ట్ అతని తలకు బలంగా తగిలింది. దీంతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలుడి మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అపార్ట్మెంట్లో లిఫ్ట్‌కు ఎలాంటి రక్షణలు లేకపోవడంతోనే బాలుడు మృతిచెందాడని, అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ సిబ్బంది లిఫ్ట్‌ల విషయంలో నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారా? లేదా? అన్నది చూడకుండానే అపార్ట్మెంట్లకు అనుమతులు ఇస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. లిఫ్ట్ తలపై పడి పదేళ్ల బాలుడు మృతి -
లిఫ్ట్ తలపై పడి పదేళ్ల బాలుడు మృతి
-
కర్మన్‌ఘాట్‌లో చైన్ స్నాచింగ్
హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సరూర్ నగర్ పీస్ పరిధి కర్మన్ ఘాట్ శుభోదయకాలనిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. స్వాతి అనే మహిళ స్కూల్లో చదువుతున్న పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి రోడ్డుపక్కన వెళ్తుండగా పల్సర్ బైక్ వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని మూడు తులాల పుస్తెలతాడును తెంపుకుని పరారయ్యారు. ఈ క్రమంలో ఆమె కేకలు వేస్తూ దుండగులను నిలువరించేందుకు ప్రయత్నించగా మెడపై స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
కర్మన్‌ఘాట్ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం
-
కర్మన్‌ఘాట్‌లో పేలుడు.. ఫర్నిచర్ ధ్వంసం
-
కర్మన్‌ఘాట్‌లో పేలుడు.. ఫర్నిచర్ ధ్వంసం
హైదరాబాద్: ఓ ఇంట్లో పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది. సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ సాయిరాం నగర్ కాలనీలో ఆయిల్ వ్యాపారి పరశురాంరెడ్డి ఇంట్లో జరిగిన పేలుడు సంఘటనలో ఫర్నిచర్ ధ్వంసమైంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్‌స్కా్వడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. పేలుడుకు కారణమేంటి, సిలిండర్ వంటిది ఏమైనా పేలిందా వంటి సమాచారం తెలియరాలేదు. -
మద్యం మత్తులో కారుతో ఢీ కొట్టాడు
-
హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో కారు ప్రమాదం
-
భార్య కేసు పెట్టిందని..సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఈ సమాజంలో తరచూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కళ్లు చెదిరే వేతనాలు, విలాసవంతమైన జీవితం ఉంటుందనే కోటి ఆశలతో సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెడుతున్న యువత ఆ రంగంలో ఉండే ఒత్తిడి, కుంగుబాటును తట్టుకొని నిలబడలేకపోతుందనే వాదన వినిపిస్తోంది. ఇక నిన్నటికి నిన్న యాప్ రూపొందించాలన్న తన కల సక్సెస్ కాకపోవడంతో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడగా.. తాజాగా మరో టెక్కీ చిన్న కారణానికే ప్రాణాలు తీసుకున్నాడు. భార్య వేధింపుల కేసు పెట్టిందని మనస్థాపానికి లోనైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ పట్టణానికి చెందిన విజయ్‌కుమార్ (30) ఉప్పల్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఏడాదిక్రితం అదే పట్టణానికి చెందిన దివ్యతో వివాహం జరిగింది. కాగా వారు నాలుగు రోజులు మాత్రమే కలిసి ఉన్నారు. ఇద్దరి మద్య మనస్పర్థలు రావటంతో దివ్య పుట్టింట్లో ఉంటోంది. విజయకుమార్ కర్మన్‌ఘాట్ క్రాంతినగర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవల దివ్య అతనిపై వరంగల్ స్టేషన్లో 498ఏ కేసు పెట్టినట్లు నాలుగు రోజుల క్రితం అతని తండ్రి విద్యాసాగర్ ఫోన్ చేశాడు. గురువారం ఉదయం తండ్రి ఫోన్ చేయగా విజయ్‌కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఇబ్రహీంపట్నంలో ఇంజీనీరింగ్ చదువుతున్న తమ్ముడి కుమారుడు మహేష్‌కు సమాచారం అందింయాడు. అతను విజయ్‌కుమార్ ఇంటికి వెళ్లి పిలిచినా తలుపులు తీయకపోవటంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా విజయ్‌కుమార్ లుంగీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు. భార్య కేసు పెట్టిందన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. -
బ్యాంకువారు పత్రాలు పోగొడితే..?
వికటిస్తే విరుగుడు మధ్య తరగతి కల సొంతిల్లు. జీవితమంతా పైసా పైసా కూడబెట్టి ఇంటికోసమే ఖర్చు చేస్తారు. సరిపోలేదంటే ఇంటి పత్రాలు పెట్టి మరీ బ్యాంకులో లోను తీసుకుంటారు. లోను తీర్చేశాక ఆ పత్రాలు తిరిగి తీసుకుంటారు. అలాంటిది... లోను మొత్తం తీరాక, బ్యాంకువారు ఇంటి పత్రాలు తమ దగ్గర లేవని సమాధానం ఇస్తే ఏంటి పరిస్థితి?! హైదరాబాద్ కర్మన్‌ఘట్‌కు చెందిన విశ్రాంత ఆచార్యులు కె.బాల్రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన మాటల్లోనే... ‘‘ఉద్యోగిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో లోను తీసుకొని ఇల్లు నిర్మించుకున్నాను. 2008లో ఉద్యోగవిరమణ చేయగా ఆ సమయంలో వచ్చిన ప్రావిడెంట్ ఫండ్.. ఇతరత్రా కలిపి వచ్చిన డబ్బుతో బ్యాంకు లోను తీర్చాను. ‘లోను తీరింది, ఇంటి పత్రాలు ఇవ్వమ’ని బ్యాంకువారిని కోరాను. బ్యాంకులో పత్రాలు పోయాయి! బ్యాంకు వాళ్లు మూడు నెలలు టైమ్ అడిగారు. గడువు తర్వాత అడిగితే ‘బ్యాంక్ వేరే బిల్డింగ్‌లోకి మారుస్తున్నాం. అది పూర్తయిన తర్వాత ఇస్తాం’ అన్నారు. ఆ తర్వాత అడిగితే... ‘కొత్త బిల్డింగ్ కదా! అంతా మార్చే పనిలో ఉన్నాం, ఇంకొన్నాళ్లు ఆగండి’ అని బతిమాలారు. ఆ గడువు కూడా అయిపోయింది. పత్రాలు మాత్రం ఇవ్వలేదు. కోపం వచ్చి, ‘లాయర్ ద్వారా నోటీస్ ఇస్తాను’ అన్నాను. మరి కొన్ని రోజులు బతిమాలి గడిపేశారు. అలా ఏడాది గడచిపోయింది. చివరికి ‘మీ ఇష్టం సార్, ఏమైనా చేయండి. డాక్యుమెంట్స్ కనపడటం లేదు’ అన్నారు. నిర్ఘాంత పోయాను. అవసరం పడి ఇల్లు అమ్ముదామంటే, ‘రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి అప్రూవ్డ్ కాపీ తీసుకోవచ్చు’ అని సలహా ఒకటి ఇచ్చారు. అసలు పత్రాలు లేకపోతే స్థిరాస్తి విలువ 15 శాతం తక్కువ ధరకు పడిపోతుంది. ఆ విధంగా చూస్తే కోటి రూపాయల విలువైన ఆస్తికి 15-20 లక్షల రూపాయలు వదులుకోవాలి. ఆ నష్టాన్ని ఎవరు భరించాలి?! లాయర్ ద్వారా బ్యాంక్‌కు నోటీస్ పంపించాను. మూడు నెలల వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో, జిల్లా కన్జ్యూమర్ కోర్ట్‌లో కేసు ఫైల్ చేశాను. జిల్లా కోర్టులో 2 ఏళ్ల సమయం పట్టింది. ప్రభుత్వ స్టాంప్ డ్యూటీ యాక్ట్ కింద రూ.7 లక్షల 45 వేల రూపాయలు పరిహారం చెల్లించాలి అని కోర్టు బ్యాంక్ వారిని ఆదేశించింది. ప్రభుత్వ రేటు వేరు, మార్కెట్ రేటు వేరు. అందుకే సరైన న్యాయం కోసం స్టేట్ కన్జ్యూమర్ కోర్టుకు వెళ్లాను. అక్కడ మరో రెండేళ్లు పట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిందానికి కలిపి మరో 3 లక్షల నష్టపరిహారం ఇవ్వమని బ్యాంకును ఆదేశించింది. అంత మొత్తం చెల్లించడం ఇష్టం లేక బ్యాంక్ ఢిల్లీలోని జాతీయ వినియోగదారుల ఫోరమ్‌కు వెళ్లింది. స్టేట్ కన్జ్యూమర్ వారిని అడుగుదామంటే అప్పటికే రాష్ట్రవిభజన జరిగింది. కొత్త చైర్మన్ వస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు. ప్రతివాదిని కాబట్టి ఢిల్లీ వెళ్లి లాయర్ ద్వారా అప్పీల్ చేద్దాం అనుకున్నాను. కానీ, అప్పటికే రూ.50 వేల దాకా ఖర్చు అయ్యింది. ఢిల్లీ వెళితే కనీసం మరో 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది, అంతేకాకుండా మరో రెండేళ్ల టైమ్ పడుతుంది అన్నారు. ఇప్పటికే ఆరేళ్లు పట్టింది. ఇంకా సమయం అంటే.. అందుకే ఆగిపోయాను. ఫోరం నా వైపు నిలిచింది నేను వెళ్లకపోయినా బ్యాంక్ ఆ సొమ్మును ఇవ్వడం ఇష్టం లేక, నేషనల్ కోర్టుకు వెళ్లింది. జిల్లా కోర్టు, స్టేట్ కోర్టులో కేసు విధానాన్ని పరిశీలించిన జాతీయ కమిషన్ ఇటీవలే బ్యాంక్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇస్తూ తప్పనిసరిగా పరిహారం చెల్లించాల్సిందే అని ఆదేశించింది. అంతేకాదు, బ్యాంకు నిర్లక్ష్యాన్నీ తప్పు పట్టింది. ఇందుకు నేను చాలా ఆనందించాను. ఏ రకంగా చూసినా బ్యాంకుదే తప్పు. ఈ ఆరేళ్లలో ఏమీ అవసరం పడలేదు కాబట్టి ఇల్లు అమ్ముకోలేదు. అదే బిడ్డ పెళ్లి ఉందనో, అనారోగ్యం కారణంగానో డబ్బులు అవసరంపడి ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వస్తే... కేవలం అప్రూవ్డ్ కాపీ ఇస్తే బ్యాంకులు లోను ఇస్తాయా?! అందుకే ఇలాంటి సమస్య ఎదురైతే ఏం చేస్తాం అని సరిపెట్టుకోకుండా, తగిన న్యాయం కోసం వినియోగదారుల ఫోరమ్‌ని ఆశ్రయిస్తే తప్పక ఫలితం లభిస్తుంది. కాకపోతే కోర్టులు తీర్పులను వేగవంతంగా ఇస్తే వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.’’ -
నగరంలోని ఓ ఇంట్లో చోరి
హైదరాబాద్ : నగరంలోని కర్మన్‌ఘాట్ క్రాంతినగర్ లో ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. 6తులాల బంగారం, రూ.5వేల నగదు అపహరణకు గురయిందని బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.