హైదరాబాద్: ఓ ఇంట్లో పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది. సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ సాయిరాం నగర్ కాలనీలో ఆయిల్ వ్యాపారి పరశురాంరెడ్డి ఇంట్లో జరిగిన పేలుడు సంఘటనలో ఫర్నిచర్ ధ్వంసమైంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్స్కా్వడ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. పేలుడుకు కారణమేంటి, సిలిండర్ వంటిది ఏమైనా పేలిందా వంటి సమాచారం తెలియరాలేదు.