కర్మన్‌ఘాట్ చౌరస్తాలో ఆదివారం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. దీన్ని బట్టి అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో మల్లికార్జున్(డ్రైవింగ్), సాయిరామ్, సాయినాథ్‌లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు కళ్యాణ్ సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో గాయాలపాలైన కళ్యాణ్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో సాయిరామ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా.. కళ్యాణ్, సాయినాథ్‌లు పిలిప్స్ కంపెనీ లో మార్కెటింగ్ చేస్తున్నారు.