జీవితంలో రెండో ఛాన్స్ ఉంటుందేమో గానీ సినిమాల్లో ఉండదు. అందుకే తీస్తున్నప్పుడు సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మధ్య అలా 'ఆదిపురుష్' విషయంలో జరిగింది. దర్శకుడు ఓం రౌత్‌ని అయితే ప్రతి ఒక్కరూ ట్రోల్ చేశారు. బండబూతులు తిట్టారు. దీంతో ప్రభాస్ 'కల్కి' జాగ్రత్త పడింది. అలా జరగకూడదని ముందే డిసైడ్ అయి ఓ పని చేసింది.
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కల్కి 2898 AD'. ప్రాజెక్ట్ k అనే వర్కింగ్ టైటిల్‌తో మొన్నటివరకు నడిపించారు. కొన్నిరోజుల ముందు అమెరికాలో జరిగిన కామికాన్ ఫెస్ట్‌లో టైటిల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై బోలెడన్ని విమర్శలు రాగా, గ్లింప్స్ మాత్రం బాగానే అనిపించింది. ఇప్పుడు వీటన్నింటిపై వచ్చిన రివ్యూలని చిత్రబృందం పరిశీలిస్తోంది.
(ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?)
ఇందులో భాగంగా గ్లింప్స్ వీడియోలో గ్రాఫిక్స్‌పై ఎలాంటి రివ్యూలు వచ్చాయనేది దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఆ ఫొటోని నిర్మాత ప్రియాంక దత్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. వీటిని బట్టి ముందు ముందు గ్రాఫిక్స్ ఎలా ఉండనేది జాగ‍్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం వల్ల 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్‌కి కౌంటర‍్లు పడుతున్నాయి.
అదేంటి 'కల్కి' గ్లింప్స్ గ్రాఫిక్స్ రివ్యూలని చిత్రబృందం పరిశీలిస్తే.. ఓం రౌత్‌ని ఎందుకు తిడుతున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది సెప‍్టెంబరులో 'ఆదిపురుష్' టీజర్ విడుదల చేయగానే ప్రతి ఒక్కరూ దర‍్శకుడిని విమర్శించారు. గ్రాఫిక్స్ సరిచేసేందుకు మరో ఆరు నెలలు సమయం తీసుకున్నప్పటికీ పెద్దగా మార్పులేం చేయలేకపోయాడు. దీంతో సినిమా రిలీజైన తర్వాత ఆ తిట్లు తప్పలేదు. ఇలా తమ మూవీ విషయంలో తప్పు జరగకుండా 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త తీసుకోవడం మంచి పనే.
(ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!)
Comments
Please login to add a commentAdd a comment