కిటకిటలాడుతున్న హనుమాన్ ఆలయాలు
► హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
భద్రాచలం : హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడి ఆలయాలు భకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచే పలు ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రిలో శ్రీరామచంద్రస్వామి దర్శనానికి భక్తులకు ఏడు గంటల సమయం పడుతోంది. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా సీతారాముల దర్శనానికి భక్తులు పోటెత్తారు.
గోదావరి నదిలో హనుమాన్ మాలధారులు పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని మరో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పుణ్యక్షేత్రానికి భక్త జనం పోటెత్తింది. స్వామివారి దర్శనం కోసం సుమారు ఆరు గంటల సమయం పడుతోంది.