మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు | Devotees Heavy Rush In Srisailam 5 Hours For Darshanam | Sakshi
Sakshi News home page

మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

Published Mon, Jul 25 2016 10:54 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

Devotees Heavy Rush In Srisailam 5 Hours For Darshanam

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయి పురవీధుల వరకు బారులు తీరారు. స్వామివారి సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. 
 
హుండీ లెక్కింపులో స్థానికులకు అవకాశం
కాగా మల్లన్న హుండీ లెక్కింపు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా హుండీ లెక్కింపు కార్యక్రమంలోకి స్థానికులు, భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement