devotee rush
-
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,104 మంది స్వామివారిని దర్శించుకోగా 28,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.25 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం. టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలైన్లో అనుమతించారని తెలుపుతున్నారు. -
శివాలయాలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, శ్రీశైలం: కార్తీకమాసం చివరి రోజు, చివరి సోమవారం కావడంతో శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడి పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరించారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించారు. వేకువ జాము నుంచే క్యూలైన్లో వేలాదిమంది భక్తులు శివుని దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. శీఘ్రదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సాయంత్రం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు. తిరుపతిలో.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కపిల తీర్థం ఆలయం జలపాతం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపారాధన చేశారు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చివరి సోమవారం కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీకాళహస్తిలో.. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం స్వర్ణముఖి నదిలోకి కార్తీక దీపాలు వదిలిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో.. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా గోదావరి ఘాట్లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమండ్రిలో ఉమా మార్కండేయ స్వామి ఆలయం భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంకు తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ద్రాక్షారామ భీమేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా.. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. -
తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ.. టీటీడీ సూచనలివి
సాక్షి, తిరుపతి: తిరుమలలో రద్దీ కొనసాగుతోందని, రద్దీ కారణంగా, భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. సోమవారం ఉదయం టీటీ అధికారులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, శిలాతోరణం మార్గంలో గల క్యూలైన్స్, గోగర్భం డ్యాం వరకూ ఉన్న క్యూలైన్స్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం క్యూలైన్స్ వద్ద భక్తులకు అందుతున్న సౌఖర్యాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌఖర్యాలపై టీటీడీ అధికారులకు భూమన కరుణాకర్ రెడ్డి సలహాలు, సూచనలు చేసారు. టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ..పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని, స్వామీ వారి సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుందన్నారు. భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని తెలిపారు. క్యూలైన్స్లో ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు రేయింబవళ్ళు కష్టపడి సౌఖర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు దగ్గరుండి సౌకర్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవ టికెట్ల దర్శనాల్లో నియంత్రణ చేశామని భుమన తెలిపారు. నారాయణవనంలోని షెడ్లు దాటి ఐదు కిలో మీటర్ల దూరం మేర భక్తులు క్యూలైన్స్లో వేచి ఉన్నారని, లైన్లో ఉన్న భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పించడమే ధ్యేయంగా టీటీడీ అధికార యంత్రంగం పని చేస్తుందన్నారు. భక్తులకు ప్రాథమిక అవసరమైన ఆహారం, నీరును నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పారు. భక్తుల భధ్రత, సౌఖర్యాల పట్ల టీటీడీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పని చేస్తుందన్నారు. గత మూడు రోజులుగా అధిక రద్దీ కొనసాగుతుందని, అయితే వర్షంలో కూడా యాత్రికుల సౌలభ్యం కోసం ఆలయ అధికారులు పని చేశారని, ఇది అభినందించ విషయమన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలపై ఉన్న నియంత్రణ పూర్తిగా తొలగించామని, నడిచి వెళ్ళే భక్తులకు మరింత భధ్రత కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అపాయం లేదని అటవీ శాఖా అధికారులు చెప్పే వరకూ నడక మార్గంలో ఆంక్షలను అలానే కొనసాగిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. -
TTD: తిరుమల వెళ్లే భక్తులకు కీలక సూచన
సాక్షి, తిరుమల: వేసవి సెలవులు కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నాము. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నాము. తిరుమలకు వచ్చే భక్తులు కూడా రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామి వారి దర్శనానికి రావాలని కోరారు. ఇక, తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. సర్వదర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. ఇది కూడా చదవండి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు -
శ్రీగిరి.. భక్తుల సందడి
శ్రీశైలం: కార్తీ్తకమాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆదివారం నుంచి శ్రీశైలంలో భక్తుల సందడి కనిపించింది. ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో క్షేత్ర పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం ఉదయానికి భక్తుల సంఖ్య లక్షకు పైగా చేరుకోవడంతో ఉచిత, ప్రత్యేక, దర్శన క్యూలలో విపరీతమైన రద్దీ కనిపించింది. దీంతో ఈఓ భరత్గుప్త ఆలయపూజావేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 2.30గంటలకు మంగళవాయిద్యాలు, 3గంటలకు సుప్రభాతం, 4గంటలకు మహామంగళహారతి, 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. అభిషేక సేవాకర్తలను మాత్రం నిర్ణీత సమయంలో గర్భాలయంలోకి అనుమతించారు. మల్లన్నను అభిషేకించుకొని స్పర్శ దర్శనం చేసుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు ఆన్లైన్, కరెంట్ , ముందస్తు టిక్కెట్లను కొనుగోలు చేయడంతో 900కు పైగా అభిషేకాలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. నేడు పుష్కరిణి హారతి, లక్షదీపోత్సవం కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు పుష్కరిణి హారతితో పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటుకు ఈఓ భరత్ గుప్తా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 6.30గంటల నుంచి స్వామిఅమ్మవార్లకు పుష్కరిణి హారతులు నిర్వహిస్తారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి ప్రత్యేక వేదికపై వేంచేయింపజేసి విశేషపూజలు నిర్వహిస్తారు. అలాగే లోక కల్యాణార్థం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఉత్సవంలో భక్తులందరూ పాల్గొనే అకాశం కల్పించారు. ∙మల్లన్న దర్శనం కోసం నిరీక్షణ .. శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను ఉచిత దర్శన క్యూల ద్వారా దర్శించుకోవడానికి సుమారు 4 గంటల సమయం పట్టగా ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. గంటల తరబడి నిరీక్షించే భక్తులకు క్యూలోనే ప్రసాద వితరణ చేశారు. మంచినీరు, పిల్లలు, వృద్ధులకు బిస్కెట్లు, సాంబారన్నం అందించారు. దర్శనానంతరం అన్నపూర్ణభవన్లో భోజన ప్రసాదం వడ్డించారు. -
నేడు భక్తుల రద్దీ పెరిగింది: డీజీపీ
విజయవాడ : విజయవాడ నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి పుష్కర ఘాట్లకు ఉచిత సిటీ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఏపీ డీజీపీ ఎన్ సాంబశివరావు వెల్లడించారు. ఈ బస్సు సేవలను వినియోగించుకోవాలని యాత్రికులకు ఆయన సూచించారు. శనివారం పద్మావతి ఘాట్ను సాంబశివరావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నిన్నటితో పోల్చిస్తే.. అంటే కృష్ణా పుష్కరాల ప్రారంభం రోజు కంటే శనివారం భక్తుల రద్దీ పెరిగిందన్నారు. పుష్కర ఘాట్ల వద్ద పిల్లలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. -
రాజమహేంద్రవరంలో పోటెత్తిన భక్తులు
రాజమహేంద్రవరం: గోదావరి అంత్యపుష్కరాలు సోమవారం తొమ్మిదో రోజుకు చేరాయి. పుణ్యస్నానం ఆచరించడానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్లన్ని భక్తులతో కిటకిటలాడాయి. అయితే గోదావరిలోకి వరద నీరు భారీగా తరలి వస్తుంది. ఈ నేపథ్యంలో నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. నదిలో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులకు పలు హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, గన్నవరం, పెరవలి మండలం తీపర్రు, పెనుగొండ మండలం సిద్ధాంతం, నిడదవోలు మండలం పెండ్యాలతో పాటు కోవ్వూరులోని గోష్పాద క్షేత్రాల్లో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు భారీగా తరలి వచ్చారు. కోవ్వూరులో సోమవారం వేకువజాము నుంచి గౌతమి ఘాట్లో దాదాపు 50వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. గోదావరి వరద ఉధృతి కారణంగా మూడు ఘాట్లలో రెండింటిని అధికారులు మూసివేశారు. ఈ నెల 11వరకు అంత్య పుష్కరాలు కొనసాగుతాయి. -
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయి పురవీధుల వరకు బారులు తీరారు. స్వామివారి సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. హుండీ లెక్కింపులో స్థానికులకు అవకాశం కాగా మల్లన్న హుండీ లెక్కింపు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా హుండీ లెక్కింపు కార్యక్రమంలోకి స్థానికులు, భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయానికి భక్తుల రద్దీ తగ్గింది. మొత్తం రెండు కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటలు తీసుకుంటుండగా, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. కాగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా రెండు గంటల్లోనే పూర్తవుతున్నట్లు సమాచారం అందింది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనానికి సోమవారం 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం, నడకదారి భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.