సాక్షి, తిరుమల: వేసవి సెలవులు కావడంతో ప‍్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నాము. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నాము. తిరుమలకు వచ్చే భక్తులు కూడా రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామి వారి దర్శనానికి రావాలని కోరారు.
ఇక, తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. సర్వదర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది.
ఇది కూడా చదవండి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment