మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు హన్మకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కళ్యాణ మండపంలో రెండవ రోజూ కొనసాగింది.
హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ :
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు హన్మకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కళ్యాణ మండపంలో రెండవ రోజూ కొనసాగింది. మంగళవారం ఉదయం 10గంటలకు ప్రారంభమై రాత్రి 8గంటల వరకు జరిగింది. రెవెన్యూశాఖ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ డి.శంకర్, ఆర్డీవో మధుసూదన్, దేవాదాయ ధర్మాదాయశాఖ మల్టిజోన్ జాయింట్ డెరైక్టర్ కృష్ణవేణి , దేవాదాయశాఖ ఐదవ జోన్ డిప్యూటీ కమిషనర్ తాళ్లూరి రమేష్‌బాబు, జాతర ఇన్‌చారిజ దూస రాజేశ్వర్, అసిస్టెంట్ కమీషనర్ గొదుమ మల్లేషం పర్యవేక్షణలో 250 మంది రెవెన్యూ, దేవాదాయశాఖల సిబ్బంది, 30మంది బ్యాంకు సిబ్బంది కలిసి 68 హుండీల లెక్కింపు నిర్వహించారు. మంగళవారం లెక్కింపు ఆదాయం రూ.కోటి ముప్పై లక్షలు నమోదైందని దూస రాజేశ్వర్ ప్రకటించారు.