వెంకటాపురం, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకుని రామప్ప దేవాలయాన్ని సం దర్శించే భక్తులకు మెరుగైన సేవలు అందిం చేందుకు అన్నిశాఖల అధికారులు ఏర్పా ట్లు చేశారు. పోలీసు, రెవె న్యూ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, దేవదాయ, విద్యు త్‌శాఖ అధికారులు మంగళవా రం ఉద యం నుంచి రామప్పలో ఉంటూ భక్తులకు సేవలందిస్తున్నారు. మేడారం భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు సిబ్బం ది సోమవారం రాత్రి నుంచే విధుల్లో చేరారు. రామప్పలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి చెక్‌పోస్టుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. సుమారు 5 లక్షల పైచిలుకు హాజరయ్యే మేడారం భక్తులకు సకాలంలో అధికారులు సౌకర్యాలను కల్పించడంతో భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
వెంకటాపురం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో రామప్ప ఆలయ గార్డెన్‌లో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆనారోగ్యానికి గురైన 296 మందికి ఉచిత వైద్యసేవలు అందించినట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలి పారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ స్వామి హెల్త్ సూపర్‌వైజర్ కిరణ్‌కుమార్, ఏఎన్‌ఎంలు స్వర్ణలత, సరిత, అనురాధ, శోబారాణి, అనిత, వజ్ర, ఎల్‌టీ రజాక్ పాల్గొన్నారు. అలాగే తహసీల్దార్ పంతకంటి మంజుల ఆధ్వర్యంలో రామప్పలో రెవెన్యూశాఖ తరఫున సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రామప్పను సందర్శించే భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా సహాయ కేంద్రం ద్వారా వారికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించనున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రామప్ప ఆలయ పరిధిలో విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ఆలయ ఈఓ చిందం శ్రీనివాస్ తెలిపారు. ఆలయ గోపురానికి జీరో బల్బులు అమర్చడమేగాక ఆలయంలో, క్యూలైన్‌ల వద్ద, ఆలయ ఆవరణలో, గార్డెన్‌లో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయానికి వచ్చే భక్తులు క్యూలైన్ల ద్వారా రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని సహకరించాలని శ్రీనివాస్ కోరారు.
రామప్పకు మేడారం భక్తుల తాకిడి
Published Wed, Feb 12 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement