sammakka-saralamma jathara
-
మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు.. ఒక్కో ప్రయాణికుడికి ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16న ప్రారంభమైన జాతర 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. అయితే మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ ప్రధాన నగరాల నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హనుమకొండ నుంచి హెలికాప్టర్ సౌకర్యం కల్పించారు. కాజీపేటలోని సేయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. చార్జీలు ఇలా.. హన్మకొండ నుంచి మేడారం షటిల్ సర్వీస్ ఒక్కో ప్రయాణికుడికి (అప్ అండ్ డౌన్) రూ.19,999 జాతరలో 7,8 నిమిషాల ఏరియల్ వ్యూ రైడ్ ఒక్కొక్కరికి రూ.3,700 బుకింగ్ ఇలా.. హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా info@helitaxi.com ద్వారా చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మేడారం జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం బేగంపేట ఎయిర్‌పోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. జాయ్ రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సేవలు బుధవారం నుంచి ఆదివారం వరకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు. హెలికాప్టర్ చార్టర్ సర్వీస్ అయితే కరీంనగర్ నుంచి మేడారానికి రూ. 75,000గా నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి మేడారానికి రూ. 75,000, మహబూబ్‌నగర్ నుంచి మేడారానికి రూ. 1,00,000 టికెట్ ధరను నిర్ణయించారు. ఇందులో 5 సీట్లు ఉంటాయి. వీఐపీ దర్శనం కల్పిస్తారు. విశేష స్పందన డారంలో హెలీకాప్టర్ రైడ్‌కు విశేష స్పందన లభిస్తోంది. హెలికాప్టర్ ఎక్కి సమ్మక్క సారలమ్మ వార్ల గద్దెలు జంపన్న వాగు గుట్టలు పై నుంచి మేడారం అందాలు చూసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.. 2014 నుంచి వరంగల్ మామునూరు బేగంపేట విమానాశ్రయాల నుంచి మేడారానికి భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం మేడారంలో భక్తులను ఎక్కించుకొని తిప్పి చూపించే స్థాయికి హేలీ సర్వీసులు చేరుకున్నాయి. -
రెండో రోజూ హుండీల లెక్కింపు
హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు హన్మకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కళ్యాణ మండపంలో రెండవ రోజూ కొనసాగింది. మంగళవారం ఉదయం 10గంటలకు ప్రారంభమై రాత్రి 8గంటల వరకు జరిగింది. రెవెన్యూశాఖ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ డి.శంకర్, ఆర్డీవో మధుసూదన్, దేవాదాయ ధర్మాదాయశాఖ మల్టిజోన్ జాయింట్ డెరైక్టర్ కృష్ణవేణి , దేవాదాయశాఖ ఐదవ జోన్ డిప్యూటీ కమిషనర్ తాళ్లూరి రమేష్‌బాబు, జాతర ఇన్‌చారిజ దూస రాజేశ్వర్, అసిస్టెంట్ కమీషనర్ గొదుమ మల్లేషం పర్యవేక్షణలో 250 మంది రెవెన్యూ, దేవాదాయశాఖల సిబ్బంది, 30మంది బ్యాంకు సిబ్బంది కలిసి 68 హుండీల లెక్కింపు నిర్వహించారు. మంగళవారం లెక్కింపు ఆదాయం రూ.కోటి ముప్పై లక్షలు నమోదైందని దూస రాజేశ్వర్ ప్రకటించారు. -
రామప్పకు మేడారం భక్తుల తాకిడి
వెంకటాపురం, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకుని రామప్ప దేవాలయాన్ని సం దర్శించే భక్తులకు మెరుగైన సేవలు అందిం చేందుకు అన్నిశాఖల అధికారులు ఏర్పా ట్లు చేశారు. పోలీసు, రెవె న్యూ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్, దేవదాయ, విద్యు త్‌శాఖ అధికారులు మంగళవా రం ఉద యం నుంచి రామప్పలో ఉంటూ భక్తులకు సేవలందిస్తున్నారు. మేడారం భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు సిబ్బం ది సోమవారం రాత్రి నుంచే విధుల్లో చేరారు. రామప్పలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి చెక్‌పోస్టుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. సుమారు 5 లక్షల పైచిలుకు హాజరయ్యే మేడారం భక్తులకు సకాలంలో అధికారులు సౌకర్యాలను కల్పించడంతో భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వెంకటాపురం పీహెచ్సీ ఆధ్వర్యంలో రామప్ప ఆలయ గార్డెన్లో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆనారోగ్యానికి గురైన 296 మందికి ఉచిత వైద్యసేవలు అందించినట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలి పారు. కార్యక్రమంలో సీహెచ్ఓ స్వామి హెల్త్ సూపర్వైజర్ కిరణ్‌కుమార్, ఏఎన్ఎంలు స్వర్ణలత, సరిత, అనురాధ, శోబారాణి, అనిత, వజ్ర, ఎల్టీ రజాక్ పాల్గొన్నారు. అలాగే తహసీల్దార్ పంతకంటి మంజుల ఆధ్వర్యంలో రామప్పలో రెవెన్యూశాఖ తరఫున సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రామప్పను సందర్శించే భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా సహాయ కేంద్రం ద్వారా వారికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించనున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రామప్ప ఆలయ పరిధిలో విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ఆలయ ఈఓ చిందం శ్రీనివాస్ తెలిపారు. ఆలయ గోపురానికి జీరో బల్బులు అమర్చడమేగాక ఆలయంలో, క్యూలైన్ల వద్ద, ఆలయ ఆవరణలో, గార్డెన్లో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయానికి వచ్చే భక్తులు క్యూలైన్ల ద్వారా రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని సహకరించాలని శ్రీనివాస్ కోరారు. -
మేడారం జాతరకు ఆర్టీసీ
నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్ : ఆసియాలోనే పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈనెల 12వ తేదీ నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. జాతరకు జిల్లా నుంచి ఇప్పటికే భక్తులు బయలుదేరి వెళుతున్నారు. జాతరలో సేవలు అందించేందుకు ఆర్టీసీ, దేవాదాయ శాఖ అధికారులు బయలుదేరి వెళుతున్నారు. జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్ధం జిల్లా నుంచి పలు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ వారు నడుపుతున్నారు. ఇందుకు ఆర్టీసీ సర్వం సిద్ధం చేసింది. ప్రణాళికలు తయారు చేసుకొని మరీ బస్సులను కేటాయించింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు సైతం అక్కడే మకాం వేయనున్నారు. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ నుంచి 225 బస్సులు, ఆర్ఎం, డిపో మేనేజర్లతో పాటు అధికారులు, 450 డ్రైవర్లు, 225 కండక్టర్లు మేడారం జాతరలో ప్రయాణికులకు సేవలు అందించనున్నారు. తరలనున్న ఆర్టీసీ యంత్రాంగం .. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్‌కు సంబంధించిన అధికారులు అందరూ మేడారం ఏర్పాట్లకు వెళ్లనున్నారు. ఆర్టీసీ ఆర్ఎం కృష్ణకాంత్, నిజామాబాద్ డిపో-1, డిపో-2, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడలకు చెందిన డిపో మేనేజర్లు, సీటీఎమ్, సూపరింటెడెంట్లు, ఇతర అధికారులు వెళ్లనున్నారు. జిల్లా నుంచి 225 బస్సులను జాతరకు కేటాయించారు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక్క కండ క్టర్ చొప్పున బయలు దేరుతున్నారు. వీరే కాక మరికొంత మంది వాలంటీర్లను కూడా తీసుకుంటున్నారు. ఇలా జిల్లా నుంచి పెద్దసంఖ్యలో మేడారం జాతరలో అధికారులు ప్రయాణికులకు, భక్తులకు సేవలు అందించనున్నారు. వీరంతా సోమవారం వెళ్లి ఈనెల 16వ తేదీ వరకు అక్కడే విధులు నిర్వహించి, 17న జిల్లాకు తిరుగు పయనమవుతారు. జిల్లాలో ఉన్న ఆరు డిపోల నుంచి బస్సులను జాతరకు కేటాయించారు. ఈ బస్సులన్నీ సోమవారం నుంచి మేడారం జాతరకు సంబంధించి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. నిజామాబాద్ బస్టాండ్ నుంచి ప్రతి పది నిమిషాలకు వరంగల్‌కు బస్సు బయలు దేరుతుందని ఆర్ఎం కృష్ణకాంత్ తెలిపారు. -
ఉత్పత్తి లక్ష్యం గగనం
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దశాబ్దన్నర కాలంగా ఉత్పత్తి లక్ష్యాలు 100 శాతం సాధిస్తూ వస్తున్న సింగరేణి ఈయేడు నీలినీడలు కమ్ముకున్నాయి. ఈసారి 100 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే అవకాశం లేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తోం దని కీర్తి గడించిన సింగరేణికి ఇప్పుడా పరిస్థితులు కనబడం లేదు. దీంతో యాజమాన్యంలో గుబులు మొదలైంది. ఇన్నాళ్లుగా 100 శాతం ఉత్పత్తి సాధిస్తూ ్త, ఈసారి సాధించకుంటే కంపెనీ ప్రతిష్ట మసక బారుతోందని, పాత రోజులు పునరావృతమయ్యే అవకాశం ఉంటుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులపై జాప్యం ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణికి కలిసొచ్చినట్టు లేదు. మొదటి నుంచి ఉత్పత్తిపై ప్రభావం చూపే పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సర ంలోనే జరగాల్సిన కొన్ని ఓసీపీల ఓబీ టెండర్లు ఈ ఏడాది జరిగాయి. టెం డర్ అవార్డులో ఆలస్యం అయ్యింది. దీంతో భూ పాలపల్లి, మణుగూరు, మేడిపల్లి, శ్రీరాంపూర్ వంటి ఓసీపీల్లో ఓబీ పనులు నాలుగైదు నెల లుగా నడువలేదు. శ్రీరాంపూర్ ఓసీపీ అయితే 42 శాతం ఉత్పత్తి నమోదు చేసుకుంది. భూ నిర్వాసితుల సమస్య వల్ల ఉత్పత్తి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొదటి త్రైమాసికంలో ఈ ఓసీపీల్లో ఉత్పత్తి దెబ్బతింది. దీనికితోడు మణుగూరు ఓసీపీ-2, బెల్లంపల్లి ఓసీపీ-2 వంటి కొత్త ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతుల్లో జాప్యం చేసింది. ఇటీవలే మణుగూరు ఓసీపీకి అనుమతులు వచ్చాయి. రామకృష్ణాపూర్ ఓసీపీ కూడా ఓబీ అనుకున్న సమయంలో మొద లు కా లేదు. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి జరుగాల్సి ఉం డగా కొద్ది రోజుల నుంచి మట్టి పనులు మొద లు పెట్టారు. అంతే కాకుండా సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టిన ఆడ్రియాల ప్రా జెక్టు ఈ ఏడాది వార్షిక లక్ష్యానికి ఊతమిస్తుందనుకుంటే అది ఇప్పుడిప్పుడే మొదలైంది. దీనికితోడు వర్షాలు కూడా సింగరేణి ఉత్పత్తిని దెబ్బతీశాయి. జూలై, ఆగస్టు నెలలో కురిసి వర్షాల వల్ల ఓసీపీల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. నిర్లిప్త వ్యవస్థ.. సింగరేణి కంపెనీలో నిర్లిప్త పాలన సాగుతున్నది. కార్పొరేట్ స్థాయిలో ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం, గతంలో నర్సింగ్‌రావు చైర్మన్‌గా ఉన్న కాలంలో ఉన్నటు వంటి అజమాయిషీ ఇప్పుడు కొరవడింది. అవినీతి ఆరోపణలతో కొందరు అధికారులపై విజిలెన్సు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏది చేస్తే ఎక్కడికి వస్తుందో.. మనకెందుకులే అన్నట్లుగా అధికారులు నిర్ణయాలు తీసుకోవడంలో నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. మ్యాన్ పవర్ కొరత తీవ్రంగా ఉంది. ఫేస్ వర్కర్ల రిక్రూట్మెంట్ లేకపోవడం, ఉన్న వారు అధిక సంఖ్యలో పదవీ విరమణ పొందడం ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఫేస్ వర్కర్లే కాకుండా ట్రేడ్‌మెన్, సూపర్వైజర్ల కొరత ఉంది. చివరికి గనుల్లో సేఫ్టీ కూడా గాలిలో దీపం అయ్యింది. ఎస్డీఎల్ యంత్రాల పనితీరు గతేడాది నుంచి కంటే మందగించింది. మరమ్మతులు వస్తే వాటికి విడిబాగాలు కూడా అందుబాటులో లేవు. పనిముట్ల, పరికరాల కొతర తీవ్రంగా ఉంది. ఇక సమ్మక్క-సారలమ్మ వంతు.. సింగరేణికి సమక్క-సారలమ్మ జాతర కూడా ఈ ఏడు ఉత్పత్తికి ఆటంకం కలిగించనుంది. ఫిబ్రవరి రెండో వారం జాతర ఉంటుంది. సింగరేణిలో చాలా మంది కార్మికులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు ఉంటాయి. 80 శాతం ఈ వన దేవతలను కొలుస్తారు. దీంతో ప్రతి రెండేళ్లకోసారి వచ్చే జాతర సందర్భంగా గనుల్లో కార్మికుల హాజరు శాతం బాగా తక్కువగా నమోదవుతుంది. ఈసారి కూడా కార్మికుల హాజరు శాతం తగ్గి ఉత్పత్తిపై ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉంది. దీనికి తోడు ఫిబ్రవరి నెల చిన్న నెల(28 రోజులు) కావడం కొసమెరుపు. -
వడ్డన అ‘ధనం’
సాక్షి, మంచిర్యాల : సంక్రాంతి పండుగ, సమ్మక్క-సారలమ్మ జాతర జిల్లా ప్రజలపై ప్రయాణ భారాన్ని మోపనున్నాయి. సంక్రాంతి పండుగకు జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు మాత్రమే అదనపు బస్సులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ.. తూర్పు జిల్లావాసులను రైళ్లను ఆశ్రయించాలని పరోక్షంగా సూచిం చింది. మరోపక్క సమ్మక్క-సారలమ్మ జాతరకు జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్న అధికారులు ఆదిలాబాద్ డిపో బస్సులు కరీంనగర్ జిల్లా కాటారంకు పంపి.. అక్కడి నుంచి మన జిల్లాకు ప్రయాణికులను తరలించాలని నిర్ణయించింది. పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా గత జాతరకు తీసుకున్న చార్జీలకు ఈ సారి 10 శాతం నుంచి 15 శాతం పెంచింది. దీంతో జిల్లా ప్రజలపై ప్రయాణ భారం పడనుంది. మరోపక్క వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధికి వెళ్లిన తర్వాతే మేడారం జాతరకు వెళ్లాలనేది ఆనవాయితీ. వేములవాడకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. జాతర భారం 2012లో మేడారం జాతరకు జిల్లా నుంచి 330 బస్సులు నడిపిన ఆర్టీసీ ఈసారి అదనంగా 45 బస్సులు పెంచింది. వచ్చే నెల 9 నుంచి 15 తేదీ వరకు బస్సులు నడపనుంది. 2012లో నిర్వహించిన జాతరలో ఆర్టీసీ రూ.కోటిపైనే ఆదాయాన్ని ఆర్జించింది. ఈసారి డీజిల్ ధరలు పెరగడంతో ప్రయాణికులపై చార్జీల భారం మోపింది. మంచిర్యాల నుంచి మేడారంకు పెద్దలకు రూ.240, పిల్లలకు రూ.120, బెల్లంపల్లి నుంచి రూ.230, రూ.101, చెన్నూరు నుంచి రూ.270, రూ.135 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెండేళ్లకోసారి జరిగే గిరిజన జాతరకు జిల్లా నలుమూలలతోపాటు మహారాష్ట్ర నుంచి 10 లక్షలకు పైగా మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. జిల్లా పరిధిలోని మంచిర్యాల, జైపూర్, రామకృష్ణాపూర్, చెన్నూర్‌లలో మినీ మేడారం జాతర ఏర్పాటు చేసి వసతులు కల్పిస్తారు. భక్తుల్లో సుమారు 4 లక్షల మంది మేడారంకు తరలివెళ్తారు. మిగిలిన వారు జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. పెరిగిన చార్జీలతో మేడారం వెళ్లే జిల్లా ప్రయాణికులపై సగటున రూ.20 చొప్పున(చిన్నపిల్లలు, పెద్దలు) దాదాపు రూ.80 లక్షల భారం పడనుంది. తూర్పున రైళ్లే దిక్కు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు మాత్రమే బస్సులు నడపాలని నిర్ణయిం చింది. దీంతో రాష్ట్ర రాజధాని వెళ్లే పశ్చిమ ప్రాంతవాసులకు వెసులుబాటు కలిగింది. తూర్పు ప్రాంతంలో రైల్వేమార్గం ఉన్నందున ఎక్కువ మంది రైళ్ల ద్వారే ప్రయాణం సాగిస్తారని ఆర్టీసీ భావిస్తోంది. కొంత వరకు ఇది వాస్తవమే అయినా.. ప్ర స్తుతం పండుగ సీజన్లో దాదాపు చాలా మంది రైళ్లనే ఆశ్రయిస్తారు. మాలధారణ చేసిన అయ్యప్పస్వాముల రద్దీ రైళ్లలో అధికంగా ఉండడంతో చాలా మంది ఆర్టీసీ ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ైరె ళ్ల సమయపాలన లోపించడం.. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇబ్బందుల్లేని ప్రయాణం కోసం తూర్పు ప్రాంతవాసులు ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మందమర్రి, మంచిర్యాల నుంచి నిర్మల్, కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, వేములవాడ ప్రాంతాలకు రైలు మార్గం లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. డిమాండ్ ఉంటే నడుపుతాం.. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు 130 బస్సులు అదనంగా నడుపుతున్నాం. 8, 9,12 వ తేదీల్లో 10 బస్సుల చొప్పున, 10,11 తేదీల్లో 40 బస్సుల చొప్పున బస్సులు నడుపుతున్నాం. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. సమ్మక్క, సారలమ్మ జాతరకు సంబంధించి డీజిల్ ధరలు పెరగడంతో గత జాతర సమయంలో వసూలు చేసిన చార్జీలపై 10 శాతం నుంచి 15 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నాం. రవాణా పరంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం.- వెంకటేశ్వర్లు, ఆర్ఎం, ఆర్టీసీ -
లింకురోడ్డు నిర్మాణంతో రైతులకు నష్టం
మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్ : సమ్మక, సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం మేడారంలో చేపట్టనున్న లింకురోడ్డు నిర్మాణంతో స్థాని క రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జంపన్నవా గు సమీపంలోని చిలకలగుట్ట ప్రాంతంలో ఉన్న స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అక్కడి నుంచి నేరుగా అమ్మవార్ల గద్దెల వద్దకు వచ్చేందుకు రైతు ల పంటల పొలాల మధ్య నుంచి అధికారులు సుమారు 880 మీటర్ల మేరకు లింకురోడ్డును నిర్మించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం స్థానిక రెవెన్యూ అధికారులు ఆదివారం సర్వే నిర్వహించారు. అయితే లింకురోడ్డు నిర్మాణంతో స్థానిక రైతులు సుమారు 40 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తోంది. జాతరకు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం లింకురోడ్డు నిర్మాణం చేపట్టడం బాగానే ఉన్నప్పటికీ చేతికొచ్చిన పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే జాతర సందర్భంగా తాము రె ండో పంట సాగు చేయకుండా భక్తుల వసతి కోసం భూములను వదిలేస్తున్నప్పటికీ ప్రస్తుతం లింకురోడ్డు నిర్మాణం ద్వారా మరింత భూమిని కోల్పోవాల్సి వస్తుందని వారు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోతున్న విషయంపై బాధిత రైతులు ములుగు ఆర్డీఓ మోతీలాల్‌ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ లింకురోడ్డు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గిరిజన మహిళకు అస్వస్థత.. చిలకలగుట్ట స్నాన ఘట్టాల నుంచి చేపట్టనున్న లింకురోడ్డుతో తన భూమి పోతుందని ఆందోళనకు గురైన ఓ గిరిజన మహిళ గుండెనొప్పితో అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక రెడ్డిగూడేనికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నాలి సావిత్రికి ఉన్న ఎకరం భూమిలో కొంత భూమి స్నానఘట్టాల నుంచి అమ్మవార్ల గద్దెల వద్దకు చేపట్టే రోడ్డు నిర్మాణంలో పోతోంది. విషయం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలింది. గమనించిన స్థానికు లు చికిత్స నిమిత్తం ఆమెను హుటా హుటినా మేడారం కల్యాణ మండపంలోని వైద్యశాలకు తరలించారు.