మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్ : సమ్మక, సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం మేడారంలో చేపట్టనున్న లింకురోడ్డు నిర్మాణంతో స్థాని క రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జంపన్నవా గు సమీపంలోని చిలకలగుట్ట ప్రాంతంలో ఉన్న స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అక్కడి నుంచి నేరుగా అమ్మవార్ల గద్దెల వద్దకు వచ్చేందుకు రైతు ల పంటల పొలాల మధ్య నుంచి అధికారులు సుమారు 880 మీటర్ల మేరకు లింకురోడ్డును నిర్మించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం స్థానిక రెవెన్యూ అధికారులు ఆదివారం సర్వే నిర్వహించారు.
అయితే లింకురోడ్డు నిర్మాణంతో స్థానిక రైతులు సుమారు 40 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తోంది. జాతరకు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం లింకురోడ్డు నిర్మాణం చేపట్టడం బాగానే ఉన్నప్పటికీ చేతికొచ్చిన పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే జాతర సందర్భంగా తాము రె ండో పంట సాగు చేయకుండా భక్తుల వసతి కోసం భూములను వదిలేస్తున్నప్పటికీ ప్రస్తుతం లింకురోడ్డు నిర్మాణం ద్వారా మరింత భూమిని కోల్పోవాల్సి వస్తుందని వారు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోతున్న విషయంపై బాధిత రైతులు ములుగు ఆర్డీఓ మోతీలాల్‌ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ లింకురోడ్డు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
గిరిజన మహిళకు అస్వస్థత..
చిలకలగుట్ట స్నాన ఘట్టాల నుంచి చేపట్టనున్న లింకురోడ్డుతో తన భూమి పోతుందని ఆందోళనకు గురైన ఓ గిరిజన మహిళ గుండెనొప్పితో అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక రెడ్డిగూడేనికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నాలి సావిత్రికి ఉన్న ఎకరం భూమిలో కొంత భూమి స్నానఘట్టాల నుంచి అమ్మవార్ల గద్దెల వద్దకు చేపట్టే రోడ్డు నిర్మాణంలో పోతోంది. విషయం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలింది. గమనించిన స్థానికు లు చికిత్స నిమిత్తం ఆమెను హుటా హుటినా మేడారం కల్యాణ మండపంలోని వైద్యశాలకు తరలించారు.
లింకురోడ్డు నిర్మాణంతో రైతులకు నష్టం
Published Mon, Jan 6 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement