మేడారానికి హెలికాప్టర్‌ సర్వీసులు.. ఒక్కో ప్రయాణికుడికి ఎంతంటే? | Huge Response To Helicopter Ride To Medaram jatara , Full Details Inside | Sakshi
Sakshi News home page

Helicopter Services For Medaram Jatara: హెలికాప్టర్‌లో మేడారానికి.. ఒక్కో ప్రయాణికుడికి ఎంతంటే?

Published Thu, Feb 17 2022 1:38 PM | Last Updated on Thu, Feb 17 2022 2:48 PM

Huge Response To Helicopter Ride To Medaram jatara , Full Details Inside - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16న ప్రారంభమైన జాతర 19వ తేదీ వరకు కొనసాగనుంది.  ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. అయితే మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ ప్రధాన నగరాల నుంచి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హనుమకొండ నుంచి హెలికాప్టర్‌ సౌకర్యం కల్పించారు. కాజీపేటలోని సేయింట్‌ గాబ్రియల్‌ స్కూల్‌ గ్రౌండ్‌ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్‌ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది.

చార్జీలు ఇలా..
హన్మకొండ నుంచి మేడారం షటిల్‌ సర్వీస్‌ ఒక్కో ప్రయాణికుడికి (అప్‌ అండ్‌ డౌన్‌) రూ.19,999
జాతరలో 7,8 నిమిషాల ఏరియల్‌ వ్యూ రైడ్‌ ఒక్కొక్కరికి రూ.3,700 

బుకింగ్‌ ఇలా..
హెలికాప్టర్‌ టికెట్‌ బుకింగ్, ఇతర వివరాల కోసం 
94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా  info@helitaxi.com ద్వారా చేసుకోవచ్చు. 

హైదరాబాద్‌ నుంచి
మేడారం జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం బేగంపేట ఎయిర్‌పోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించారు. జాయ్‌ రైడ్‌, షటిల్‌ సర్వీస్‌, చార్టర్‌ సర్వీస్‌ అనే మూడు రకాల సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సేవలు బుధవారం నుంచి ఆదివారం వరకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు. హెలికాప్టర్‌ చార్టర్‌ సర్వీస్‌ అయితే కరీంనగర్‌ నుంచి మేడారానికి రూ. 75,000గా నిర్ణయించారు. హైదరాబాద్‌ నుంచి మేడారానికి రూ. 75,000, మహబూబ్‌నగర్‌ నుంచి మేడారానికి రూ. 1,00,000 టికెట్‌ ధరను నిర్ణయించారు. ఇందులో 5 సీట్లు ఉంటాయి. వీఐపీ దర్శనం కల్పిస్తారు.

విశేష స్పందన
డారంలో హెలీకాప్టర్‌ రైడ్‌కు విశేష స్పందన లభిస్తోంది. హెలికాప్టర్ ఎక్కి సమ్మక్క సారలమ్మ వార్ల గద్దెలు జంపన్న వాగు గుట్టలు పై నుంచి మేడారం అందాలు చూసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.. 2014 నుంచి వరంగల్ మామునూరు బేగంపేట విమానాశ్రయాల నుంచి మేడారానికి భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం మేడారంలో భక్తులను ఎక్కించుకొని తిప్పి చూపించే స్థాయికి హేలీ సర్వీసులు చేరుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement