
ధార్మిక పరిషత్తు ఏర్పాటు
దేవాదాయ శాఖ పనితీరుకు మార్గదర్శకంగా నిలిచే దేవాదాయ శాఖ ధార్మిక పరిషత్తును ప్రభుత్వం ఎట్టకేలకు ఏర్పాటు చేసింది.
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ పనితీరుకు మార్గదర్శకంగా నిలిచే దేవాదాయ శాఖ ధార్మిక పరిషత్తును ప్రభుత్వం ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి రెండు నెలలకు సమావేశమై దేవాదాయ శాఖ పనితీరును సమీక్షిస్తూ.. ఆలయాల అభ్యున్నతి, అర్చకుల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం పరిషత్తు విధి. గడిచిన ఏడాదిన్నరగా పరిషత్తు లేకపోవడంతో దేవాదాయ శాఖలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. పరిషత్తును పునరుద్ధరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా సీఎం పట్టించుకోలేదు.
కాగా, పరిషత్తులకు దేవాదాయ మంత్రి సి.రామచంద్రయ్య చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, రమేశ్ మలానీ, ఎస్వీ సుధాకర్‌రావు, పి.రామారావు, డి.మురళీకృష్ణారెడ్డి, పి.శ్రీపతిరాజు, ప్రహ్లాదరావు, సుయతేంద్రతీర్థ శ్రీపాదరావు (రాఘవేంద్ర స్వామి మఠాధిపతి), భారతి తీర్థ మహాస్వామి (శృంగేరీ పీఠం పీఠాధిపతి), సీఎన్ రావు, ఎల్.మాధవశెట్టి, మాజీ జస్టిస్ జి.భిక్షపతి,పి.గంగయ్యనాయుడు,ఎం.రామకృష్ణారెడ్డి, బీవీ నాగేశ్వరరావు(జీఎంఆర్ గ్రూపు), ఎస్వీ రామానుజాచార్యులు, విష్ణుభట్ల జగన్నాథ గణపతి, ఎన్.శ్రీకృష్ణ ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా జి.చెంగలరాయులు, టి.రవీందర్‌రావు, అట్లూరి సుబ్బారావు, ఎంవీ సౌందరరాజన్, తోట మధు, ఆర్.గోవిందహరి, ఎస్.సుధాకర్ పేర్లను ప్రకటించారు.