
వేదాల పరిరక్షణే టిటిడి ధ్యేయం:ఈఓ గోపాలన్
తిరుపతి: వేదాలను పరిరక్షించడమే తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ధ్యేయం అని ఈఓ గోపాలన్ చెప్పారు. శ్రీవెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం(ఎస్వివియు) రెండవ స్నాతకోత్సవం ముగిసింది. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ వేదాలలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని వెలుగులోకి తెస్తున్నట్లు చెప్పారు.
అన్ని వేద పాఠశాలలో ఒకే కరికులం ఉండేలా చర్యలు తీసుకుంటామని గోపాలన్ అన్నారు.