వెయ్యికాళ్ల మండపం తిరిగి నిర్మించాలి: రోజా | YSRCP MLA Roja Demands To Build Veyi kalla Mandapam | Sakshi
Sakshi News home page

వెయ్యికాళ్ల మండపం తిరిగి నిర్మించాలి: రోజా

Published Sat, Jun 16 2018 1:41 PM | Last Updated on Sat, Aug 25 2018 7:22 PM

YSRCP MLA Roja Demands To Build Veyi kalla Mandapam - Sakshi

సాక్షి, నగరి: తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. మండప నిర్మాణం కోసం కోర్టుని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. నగరి నియోజకవర్గంలోని టీడీడీ ఆలయాలను నాలుగేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆలయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీటీడీ ఈవోకు  వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ సమస్యలు పరిష్కరించాలని గత నాలుగేళ్లుగా అనేక విన్నపాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. కడప స్టీల్‌ ప్టాంట్‌ కోసం సీఎం రమేష్‌ దీక్ష చేస్తాననడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగిన టీడీపీ ఇప్పుడు కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. దోచుకున్న నిధులను దాచుకోవడానికి చంద్ర బాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement