
నగరి : వారాహి యాత్రలో పవన్‌కళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపైనా చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి ఆర్కే రోజా ఘాటుగా సమాధానమిచ్చారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ ఎక్కడకు వెళ్లినా బైబై చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రజలు ఆయనలా పూటకోమాట మార్చేవారు కాదన్నారు.
వారు ఇప్పటికే స్థిరమైన నిర్ణయంతో ఉన్నారని హాయ్ ఏపీ.. బైబై బీపీ (బాబూ, పవన్) అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. గుర్తు లేదు, 26 జిల్లాలకు అధ్యక్షులు లేరు. 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు లేరు. ఆయనెలా జగన్నను ఓడించేస్తాడో.. ఎలా తరిమేస్తాడో ఎవరికీ అర్ధం కావడం లేదని చెపారు. చంద్రబాబు అబద్దాలు ప్రజలు వినీవినీ విసిగిపోయారని ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కోవిడ్ లాంటి పరిస్థితిలో పొరుగు రాష్ట్రాలన్నీ ప్రజలను పట్టించుకోకపోతే, మన రాష్ట్రంలో మాత్రమే సరిపడే వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉంచి, సరైన వైద్యం అందించి ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు. నాయకుడు ఎలా ఉండాలో తెలియజెప్పడానికి కోవిడ్ సమయంలో జగనన్న తీసుకున్న నిర్ణయాలే సాక్ష్యాలని మంత్రి వివరించారు.