Veyi Kalla Mandapam
-
వెయ్యికాళ్ల మండపంపై హైకోర్టులో రోజా పిటిషన్
సాక్షి, తిరుమల : వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. మండపాన్ని కూల్చివేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయడం దారుణం అన్నారు. విషయాన్ని చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆరోపించారు. ప్రజల మనోభావాలని దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని హామి ఇచ్చారు. -
వెయ్యికాళ్ల మండపం తిరిగి నిర్మించాలి: రోజా
సాక్షి, నగరి: తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. మండప నిర్మాణం కోసం కోర్టుని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. నగరి నియోజకవర్గంలోని టీడీడీ ఆలయాలను నాలుగేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆలయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీటీడీ ఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ సమస్యలు పరిష్కరించాలని గత నాలుగేళ్లుగా అనేక విన్నపాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. కడప స్టీల్ ప్టాంట్ కోసం సీఎం రమేష్ దీక్ష చేస్తాననడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగిన టీడీపీ ఇప్పుడు కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. దోచుకున్న నిధులను దాచుకోవడానికి చంద్ర బాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. -
మళ్లీ మొదలైన వేయికాళ్ల మండపం వివాదం
తిరుమల : వేయికాళ్ల మండపం వివాదం మళ్లీ మొదలైంది. శ్రీవారి ఆలయం ఎదుటే వేయికాళ్ల మండపం నిర్మించాలంటూ గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే తాజాగా నారాయణగిరి ఉద్యానవనంలో రూ. 18 కోట్ల వ్యయంతో వేయికాళ్ల మండపం నిర్మాణానికి టీటీడీ సిద్ధమైంది. కాగా ఈ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కిషోర్ స్వామి, లక్ష్మణానాథాచార్యలు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీవారి ఆలయం ఎదురుగానే ఈ మండపం పునఃనిర్మాణం జరిగేలా టీటీడీని ఆదేశించాలంటూ వారు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే విధించింది. 2003లో తొలగించిన వేయికాళ్ల మండలం టీటీడీ తొలగించిన సంగతి తెలిసిందే.