సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం మనదని, మహిళా పక్షపాతి అయిన సీఎం జగనన్న పాలనలో మహిళలకు భరోసా కలుగుతోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. రాష్ట్రంలోని జెడ్పీ, మునిసిపల్ చైర్‌పర్సన్‌లు, మేయర్లు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల ద్వారా మహిళలకు జరుగుతున్న మేలును మహిళా సదస్సు ద్వారా ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. మహిళల పట్ల సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను విశదీకరించి ప్రజలకు తెలియచేయాలని సూచించారు.
చదవండి: (చంద్రబాబు చెంచాలు మద్యం తాగి మాట్లాడుతున్నారు: పద్మజ)
పండుగలా జరుపుకోవాలి: రోజా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును పండుగలా జరుపుకోవాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు, మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులతో రోజా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
చదవండి: (మేం చెప్పిందే చేశాం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: మల్లాది విష్ణు)
Comments
Please login to add a commentAdd a comment