woman empowerment
-
అతివకు అండగా..సెర్ఫ్ ఆధ్వర్యంలో‘విజన్ బిల్డింగ్’ కార్యక్రమం
నారాయణ్‌పేట్: గ్రామీణ ప్రాంతాల మహిళలు సంఘటితమయ్యేలా.. పొదుపుతో మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించేలా.. స్వయం ఉపాధి రంగాల్లో రాణించేలా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు మరిన్ని స్వయం సంఘాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) ఆద్వర్యంలో విజన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో బాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు మండలాలు ఎంపిక చేసుకున్న అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి మహిళ కుటుంబాన్ని ఆర్థికంగా ప్రగతి సాధించేందుకు అవసరమైన తోడ్పాటు అందించేలా ప్రణాళిక రూపొదించారు. ప్రభుత్వం అనుమతి అనంతరం ‘విజన్ బిల్డింగ్’ పనులు ముమ్మరంగా చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా సరికొత్త లక్ష్యం నిర్దేశించుకొని సంఘాల ఏర్పాటును చేపట్టింది. మహిళా పొదుపు సంఘాల ద్వారా రుణాలు పొంది చిరు వ్యాపారాలు, స్వయం సమృద్ధి పథకాలలో రుణాలు తీసుకొని లబ్దిపొందేలా చర్యలు తీసుకోనుంది. ఆరోగ్యం, విద్య, జోవనోపాధి, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయునున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి కొన్ని మండలాలను నమూనాగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఎంపిక చేసిన మండలాల ఏపీఎంలకు శిక్షణ పూర్తి చేశారు. మార్గదర్శకాల్లో పంచవర్ష ప్రణాళిక నమూనా మండల సమాఖ్యలుగా ఎంపికై న పరిధిలోని గ్రామాలోని గ్రామైక్య పొదుపు సంఘాల వారు ప్రతి నెలా రుణ వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లించేలా చూడాలి. తప్పనిసరిగా సమావేశాలు, రుణంతో వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేలా, ప్రస్థుతం ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా తీర్చిదిద్దుతారు. రుణాలు అవసరమైతే బ్యాంకులు, సీ్త్రనిధి నుంచి ఇప్పిస్తారు. ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యురాలు విజన్ మిషన్ అబ్జెక్టివ్ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్నకు తగ్గట్టుగా లక్ష్యాలను ఏర్పరుచుకోని, దానిని ఏటా కొంత వరకు సాదించేలా పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు. రానున్న ఐదేళకలల్లో ఈ లక్ష్యాలను చేరేలా చూసి, మహిళా సమాఖ్యలను ఆదర్శంగా మారుస్తారు. జిల్లాలో ఇలా .. జిల్లాలో విజన్ బిల్డింగ్ కార్యక్రమం కోసం మొదటి విడతలో మూడు మండలాలను, రెండో విడతలో మరో మూడు మండలాలను ఎంపిక చేశారు. ఇందులో నారాయణపేట, ఊట్కూర్, నర్వ మండలాలు మొదటి విడుతలో ఉండగా రెండో విడతలో మరో మూడు మండలాలు మాగనూర్, కృష్ణ, మరికల్లున్నాయి. ప్రతి ఏటా రూ.వందల కోట్లు రుణాలు అందిస్తున్నప్పటికి, వ్యాపారాల ఏర్పాటుకు వారి ఆర్థికాభివృద్ధికి ఉపయోగిస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతగా 102 మండల సమాఖ్యలను ఎంపిక చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాలో 16 మండలాలుండగా నారాయణపేట జిల్లాలో ఆరు మండలాలను ఎంపిక చేశారు. సద్వినియోగం చేసుకోవాలి మహిళా సమాఖ్యల్లోని సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో రాణిచేందుకు విజన్ బిల్డింగ్ అనే కొత్త కార్యక్రమానికి సెర్ప్ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు జిల్లాలో మూడు మండల సమాఖ్యలను ఎంపిక చేసి మండల ఏపీఎంలకు శిక్షణ ఇచ్చారు. పేదరిక నిర్మూలన కోసం విజన్ డాక్యుమెంట్‌ను ఐదేళ్ళ కోసం తయారు చేశాం. త్వరలో ఈ కార్యక్రమం అమలు చేసేందుకు చేపట్టాల్సిన విధి విధానాలను రూపొందించనున్నారు. – అంజయ్య, ఏపీడీ ప్రధాన లక్ష్యాలివి.. మహిళా సంఘాల్లోని ప్రతి సభ్యురాలికి సుస్థిర జీవనోపాధితో ఆధాయం వచ్చేలా చర్యలు చేపడతారు. దీనికోసం బ్యాంకు రుణాలు, సీ్త్రనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తారు. వ్యవసాయం, పశుపోషణ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు వృత్తినైపుణ్యం పెంపొదించడం, కుటిర పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తారు. నెలకు కనీసం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం సమకూరేలా చేస్తారు. సంఘాల బలోపేతానికి ఆర్థిక సహకారం అందిస్తారు. ఆన్లైన్ విధానంలో లావాదేవీలు, యాప్‌ల ద్వారా రికార్డుల నిర్వాహణ చేసేలా వారికి అవగాహన కల్పిస్తారు. సభ్యులందరికి బీమా, ఆర్థిక అక్షరాస్యత కల్పించనున్నారు. -
జర్నలిస్ట్ టూ ఎంటర్ప్రెన్యూర్.. రూబీసిన్హా సక్సెస్ స్టోరీ
రూబీ సిన్హా ప్రారంభించిన ‘షీ ఎట్ వర్క్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎంతోమంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు జ్ఞానకేంద్రంగా మారింది.‘అదిగో దారి’ అని దారి చూపే దిక్సూచి అయింది. ‘ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలు పెట్టారా? అయితే మీ దగ్గర ఉన్న శక్తిని బయటికి తీసుకురావల్సిన సమయం వచ్చింది. ఒక్కరిగా ప్రయాణం మొదలు పెట్టి వందలాదిమందికి స్ఫూర్తి ఇస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో మీరు ఒకరు ఎందుకు కాకూడదు!’ అంటూ ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఉత్సాహపరిచే రూబీ సిన్హా తాజాగా బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఉమెన్ వర్టికల్ అధ్యక్షురాలిగా నియామకం అయింది... దిల్లీకి చెందిన రూబీ సిన్హా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన తరువాత జర్నలిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. మరోవైపు వారాంతాలలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసేది. ఏమాత్రం తీరిక దొరికినా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేది. షార్ట్ ఫిల్మ్స్ తీసేది.అడ్వర్టైజింగ్ దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆమెకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది.ఒక బిడ్డకు తల్లి అయిన రూబీ ఇంటికే పరిమితం కావల్సి వచ్చింది. కొంత కాలం తరువాత స్నేహితులలో ఒకరు ఇండిపెండెంట్ పీఆర్ కన్సల్టెంట్‌గా ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఈ సలహా రూబీకి బాగా నచ్చింది. అలా మొదలైన ప్రయాణమే తనను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అన్నట్లు రూబీ సిన్హా ఎంటర్ప్రెన్యూర్ అయిన తరువాతగానీ మహిళ వ్యాపారవేత్తలు ఎదుర్కొనే సమస్యలు అర్థం కాలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ‘కమ్యూన్ బ్రాండ్ సొల్యూషన్స్’ ద్వారా కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసింది. అయితే తన విజయానికే పరిమితమై సంతృప్తి పడకుండా ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘షీ ఎట్ వర్క్’ ద్వారా ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది. ‘ప్రతి స్టార్టప్ ఐడియా సక్సెస్ కావాలని ఏమీ లేదు. కానీ ఎందుకు సక్సెస్ కాలేము అనే పట్టుదల ఉండే మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతాం. మన దేశంలో ఎంతో ప్రతిభ, సృజనాత్మకత ఉంది. వోలా క్యాబ్స్ నుంచి ఫ్లిప్‌కార్ట్ వరకు ఎన్నెన్నో విజయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చాలు’... ఇలాంటి మాటలు ఎన్నో ‘షీ ఎట్ వర్క్’లో కనిపిస్తాయి. ‘ఒంటరి ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. అయితే ఆ ప్రయాణం నీకు కొత్త శక్తి ఇస్తుంది’ అనే మాట రూబీకి చాలా ఇష్టం.తాను ఒంటరిగానే ప్రయాణం పెట్టింది.‘బడ్జెట్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం వరకు ఎంటర్ప్రెన్యూర్ ముందు ఎన్నో సవాళ్లు ఉంటాయి. అయితే అవేమీ జటిలమైన సవాళ్లు కాదు. ప్రతి సవాలు ఒక పాఠం నేర్పుతుంది. అలా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఎంటర్ప్రెన్యూర్ టీమ్ కెప్టెన్‌గానే కాదు టీమ్ మెంబర్‌గా కూడా వ్యవహరించాలి. టీమ్‌తో కలిసిపోయి వారికి ఉత్సాహాన్ని ఇవ్వాలి’ అంటుంది రూబీ. నేర్చుకోవడానికి చిన్నా,పెద్దా తేడా అనేది ఉండదు.‘నేను ఒకరి దగ్గర నేర్చుకోవడం ఏమిటి’ అనే అహం అడ్డొస్తే అదే అడ్డుగోడగా మారుతుంది. అయితే రూబీకి అలాంటి అహాలు లేవు.‘ఈ తరానికి అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం, తెలివితేటలు, చురుకుదనం ఉన్నాయి. వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటాను’ అంటుంది రూబీ.‘భవిషత్ దార్శనికత, వ్యూహ చతురత, అంకితభావం రూబీ సిన్హా బలాలు’ అంటున్నారు బ్రిక్స్ సీసీఐ డైరెక్టర్ జనరల్ మధుకర్.భౌగోళిక సరిహద్దులకు అతీతంగా స్త్రీ సాధికారతకు సంబంధించిన లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి బ్రిక్స్ సీసీఐ, ఉమెన్ వర్టికల్ ఏర్పాటయింది. ఇప్పుడు ఈ విభాగానికి రూబీ సిన్హా రూపంలో అంతులేని బలం చేకూరింది. -
సౌదీ స్పేస్ మిషన్‌లో లింగ సమానత్వం.. మహిళా వ్యోమగామికి చోటు
రియాధ్: సౌదీ అరేబియా తమ తొలి మహిళా వ్యోమగామి, పురుష వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపుతోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఈ మిషన్ చేపట్టనుంది. వ్యోమగాములు రేయానా బర్నావి, అలీ అల్కార్నీ AX-2 స్పేస్ మిషన్ సిబ్బందిలో చేరతారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకునేందుకు యాక్సియమ్ స్పేస్ చేపడుతున్న రెండో పూర్తి ప్రైవేట్ వ్యోమగామి మిషన్ ఇదే. మానవ జాతికి సేవ చేయడం, అంతరిక్షం అందించే ప్రయోజనాలు పొందడం కోసం మానవ అంతరిక్షయానంలో సౌదీ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ మిషన్ లక్ష్యం అని అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. ఈ మిషన్ అమెరికా నుంచి ప్రారంభం కానుంది. సౌదీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మరో ఇద్దరు వ్యోమగాములు మరియం ఫర్దౌస్, అలీ అల్గామ్డిలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. సౌది చేపడుతున్న ఈ అంతరిక్ష యాత్ర చారిత్రాత్మకమైనది. ఎందుకంటే ఒకే దేశానికి చెందిన ఇద్దరు వ్యోమగాములను ఒకేసారి ఐఎస్ఎస్కు తీసుకెళ్లిన ప్రపంచంలోని అది కొద్ది దేశాల్లో సౌదీ ఒకటిగా నిలుస్తుంది. ఇదిలాఉండగా సౌదీ యువరాజు, సౌదీ స్పేస్ కమిషన్ మొదటి ఛైర్మన్ సుల్తాన్ బిన్ సల్మాన్ అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అరబ్, ముస్లిం, రాయల్‌గా అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. మాజీ రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన ఈయన జూన్ 17, 1985న పేలోడ్ స్పెషలిస్ట్‌గా అమెరికన్ STS-51-G స్పేస్ షటిల్ మిషన్‌లో ప్రయాణించారు. చదవండి: ప్రతి నెల 14న ప్రేమికుల రోజు జరుపుకొనే దేశమేదో తెలుసా? -
కేంద్ర బడ్జెట్ 2023: గుడ్ న్యూస్.. మహిళల కోసం మరిన్ని పథకాలు
ప్రపంచ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. ఆనంతరం ఆమె ప్రసంగిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయన్నారు. మహిళల కోసం ప్రత్యేకం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల సమగ్ర అభివృద్ధిపై శ్రద్ద పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్లో రైతులు, యువత, మహిళలు ,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామన్న నిర్మలమ్మ వారి కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడం బడ్జెట్లోని ముఖ్యమైన వాటిలో ఒకటి అని చెప్పారు. యువతకు ఉపాధి లభించేలా ఉద్యోగాల వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక వ్యవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్సిడ్ డిపాజిట్ పథకంలో ఖాతాదారులు చేసే డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది. -
లాయర్ల కుటుంబం నుంచి వచ్చి.. కాస్మోటిక్ బేస్డ్ స్టార్టప్‌తో ఎదిగి..
జార్ఖండ్‌లోని రాంచిలో పుట్టి పెరిగింది రోమిత. తండ్రి న్యాయవాది. తల్లిదండ్రులు తన పట్ల ఎప్పుడూ వివక్ష ప్రదర్శించలేదు. సోదరుడితో సమానంగా పెంచారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బిజినెస్ ఎకనామిక్స్ చదువుకునే రోజుల్లో కూడా తనకు వివక్ష ఎదురు కాలేదు. హార్బర్ రిడ్జ్ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది రోమిత. ఆ తరువాత వెంచర్ క్యాపిటలిస్ట్(వీసి)గా కూడా తనను తాను నిరూపించుకుంది. ఒకానొకరోజు...తనకు వ్యాపారరంగంలోకి ప్రవేశించాలని ఆలోచన వచ్చింది. లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన రోమితకు ఎలాంటి వ్యాపార అనుభవం లేదు. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అని అనుకొని ఉంటే తన కలను నెరవేర్చుకునేది కాదు. కాస్మోటిక్స్ బేస్డ్ స్టార్టప్ గురించి ఆలోచనతో నిధుల సమీకరణకు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు తనను బాధ పెట్టే ఎన్నో అనుభవాలు, ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీరు మాత్రమేనా?’ ‘మేల్ కో–ఫౌండర్ ఎవరూ లేరా? ‘మీకు పెళ్లి అయిందా? అయితే పూర్తి సమయం కంపెనీ కోసం ఎలా కేటాయించగలరు?’ ‘మీరు సీరియస్‌గా వ్యాపారరంగంలోకి వచ్చినట్లుగా అనిపించడం లేదు. ఏదో సరదాగా వచ్చినట్లు అనిపిస్తుంది’... ఇవి మనసులోకి తీసుకునే ఉంటే రోమిత మజుందార్ తిరిగి వెనక్కి వెళ్లేదే తప్ప ముందుకు అడుగు వేసేది కాదు. ఎన్నో రకాల అనుమానాలు, అవమానాలను ఎదుర్కొని ఎట్టకేలకు కాస్మోటిక్ బేస్డ్ స్టార్టప్ ‘ఫాక్స్‌టేల్’తో తన కలను నిజం చేసుకుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ నాలుగు రకాల ఉత్పత్తులతో మార్కెట్లోకి ప్రవేశించి కొద్దికాలంలోనే విజయకేతనం ఎగరేసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రోమిత మజుందార్ మంచి పేరు తెచ్చుకుంది. చదవండి: Viral: 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా! ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. వీడియో వైరల్ -
Sunitha Krishnan: దయచేసి మారండి!
మహిళల అక్రమ రవాణా... ప్రభుత్వాలకు పెద్ద సవాల్. సమాజానికి తలవంపులు. బాధిత మహిళకు విషమ పరీక్ష. మహిళల రక్షణ ఆమె ఆకాంక్ష. తనకు తెలిసిన మార్గం పోరాటమే. పోరాటం... పోరాటం... పోరాటం. అసాంఘిక శక్తులతో పోరాటం. సామాజిక పరిస్థితులతో పోరాటం. మనసు మారితే సమాజం మారుతుంది. ఇప్పుడు ఆ మార్పు కోసం అభ్యర్థిస్తోంది. సునీతాకృష్ణన్ ‘నా బంగారు తల్లి’ సినిమా తీసి దాదాపుగా దశాబ్దమవుతోంది. మహిళలను మోసగించి అక్రమ రవాణాకు పాల్పడే దుర్మార్గాన్ని ఆ సినిమాలో కళ్లకు కట్టారు సునీతా కృష్ణన్, ఆమె భర్త రాజేశ్ టచ్‌రివర్. ప్రతి సన్నివేశమూ వాస్తవానికి అద్దం పట్టింది. సినిమా క్లైమాక్స్ దృశ్యాలు కన్నీటి పర్యంతం చేస్తాయి, మనసు ద్రవించిపోతుంది. సమాజంలో మహిళ ఎదుర్కొనే దాష్టీకాలకు మౌనంగా రోదిస్తూ బయటకు వస్తారు ప్రేక్షకులు. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం అది. ఆ సందర్భంగా నిర్మాత సునీతా కృష్ణన్ మాట్లాడుతూ ‘‘1996లో ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుంచి పోరాడుతున్నాను. అంతకంటే ముందు ప్రజ్వల వంటి ఫౌండేషన్ అవసరం ఉందని గ్రహించే వరకు నేను గుర్తించిన సామాజికాంశాలన్నింటి మీదా పోరాడాను. ‘స్త్రీ అంగడి సరుకు కాదు, దేహం మీద దాడి చేస్తే ఆమె మనసు ఎంతగా రోదిస్తుందో ఆలోచించండి’ అని గొంతుచించుకుని చెప్తున్నాను. నా ఉద్యమం సమాజంలో ప్రతి ఒక్కరినీ చేరాలంటే, ఏకకాలంలో ఎక్కువమందిని సెన్సిటైజ్ చేయాలంటే ప్రభావవంతమైన మాధ్యమం అవసరం అనిపించింది. అందుకే సినిమా తీశాను. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఎవరైనా కనీసం ఒక్క క్షణమైనా ఆలోచించకపోతారా, స్త్రీ దేహాన్ని మాత్రమే కాంక్షించే మగవాళ్లకు తమ ఇళ్లలో ఉండే ఆడబిడ్డలు కళ్ల ముందు మెదలకపోతారా’ అనేది మా ఆశ. నేను యాక్టివిస్ట్‌ని, నా భర్త సినిమా దర్శకుడు కావడంతో మా ఆలోచన అనుకున్నది అనుకున్నట్లే కార్యరూపం దాల్చింది. ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చిత్రించాం’’ అని చెప్పారామె. ఆమె సామాజిక సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు (మహిళాసాధికారత విభాగం)కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అనుభవాలివి. ఎక్కడ ఉన్నా పోరాటమే! ‘‘నేను బెంగళూరులో పుట్టిన మలయాళీని. నేను పుట్టిన నెలరోజులకే మా నాన్నకు హైదరాబాద్‌కు బదిలీ అయింది. నా బాల్యం మూడేళ్లు ఇక్కడే గడిచింది. నేను మహిళల కోసం పని చేయడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం అనుకోకుండా జరిగింది. బెంగళూరులో స్టూడెంట్‌గా నేను ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. స్త్రీ దేహం కాస్మటిక్ కంపెనీల నిబంధనల చట్రంలో ఇమడాలనే భావనను వ్యతిరేకించాను. స్త్రీ దేహం ఫలానా కొలతల్లో ఉంటేనే అందం అని ఒకరు నిర్ణయించడమేంటి, ఆ మాయలో చిక్కుకుని అమ్మాయిలు తమ దేహాన్ని నియంత్రించుకోవడానికి తంటాలు పడడం ఏమిటి? అని... స్త్రీ దేహాన్ని మార్కెట్ వస్తువుగా పరిగణించే ధోరణిని నిరసిస్తూ అందాల పోటీల నిర్వహణను అడ్డుకుని రెండు నెలలు జైల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఇరవై రెండేళ్లు. నేను ఉద్యమించి జైలుకెళ్లడాన్ని మా ఇంట్లో సమ్మతించలేకపోయారు. అలా ఇల్లు వదిలి వచ్చేశాను. ఎక్కడికెళ్లాలో తెలియదు. రైల్వే స్టేషన్‌కెళ్లి కౌంటర్లో ఎటువెళ్లే రైళ్లున్నాయని అడిగాను. వాళ్లు చెప్పిన పేర్లలో ‘హైదరాబాద్’ వినిపించగానే ‘టికెట్ ఇవ్వండి’ అనేశాను. అలా హైదరాబాద్, చాదర్‌ఘాట్‌లో నివసిస్తున్న ఓ మిత్రురాలింటికి వచ్చాను. ఇక్కడ కూడా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మూసీ నది తీరాన్ని ‘నందనవనం’గా మార్చాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ‘పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే మా ఇళ్లను కూలగొట్టండి’ అంటూ రోడ్డెక్కాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో ‘మెహబూబ్ కీ మెహందీ’లో నివసిస్తున్న వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఆ మహిళల కోసం ఏదైనా చేయాలని పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాను. లైంగికహింస, అక్రమ రవాణాలకు గురయ్యి జైళ్లు, హోమ్‌లలో ఉన్న మహిళలను కలిశాను. వాళ్లలో చాలామంది తమ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వమని కోరారు. అలా ఐదుగురు పిల్లలతో స్కూలు ప్రారంభించాను. ఆ తర్వాత పదిమంది పిల్లలతో షెల్టర్ హోమ్ పెట్టాను. అలా మొదలైన చిన్న ప్రయత్నం ఇప్పుడు పదిహేడు ట్రాన్సిషన్ సెంటర్లలో ఏడు వందల మంది పిల్లలు చదువుకునేంతగా పరిణమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు పన్నెండు వేల మంది చదువుకుని గౌరవప్రదమైన జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ ఫౌండేషన్ అవసరం ఉండకూడదు! ఆడపిల్లల అక్రమ రవాణాదారులు ఒక అమ్మాయిని తీసుకువచ్చినట్లు సమాచారం అందగానే దూకుడుగా వెళ్లిపోయేదాన్ని. అడ్డువచ్చిన వాళ్లతో బాహాబాహీకి దిగి మరీ ఆడపిల్లలను బయటకు తీసుకువచ్చేదాన్ని. అలా లెక్కలేనన్నిసార్లు నా మీద దాడులు జరిగాయి. చెవి మీద తగిలిన దెబ్బ కారణంగా వినికిడి కూడా తగ్గింది. ఆ దాడులను పట్టించుకోలేదు. కానీ నా అనుచరుడిని హత్య చేశారు. అప్పుడు నా పంథా మార్చుకుని పోలీస్, మహిళా సంక్షేమశాఖల వంటి ప్రభుత్వ వ్యవస్థలతో కలిసి పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 96 వేల మంది బాలికలు, యువతులు, మహిళలను రక్షించగలిగాను. ఆ నంబరు ఇంత పెద్దదిగా ఉన్నందుకు గర్వపడడం కాదు మనం సిగ్గుపడాలి. స్త్రీల రక్షణ కోసం ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించాను. సమాజంలో స్త్రీల అక్రమ రవాణా పూర్తిగా అంతరించిపోవాలి. నేను బతికి ఉండగానే ఈ ఫౌండేషన్‌ను మూసివేయాలనేది నా ఆకాంక్ష. సమాజంలో సున్నితత్వం పెరిగి, మంచి మార్పు రావాలని అందరం ఆశిద్దాం. – సునీతాకృష్ణన్, సామాజిక ఉద్యమకారిణి మగవాళ్లకు చెప్పాలి! నా బంగారు తల్లి సినిమాతో సమాజాన్ని ఆలోచింపచేయగలిగాను. ఆ సినిమాకి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నాలుగు నంది అవార్డులు ప్రకటించింది. ఇప్పుడు మగవారి మీద దృష్టి పెట్టాను. ఆడవాళ్ల మీద జరిగే దాడులను, మోసాలను అరికట్టడానికి భుజబలం ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం కంటే మగవాళ్లను చైతన్యవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చనిపించింది. అందుకే ఇప్పుడు ‘మ్యాన్ అగెనెస్ట్ డిమాండ్ (మ్యాడ్)’ నినాదంతో ముందుకు వెళ్తున్నాను. ‘మీ లైంగిక అవసరాలకు ఇతర స్త్రీలను కోరుకోవడం మానేయండి, మీలో ఈ మార్పు వస్తే స్త్రీల అక్రమ రవాణా మాఫియా దానంతట అదే అంతరించిపోతుంది’ అని అభ్యర్థిస్తున్నాను. మనిషిలో సహజంగానే సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వాన్ని పురుషాహంకారంతో అణచివేయకుండా ఉంటే చాలు. మార్పు వచ్చి తీరుతుంది’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు సునీతా కృష్ణన్. ఇరవై ఆరేళ్ల తన పోరాటంలో తిరస్కారాలు తప్ప పురస్కారాలు అందలేదని, తన సొంతరాష్ట్రం కేరళలో ప్రభుత్వ పురస్కారం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దక్కిన తొలి గౌరవం ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అని సంతోషం వ్యక్తం చేశారామె. – వాకా మంజులారెడ్డి -
ఏపీలో ‘మహిళా సాధికారత’ను ఎలుగెత్తి చాటుదాం
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం మనదని, మహిళా పక్షపాతి అయిన సీఎం జగనన్న పాలనలో మహిళలకు భరోసా కలుగుతోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. రాష్ట్రంలోని జెడ్పీ, మునిసిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల ద్వారా మహిళలకు జరుగుతున్న మేలును మహిళా సదస్సు ద్వారా ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. మహిళల పట్ల సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను విశదీకరించి ప్రజలకు తెలియచేయాలని సూచించారు. చదవండి: (చంద్రబాబు చెంచాలు మద్యం తాగి మాట్లాడుతున్నారు: పద్మజ) పండుగలా జరుపుకోవాలి: రోజా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును పండుగలా జరుపుకోవాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు, మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులతో రోజా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చదవండి: (మేం చెప్పిందే చేశాం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: మల్లాది విష్ణు) -
మేం చెప్పిందే చేశాం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ మహిళా పక్షపాతి. గతంలో ఎవరూ చేయనంతగా మహిళలకు ఈ రెండేళ్లలో జగన్ మేలు చేకూర్చారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మహిళలకు రాజకీయాల్లోనూ ప్రాధాన్యం కల్పించారు. నామినేటెడ్ పోస్టులు, మున్సిపల్ పదవుల్లోనూ 50% శాతం కేటాయించారు. మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని, యాప్‌ను రూపొందించారు. మహిళా సాధికారత కోసం నిరంతరం జగన్ శ్రమిస్తున్నారు. ఇళ్ల పట్టాలు, అమ్మఒడి అన్నీ మహిళల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చేసినవే. చదవండి: (త్వరలో వైఎస్సార్సీపీ సభ్యత్వ నమోదు: విజయసాయిరెడ్డి) గత ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు జరిగాయి. మొన్న చింతమనేని దగ్గర్నుంచి.. నిన్న వినోద్ జైన్ వరకూ టీడీపీ నేతలు మహిళలపై దాడులు చేసిన వారే. టీడీపీ గందరగోళంలో ఉంది. ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేశాడు. చంద్రబాబు సభకు రానప్పుడు.. ఆయన అనుచరులెందుకు వస్తున్నారు. 160 సీట్లు గెలుస్తామని అచ్చెన్నాయుడు కల కంటున్నాడు. తిరుపతిలో పార్టీ లేదు బొక్కా లేదు అన్నది అచ్చెన్నే కదా. ప్రజలను మభ్య పెట్టడానికే టీడీపీ నేతల ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాటలు అబద్ధాల పుట్ట. చదవండి: (చంద్రబాబు చెంచాలు మద్యం తాగి మాట్లాడుతున్నారు: పద్మజ) మేం చెప్పిందే చేశాం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. హామీలు అమలు చేసిన బుక్లెట్ కూడా విడుదల చేశాం. రైతు రుణాలు మాఫీ చేస్తానని తప్పించుకున్న ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు 600 హామీలిచ్చి తుంగలో తొక్కాడు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు కూడా వినిపించే అవకాశం కల్పించిన నేత సీఎం జగన్. అసెంబ్లీని రాజకీయ వేదికగా మార్చాలనేదే చంద్రబాబు ప్రయత్నం. ఎవరు ఎవరి గొంతు నొక్కేశారో రికార్డులను పరిశీలించేందుకు మేం సిద్ధం.. బాబు మీరు సిద్ధమా' అంటూ మల్లాది విష్ణు చంద్రబాబుకు సవాల్ విసిరారు. -
అమ్మా... నన్ను చంపొద్దు.. మగ పిల్లలకంటే తక్కువేం కాదు!
సాక్షి, మంచిర్యాల: ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్లే.. అయితే మానవుడు ఎంత అభివృద్ధి చెందినా.. తల్లిగర్భంలో ఉన్నది ఆడశిశువు అని తెలిస్తే బయట పడకుండానే హతమారుస్తున్నారు. మరికొందరు ఆడపిల్ల పుడితే చెత్తకుప్పల్లో, మురుగునీటి కాలువల్లో వదిలేసి వెళ్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని భార్యలను పుట్టింట్లోనే వదిలేసిన భర్తలూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలికల ఉన్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. హక్కుల సాధన, రక్షణ కోసం అనేక చట్టాలు అమలు చేస్తున్నాయి. దీంతో బాలికలు ఉన్నత చదువుల్లోనే కాదు.. ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్’ పేరుతో 2008 నుంచి ప్రతిసంవత్సరం జనవరి 24న బాలికా దినోత్సవం నిర్వహిస్తోంది. నేడు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కథనం... సంక్షేమ పథకాలు సుకన్య సమృద్ధి యోజన సమాజంలో ఆడపిల్లలకు సమాన అవకాశాలు, ఉద్యోగాలు.. ఉన్నతమైన చదువు అందించాలని.. భ్రూణహత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమాల్లో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అప్పడే పుట్టిన శిశువు నుంచి పదేళ్ల వయసున్న ఆడపిల్ల తల్లితండ్రులు బాలిక పేరుపై తపాలా శాఖలో రూ.250 చెల్లించి ఖాతా తెరవొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. ఖాతా ప్రారంభం నుంచి 14 ఏళ్లు, గరిష్టంగా 21 ఏళ్ల వరకు ఖాతా నిర్వహించవచ్చు. బాలికకు 18 ఏళ్లు వచ్చాక చదువు కోసమైతే సగం డబ్బులు తీసుకోవచ్చు. చేసిన పొదుపుపై వడ్డీ ఉదాహరణ నెలకు రూ.వెయ్యి చొప్పున 14 ఏళ్లు జమ చేస్తే 21 ఏళ్ల తర్వాత రూ.6,07,128 వస్తాయి. 21 ఏళ్ల తర్వాత బాలిక వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తపాలా కార్యాలయంలో అందజేస్తే పూర్తి మొత్తం అందజేస్తారు. ఇద్దరు బాలికలున్న వారు రెండు ఖాతాల్లో విడివిడిగా సొమ్ము జమ చేయాలి. ముగ్గురు కుమార్తెలుంటే మరో ఖాతా తెరిచేందుకు వీలు లేదు. చదవండి: Saroornagar Lake: మారని కథ.. నెరవేరని సీఎం కేసీఆర్ హామీ! బేటీబచావో.. బేటీపడావో.. బాలికల సంరక్షణకు, బాలికల ఉన్నతికి 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నుంచి బాలిక పుడితే మనం పండగ జరుపుకోవాలి. కూతురు పుట్టగానే ఐదు మొక్కలు నాటి సంబరం చేసుకోవాలి, కూతురు పుట్టినందుకు మనం గర్వపడాలని ప్రసంగించారు. ఈ పథకాన్ని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలు సమన్వయంతో నిర్వహిస్తాయి. బాలికా సమృద్ధి యోజన 1997 నుంచి ఈ పథకం అమలులో ఉంది. పాఠశాలల్లో ఆడపిల్లల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఆడపిల్ల పుట్టిన తర్వాత అమ్మకు రూ.500 నగదు గిప్టుగా ఇస్తారు. ఆ తర్వాత బాలిక పాఠశాలకు వెళ్లినప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందిస్తారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు సంవత్సరానికి రూ.300, నాలుగో తరగతికి రూ.400, ఐదోతరగతికి రూ.500, ఆరోతరగతికి రూ.600, ఏడోతరగతికి రూ.700, ఎనిమిదో తరగతికి రూ.800, తొమ్మిదో తరగతిలో రూ.1000 స్కాలర్షిప్ అందజేస్తారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆడపిల్లల భ్రూణహత్యల నివారణకు, బాలికల సంరక్షణకు, బాలికల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ కింద ఆడపిల్ల పుడితే రూ.13 వేలు అందిస్తోంది. పేదింట్లో ఆడపిల్ల వివాహం భారం కాకూడదని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.లక్షా నూటపదహార్లు అందజేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండి ప్రీమియం చెల్లించిన వారి పిల్లలు 9, 10, ఇంటర్, ఐఐటీ చదువుతుంటే ఏడాదికి రూ.1200 చొప్పున ఇస్తారు. బాలికా సంరక్షణ యోజన నిరుపేద బాలికల్లో భరోసా నింపేందుకు 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాలికా సంరక్షణ పథకం(జీసీపీఎస్) ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఒకే ఆడపిల్ల జన్మిస్తే రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లలు పుట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఒక్కో బాలికకు రూ.30వేల చొప్పున ఈ మొత్తాన్ని 20 ఏళ్లు నిండిన తర్వాత అందజేస్తారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ దేశంలో బాలికల విద్య, అభ్యున్నతికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(అఐఇఖీఉ) ప్రగతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దేశంలోని 5 వేల మంది విద్యార్థినులకు సంవత్సరానికి రూ.50వేల ఆర్థిక సాయం అందజేస్తోంది. హక్కులు.. చట్టాలు బాలల హక్కులు ప్రపంచ దేశాలన్నీ కూటమిగా ఏర్పడి సమాజంలో బాలలకూ హక్కులు ఉండాలని నిర్ణయించాయి. అందులో కొన్ని ముఖ్యమైన హక్కులను ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. రక్షణ హక్కు బాలికలు తల్లిదండ్రుల నుంచి రక్షణ పొందవచ్చు. కుల, మత, లింగ వివక్ష, నిర్లక్ష్యం, దౌర్జన్యం, హింసాత్మక చర్యల నుంచి కాపాడుకోవడం, అంటువ్యాధులు, కరువు వరదలు, తదితర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ పొందవచ్చు. జీవించే హక్కు శిశువుగా తల్లిగర్భంలో ఉన్న దశ నుంచే సమగ్రంగా ఎదిగే వరకు ఉపకరించే హక్కు. ఈ హక్కు బాలికల ఎదుగుదలకు కావాల్సిన ప్రాథమిక అవసరాలను పొందేవరకు ఉపయోగపడుతుంది. స్వేచ్ఛగా జీవించటానికి, ఆటంకాలు లేకుండా ఎదగడానికి బాలికలకు తోడ్పాడుతుంది. అభివృద్ధి హక్కు బాలలు స్వయం సమృద్ధిని సాధించటానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ఈ హక్కు ద్వారా వినియోగించుకోవచ్చు. భాగస్వామ్య హక్కు బాలలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు, కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొనేలా ఈ హక్కు ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో వారికి తగినట్లుగా ప్రణాళిక రూపొందించుకుని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో అభిప్రాయాలను పంచుకునే వీలుంటుంది. బాలికల సంరక్షణకు చట్టాలు ► 18 ఏళ్లలోపు బాలికలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగితే ఫోక్సో చట్టం కిందికి వస్తాయి. 2016 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ► 2006 నుంచి బాల్య వివాహాల నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. ► 2014 నుంచి బాలల అక్రమ రవాణా నిరోధక చట్టం అమలవుతోంది. ► దాడులకు గురైన బాలికలకు వన్‌స్టాప్ సెంటర్ (సఖి) అండగా నిలుస్తోంది. ► సమాజంలో జరుగుతున్న దాడులు, బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ► విద్యార్థులు మహిళలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే విద్యాలయాల నుంచి తా త్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించవచ్చు. మరే విద్యాలయంలో ప్రవేశం పొందకుండా చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్‌పోర్టు జారీ చేయకుండా చర్యలు తీసుకోవచ్చు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారి ఉపకారవేతనాలు నిలిపివేయడం, పోటీ పరీక్షలకు హాజరుకాకుండా చేయడం, ఫలితాల నిలిపివేత, రూ.2.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. బాలికలను లైంగికంగా వేధిస్తే.. అత్యాచార నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో అమోదంలభించింది. బాలిక ఆమోదం తెలిపినా, తెలపక పోయినా 18 ఏళ్లలోపు వారిపై ఏ లైంగిక దాడిచేస్తే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమానా, లేద జీవిత ఖైదు కూడా విధించవచ్చు. పిల్లలపై అత్యాచారం లేదా వేధింపులు గురిచేస్తే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా, రెండోసారి అదే నేరంపై దొరికితే ఏడేళ్ల జైలు శిక్ష జరిమాన విధించే అవకాశం ఉంది. అమ్మా... నన్ను చంపొద్దు! మంచిర్యాలక్రైం/బోథ్: ఆడపిల్ల అని తెలిస్తే చాలు భ్రూణహత్యలు చేస్తున్నారు.. కన్న తల్లే శిరచ్ఛేదనం చేస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. పుట్టబోయేది కూడా ఓ మహిళేనని తల్లులు గుర్తెరగడం లేదు. ఫలితంగా జనగణన లెక్కలోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడాలు కనిపిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందికి 940 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. 2021 జనాభా ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మంది మహిళలు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం వెయ్యి మంది పురుషులకు 1001 మంది మహిళలు ఉన్నారు. స్కానింగ్ సెంటర్ల పాపం.. తన గర్భంలో పెరుగుతున్నది ఆడా, మగా తెలుసుకునేందుకు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై గర్భిణులు ఒత్తిడి తెస్తున్నారు. నిర్వాహకులకు డబ్బు ఆశ చూపించి గర్భంలో పెరిగే శిశువు గురించి తెలుసుకుంటున్నారు. ఒకవేళ తన గర్భంలో ఆడపిల్ల ఉంటే తన భర్త లేదా అత్తామామల ఒత్తిడి వల్లనో పసిగుడ్డు ప్రాణం తీస్తున్నారు. శిక్షలు ఇలా... భ్రూణ హత్యలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రీనాటల్ డయాగ్నోసిస్ టెక్నిక్స్(రెగ్యులేషన్ ఆండ్ ప్రివెన్షన్ ఆప్ మిస్ యూజ్ యాక్ట్) తీసుకొచ్చింది. దీని ప్రకారం లింగ నిర్దారణ పరీక్షలు చేయడం నేరమైనప్పటికీ చాలామంది రేడియాలజిస్టులు నిబంధనలు తుంగలో తొక్కి తమ దందా సాగిస్తున్నారు. లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై చట్టాలు కఠినంగా ఉన్నా అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏ స్కానింగ్ సెంటర్ అయినా మొదటి సారి లింగనిర్ధారణ చేస్తే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి తప్పు చేస్తే జరిమానా విధించడంతోపాటు ఆరు నెలలు జైలు లేదా ఏడాది జైలు శిక్షతో పాటు మెడికల్ డిగ్రీని రద్దు చేస్తారు. జిల్లా వైద్యశాఖ అధికారుల దాడులు చేసిన సందర్భాలు లేకపోవడం గమనార్హం. మగ పిల్లలకంటే తక్కువేం కాదు బజార్హత్నూర్ గ్రామానికి చెందిన జువుల కళావతి, భూమన్న దంపతులకు ఇద్దరూ కూతుళ్లు సంతానం. అయినా వారు అధైర్య పడలేదు. ఆడపిల్లలను క్రమశిక్షణతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఒకరిని డాక్టర్, ఒకరిని ఇంజినీర్ చేయాలని పిల్లలు పుట్టినప్పుడే నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రుల కలలను కూతుళ్లు నిజం చేస్తున్నారు. భూమన్న మండలంలోని దేగామ జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పెద్ద కూతురు నిహారికను 6వ తరగతి వరకు మండల కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌లో, 10వ తరగతి వరకు కాగజ్‌నగర్ నవోదయ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివించాడు. ప్రస్తుతం నిహారిక ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. చిన్న కూతురు నిపుణ 6వ తరగతి వరకు శ్రీసరస్వతి శిశుమందిర్‌లో, 10వ తరగతి వరకు ఆదర్శ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదువుకుంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. అవగాహన కల్పిస్తున్నాం.. బాల్య వివాహాల నియంత్రణ కు ఐసీపీఎస్ ద్వారా అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆడపిల్లలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. గ్రామపంచాయతీల్లో 12 మంది సభ్యులతో కమిటీలను కూడా వేశాం. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం కౌన్సెలింగ్ నిర్వహించి నిలిపివేస్తాం. – మిల్కా, సంక్షేమ అధికారి, ఆదిలాబాద్ మేం ముగ్గురం ఆడపిల్లలం.. కుంటాల: మాది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామం. అమ్మానాన్న రాణి–తిరుపతి. మేం ముగ్గురం ఆడపిల్ల లం. నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. నేను కుంటాల ఎస్సైగా పని చేస్తున్నా. పెద్ద చెల్లే స్నేహాంజలి బిటెక్ పూర్తి చేసింది. చిన్న చెల్లె మహిజ డిగ్రీ పూర్తి చేసింది. ఆడపిల్లలపై వివక్షత చూపు చూడకుండా నా వంతుగా కృషి చేస్తున్నా. – పోగుల స్రవంతి, ఎస్సై, కుంటాల ఒక్కరే ముద్దు ఆదిలాబాద్‌టౌన్: ఒక్కరే ముద్దు.. ఇద్దరు వద్దు అనే నినాదంతో మేము మేమిద్దం ఒక్కరే చాలన్న నిర్ణయానికి వచ్చాం. మా పాప పేరు అవంతిక. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. పాపను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకురాలిని చేసే దిశగా ముందుకు సాగుతున్నాం. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒక్కరు చాలు. మా కూతురే మాకు ప్రాణం. – కూతురుతో గండ్రత్ అంకిత – సంతోష్ దంపతులు కూతుర్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని.. తాంసి: మాకు 2004 సంవత్సరంలో మొదటి సంతానంగా కూతురి జన్మించింది. ఒక్క కూతురే చాలనుకోన్నారు. కూ తురినే ఉన్నతంగా చదివించి సమాజానికి ఆదర్శంగా నిలుపాలని నిర్ణయించుకున్నాం. కూతురిని తన అభిరుచులకు తగ్గట్టు చది విస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆడపిల్ల అంటే మగ పిల్లల కంటే ఎక్కువ అనే విధంగా మా కూతురిని ఆదర్శంగా నిలుపుతాం. – రామగిరి మాధవి, రమేష్ దంపతులు, తాంసి వివక్ష రూపుమాపాలి కాగజ్‌నగర్: తల్లి గర్భం నుంచే ఆడపిల్లకు వివక్ష మొదలవుతుంది. ఈ కారణంగానే భ్రూణ హత్యలకు దారితీస్తుంది. వివక్ష అనేది వారి కుటుంబాల నుండే మొదలవుతోంది. మనమంతా దీనిని రూపుమాపాలి. తల్లిదండ్రులు సైతం బాలురకు ఇచ్చే స్వేచ్ఛ ఆడపిల్లలకు ఇవ్వడం లేదు. సమాజంలో ఆడపిల్లలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. – కె శ్రావణి, బీజెడ్సీ, ద్వితీయ సంవత్సరం, కాగజ్‌నగర్ ఎవరైనా ఒక్కటే.. నేరడిగొండ: మేము కూతురైనా కొడుకైనా ఒక సంతానం చాలని 2011లోనే నిర్ణయించుకున్నాం. మాకు మొదటి సంతానంగా పాప పుట్టింది. తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నాం. కూతురుకు మంచి భవిష్యత్తు అందించాలని నిర్ణయించుకున్నాం. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ.. పాప భవిష్యత్ కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నాం. చిన్నారి స్పందన రెడ్డితో కుంట కిరణ్‌కుమార్ రెడ్డి దంపతులు -
స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా నిలిచాం: మోదీ
న్యూఢిల్లీ : స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా నిలిచామని.. హామీ లేని రుణాలిచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం స్వయం సహాయక సంఘాలతో ప్రధాని వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్‌లో భాగంగా ఈ సమావేశమయ్యారు. సహకార సంఘాల మహిళలతో మాట్లాడారు. ‘‘ 4 లక్షలకుపైగా మహిళా సంఘాలకు ఆర్థికసాయం అందిస్తున్నాం. రూ.1,625 కోట్లు మంజూరు చేస్తున్నాం. తొలివిడతలో 75 మంది మహిళా రైతులకు రూ.4.13 కోట్లు మంజూరు చేశాం. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల కోసం నిధులు ఇస్తున్నాం. 7,500 మహిళా సంఘాలకు రూ.25 కోట్లతో మూలధన నిధి ఏర్పాటు చేస్తున్నాం’’ అని అన్నారు. -
రెండో వివాహం.. ట్రెండ్ సెట్ చేసిన నటి
సాధారణంగా, ఆలయాల్లో పూజలు, వివాహం, వ్రతం, యాగాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే పూజారి తప్పనిసరి. ఒకప్పుడు ఈ కార్యక్రమాలను కేవలం బ్రాహ్మణులు మాత్రమే నిర్వహించే వారు. కానీ ప్రస్తుతం అక్కడక్కడ కొందరు ఇతర సామాజిక వర్గాల వారు కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. అయితే ఎక్కడైనా ఈ విధులు నిర్వహించే వారే పురుషులే. పౌరోహిత్యం చేసే స్త్రీలు చాలా అరుదు. ఈ క్రమంలో రెండో వివాహం చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా నయా ట్రెండ్ సెట్ చేశారు. పురోహితురాలి చేతుల మీదుగా తన వివాహ వేడుక జరుపుకున్నారు. మీరు చదివింది నిజమే.. పురోహితుడు కాదు.. పురోహితురాలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. దియా ఇది వరకే నిర్మాత సాహిల్ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2014లో వివాహం చేసుకోగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2019లో తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇక భర్తతో విడాకుల అనంతరం దియా, వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖీని ఈ నెల 15న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహ వేడుక ‘పురోహితురాలి’ చేతుల మీదుగా జరిగింది. ఇందుకు సంబందించిన ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు దియా మీర్జా. Thank you Sheela Atta for conducting our wedding ceremony. So proud that together we can #RiseUp #GenerationEquality https://t.co/aMZdyEZRdF pic.twitter.com/BeyFWCSGLw — Dia Mirza (@deespeak) February 17, 2021 ‘‘మా వివాహం జరిపించినందుకు ధన్యవాదాలు షీలా అట్టా.. ‘అందరం కలిసి ఎదుగుదాం’’.. ‘‘జనరేషన్ ఈక్వాలిటీ’’’’ అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దియా మీర్జా ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. ‘‘పితృస్వామ్య వ్యవస్థని నాశనం చేయండి’’.. ‘‘ఈ మహిళ ఎంతో దీక్షగా, శ్రద్ధగా వివాహ తంతు జరిపించి ఉంటుందని నేను నమ్ముతున్నాను’’.. ‘‘వారిని ఎదగనివ్వండి’’.. ‘‘మహిళాసాధికరతకు నిదర్శనం’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఈ పని మగవాళ్లే ఎందుకు చేయాలి? ప్రధానమంత్రి పెళ్లి మూడోసారి వాయిదా -
'వైఎస్సార్ చేయూత' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
-
తమ్ముడూ బాగున్నారా.. అన్నా ధన్యవాదాలు
సాక్షి, అమరావతి: మహిళా సాధికారికతకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఇందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల లబ్ధిదారులతో మాట్లాడారు. ('వైఎస్సార్ చేయూత' పథకం ప్రారంభం) ఎన్నో పథకాలు.. ధన్యవాదాలు అన్నా సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా గతంలో లబ్ది పొందిన ఒంగోలుకు చెందిన పద్మావతి తాజాగా వైఎస్సార్ చేయూత ద్వారా మరోసారి ఆర్థిక సాయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. ‘‘ కరోనా కష్టకాలంలో ఏ ఇంట్లో ఆకలితో ఉండకూడదని ఉచిత రేషన్ ప్రతి ఒక్కరికీ రెండు సార్లు ఇచ్చారు. పుట్టింటి వాళ్లు కూడా చేయని సహాయాన్ని దేవుడిచ్చిన అన్నగా మీరు మాకు చేస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం మా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది రాష్ట్రమంతటా లబ్దిపొందుతున్నారు, వాళ్లలో నేను ఒక లబ్ధిదారునైనందుకు ఎంతో సంతోషపడుతున్నాను. కేవలం ఇవే కాదు.. స్వతంత్రంగా జీవనోపాధి ఏర్పాటు చేసుకుని పెద్ద, పెద్ద సంస్ధలతో సమన్వయం చేసుకుంటూ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కూడా మీరు మాకు సహాయం చేస్తున్నారు. మీతో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు, ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కరోనా కష్టకాలంలో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి గడపకూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రూ.1000 పంపిణీ చేశారు. అవే మాకు పదివేలుగా ఆ రోజుల్లో ఉపయోగపడ్డాయి. ఇవే గాకుండా ఏ ఇంట్లో ఆకలితో ఉండకూడదని ఉచిత రేషన్ ప్రతి ఒక్కరికీ రెండు సార్లు ఇచ్చారు. వసతి దీవెన కింద మా బిడ్డలకు రూ.10 వేలు ఇచ్చారు. కరోనా కష్టకాలంలో మా వారు సెలూన్ షాపులో పనిచేసే అవకాశం లేదు, ఆ సమయంలో ‘జగనన్న చేదోడు పథకం’ కింద రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు. గ్రూపుల్లో సున్నావడ్డీ కింద లబ్ధిపొందాం. వైస్సార్ ఆసరా పథకం ద్వారా మా గ్రూపునకు వచ్చే నెల 1 లక్షా 77 వేలు 400 రూపాయలతో పొందబోతున్నాం. నాకు సొంతంగా రూ.17 వేలు రానున్నాయి. అన్నా.. మాకు ఇళ్లు లేదు, చిన్న రేకుల షెడ్డు, వర్షమొస్తే తడిసిపోవడమే, ఎన్నోసార్లు ఇంటికి దరఖాస్తు పెట్టినా రాలేదు. ఇప్పుడు నా పేరు మీద ఇళ్లు వచ్చింది. చాలా ధన్యవాదాలు. గతంలో పింఛన్ కోసం లైన్లో నిలబడేవారు, ఇప్పుడు ఒకటో తేదీనే మా అత్తయ్య గారికి ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మా బాబు ఫీజు రీయింబర్స్మెంట్ కింద బీటెక్ చేశాడు, లేదంటే చదివించగలిగే స్ధోమత నాకు లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా లబ్ధి పొందాం. ఇవన్నీ మన ప్రభుత్వంలో నేను లబ్ధి పొందినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. మరలా మరలా మీరే మాకు సీఎంగా రావాలని , మా జగనన్నే మా మహిళలందరికీ తోడూ, నీడగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నా’’అని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నోటంటా ఒకటే మాట: విజయమ్మ (అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా) మీ లాంటి అన్నదమ్ములు ఉంటే మాకు ఏ లోటూ ఉండదు. అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు, ముసలమ్మలు ప్రతి నోటంటా ఒకటే మాట జగనన్నా, జగనన్నా.. మీరు చేసే మంచి కార్యక్రమాలు వల్లే. మరలా మరలా మీరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరలా మిమ్మల్నే గెలిపించుకుంటాం. వైఎస్సార్ చేయూత పథకంలో నేను లబ్ధిదారును. చాలా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఎప్పటి నుంచో మేం వెనుకబడి ఉన్నాం. మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. రూ.18750 రూపాయలు మీరు మాకు ఇచ్చారు. నాలుగేళ్లకు రూ.75 వేలు ఇస్తున్నారు. నేను లోన్ తీసుకుని జెరాక్స్ మిషన్ తీసుకున్నాను. దాని మీద నెలకు రూ.3వేలు ఆదాయం వస్తుంది. పిండిమిల్లు పెట్టుకోవాలని చాలా కాలం నుంచి నా కోరిక, అయితే ఆర్ధిక స్ధోమత లేక అది అలాగే ఉండిపోయింది. ఇవాళ ఈ చేయూత పథకం ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు ఎల్లవేలలా రుణపడి ఉంటానన్నా. పేదవాడికి ఒకటో తారీఖు వచ్చేసరికి జీతాలిస్తున్నట్లు పింఛన్ ఇంటికే ఇస్తున్నారు. అమ్మఒడి పథకం కింద వేసిన డబ్బులతో పిల్లలను చదివించుకుంటున్నాం. పేదవాళ్లకి ఇంగ్లిషు మీడియం పెట్టినందుకు మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం. కరోనా కాలంలో పనికి వెళ్లడానికి అవకాశం లేని పరిస్ధితుల్లో మీరు ఇచ్చిన వేయి రూపాయలు, ఉచిత రేషన్‌తో మా పిల్లలకు సంతృప్తిగా భోజనం పెట్టుకోగలిగాం. రేషన్ కార్డు కోసం, మరే అవసరాల కోసం ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్లం, ఇప్పుడు సచివాలయంతో ఊర్లోనే అన్నీ అందుతున్నాయి. ఇళ్ల పట్టాల్లో నా పేరు కూడా ఉంది. ధన్యవాదాలు. మీరు సీఎం అయిన తర్వాతే ఇవన్నీ: లక్ష్మీ దేవి (సిద్దరాంపురం, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం) అక్కాచెల్లెమ్మలకు నేను ఉన్నాను, నేను చేయూతనిస్తాను అని మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. అంత మంది మహిళలు మనసుల్లో అన్నగా నిల్చిపోయినందుకు మేమంతా మీకు కృతజ్ఞతగా ఉంటాం. మా కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి మా కష్టాలు తెలుసుకుని మా కళ్లల్లో కాంతి నింపిన ఘనత మీకే దక్కుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నాకు వితంతు ఫించన్ రూ.2250 వస్తోంది. విజయలక్ష్మీ మహిళా సంఘంలో నేను సున్నా వడ్డీ కింద రూ.3700 తీసుకున్నాను. వచ్చే నెల 11న వైఎస్సార్ ఆసరా కింది నేను రూ.39900 తీసుకోబొతున్నాను. మా కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి మా కష్టాలు తెలుసుకుని మా కళ్లల్లో కాంతి నింపిన ఘనత మీకే దక్కుతుంది అన్నా. మీరిచ్చిన డబ్బులతో పాటు లోన్ తీసుకుని ఒక షెడ్డు వేసుకుని జెరాక్స్ మిషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంత మంచి పథకాలను తీసుకొచ్చిన మీకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. నువ్వు ముఖ్యమంత్రి అయినాక పంటలు పుష్కలంగా పండుతున్నాయి. మీ కన్నా దేవుడు మాకు లేడు సార్, మీకు వేలకోట్ల వందనాలు. తమ్ముడూ బాగున్నారా: రత్నం (యూ.కొత్తపల్లి, తూర్పుగోదావరి) తమ్ముడూ బాగున్నారా. మీరు బాగోవాలి, మీరు బాగుంటునే రాష్ట్రం బాగుంటుంది. నేను చేయూతకు ఎంపికయ్యాను. నా తమ్ముడు ఉన్నాడు అనే ధైర్యంతో బతకాలనుకుంటున్నా. ఇవాళ మీ అక్కలందరం, మేం చరిత్రలో రాసుకుంటున్న రోజు. మా కోసం, ముందు తరాలకు కూడా మీరే సీఎంగా ఉండాలి. మీరిచ్చిన చేయూతతో డిటిపి సెంటర్, కిరాణ షాపు పెట్టుకుని సాధికారిత సాధిస్తాను. కచ్చితంగా నేను నిలబడతాను, ఆదర్శంగా ఉంటాను. మీరు 3వేల పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అక్కచెల్లమ్మలు చెప్పిన కష్టాలన్నీ మీరు మనసుతో విన్నారు. మాకు ఏం చేయాలి అని ఆలోచించి, కుటుంబ భారాన్ని మోస్తున్న మా కోసం ఈ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని విధాలుగా అడ్డంకులు ఎదురవుతున్నా మా సంక్షేమం కోసం పాటుపడుతున్న మీరు చేస్తున్న సాయాన్ని దుర్వినియోగం కానియ్యము. మీకు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
'ఏ ఒక్కరి మీద ఆంక్షలు లేవు.. పూర్తిగా మీ స్వేచ్ఛ'
సాక్షి, అమరావతి: మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉద్దేశించిన వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూతను ప్రారంభించడం నా అదృష్టం. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఏ పథకం లేదు. వైఎస్సార్ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలి. వీరికి ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకమూ లేదు. కానీ కుటుంబాలను నడిపించే బాధ్యత వీరిదే. వీరికి మంచి జరిగితే.. కుటుంబానికి మొత్తానికి మంచి జరిగినట్టే. వీరికి మంచి జరగాలనే ఈ పథకం. కార్పొరేషన్లను ప్రక్షాళన చేశాం గతంలో కార్పొరేషన్ల పేరుతో రుణాలు ఇచ్చేవారు. గ్రామంలో 1,000 మంది ఉంటే.. ఒకరికో, ఇద్దరికో రుణాలు వచ్చే పరిస్థితి. అదికూడా రాజకీయపలుకుబడి ఉండి, లంచాలు ఇచ్చుకునే పరిస్థితి. దీనివల్ల ఎవ్వరికీ ఏమీ జరిగేది కాదు, ఎవ్వరికీ ఉపయోగపడేది కాదు. మిగిలిన వాళ్లు బాధపడాల్సి వచ్చేది. ఇవన్నీ మార్పులు చేస్తూ, ఈవయస్సులో ఉన్న అక్కలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లను ప్రక్షాళన చేశాం.మొదట పెన్షన్ రూపంలో డబ్బు ఇద్దామనుకున్నాం. నెలకు రూ.1,000 అనుకుంటే.. ఏడాదికి రూ.12వేలు. 45ఏళ్లకే పెన్షన్ ఏంటి? అంటూ మమ్మల్ని వెటకారం చేశారు. పోనీలే అనుకుని ఏడాదికి రూ.12వేలు కాదు, రూ.18750 ఇస్తాం. నాలుగేళ్లపాటు చేయిపట్టుకుని నడిపిస్తాం అని చెప్పి ఈ పథకాన్ని తీసుకువచ్చాం. ప్రతి ఏటా రూ.18,750 చొప్పున రూ.75వేలు ఇస్తున్నాం. తమ జీవితాలను మార్పు చేసుకునే అవకాశం మహిళలకు వస్తుంది. దీన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పథకాన్ని వర్తింపు చేస్తామని చెప్పాం. మీ తమ్ముడిగా, అన్నగా చేయగలుగుతున్నాం. ఈ పథకంలో ఒక అడుగు ముందుకు వేశాం. అక్కల అకౌంట్లోకి నేరుగా బదిలీచేస్తున్నాం. పాత అప్పులకి జమచేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్ బ్యాంకు ఖాతాల్లోకి పంపుతున్నాం. దీనికోసం బ్యాంకులతో మాట్లాడాం. దీంతో ఇంకో అడుగు ముందుకు వేశాం. అక్కలకు, చెల్లెమ్మలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేశాం. ('వైఎస్సార్ చేయూత'ను ప్రారంభించిన వైఎస్ జగన్) వ్యాపార అకాశాలను మీ ముందుకు తీసుకొచ్చాం పాల రంగంలో దేశంలోనే దిగ్గజ సంస్థ అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. రియలన్స్, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గాంబల్, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీలో ఒప్పందాలు చేసుకున్నాం. రాబోయే కాలంలో మరిన్ని పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాం. మహిళలకు వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్యం. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు 2 పేజీల లేఖ కూడా పంపిస్తున్నాం. ప్రభుత్వం చూపుతున్న వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాలని, దాని ద్వారా మేలు పొందాలని అనుకుంటే.. ఆప్షన్ ఇవ్వొచ్చు. దీనికోసం బ్యాంకులతో కూడా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కంపెనీలు తమ ఏజెన్సీలకు ఇచ్చే రేటుకన్నా తక్కువ రేటుకు తమ ఉత్పత్తులను ఇస్తారు. దీనివల్ల ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వృద్దిచెందేలా సుస్థిర జీవనోపాధి పొందవచ్చు. అక్క, చెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడాలి గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు మిమ్మల్నిఅందర్నీకూడా ఈ రెండు పేజీల లేఖతో మీ ముందుకు వస్తారు. తమకు మేలు జరుగుతుందని అక్కలు అనుకున్నప్పుడు.. ఆ ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత సెర్ప్, మెప్మా ప్రతినిధులు ఆ మహిళతో మాట్లాడతారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతారు, బ్యాంకులతో ఆ అధికారులు మాట్లాడుతారు. ఆ వ్యాపారంలో వాళ్లు అడుగుపెట్టేలా ముందుకు సాగుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లవరకూ ఉన్న మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల వరకూ ఇస్తున్నాం. ప్రతి ఏటా రూ.18750 లు ఇస్తాం. ఈ డబ్బును సద్వినియోగం చేసుకోవాలి. అక్క, చెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడాలి. కానీ, ఇదే చేయాలని ఏ అక్కమీద కూడా ఆంక్షలు లేవు. ఇది పూర్తిగా మీ స్వేచ్ఛ. ప్రభుత్వం మాత్రం అక్కచెల్లెమ్మలకోసం ఏడాదికి రూ.18,750 ఇస్తుంది. డబ్బు దేనికి వాడుకోవాలన్నది అది వారి ఇష్టం. లేదు ప్రభుత్వం చూపించిన అవకాశాల వల్ల లాభం జరుగుతుందని అనుకుంటే.. వారికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎన్ని ఉన్నా, అట్టడుగున ఉన్న మహిళలకు చేయూత నందించడానికి, వారి కాళ్లమీద వాళ్లు నిలబడ్డానికి ఈనిర్ణయం తీసుకున్నాం. దాదాపు 25 లక్షల కుటుంబాలకు ఈరోజు మేలు జరుగుతుంది. దరఖాస్తుకు మరో అవకాశం జాబితాలో ఎవరిపేరైనా లేకపోతే ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనిలేదు. మన ప్రభుత్వం ప్రతి అక్కకు, చెల్లెమ్మకు ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వమే. గ్రామ సచివాలయానికి వెళ్లి అర్హతలు చూసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోండి. వచ్చే నెలలో ఈ దరఖాస్తులను పరిశీలించి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటారు. 60 ఏళ్లు వచ్చే వరకూ ఈపథకం కొనసాగుతుంది.. అక్కడ నుంచి వారికి పెన్షన్ ప్రారంభం అవుతుంది. ఆ సమయానికి ఏడాదికి దాదాపు రూ.30వేల రూపాయలు వస్తాయి. 45 ఏళ్లు వయసు చేరుకున్న తర్వాత ప్రతి ఏటా మహిళలు ఈ పథకంలోకి వస్తారు. అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా మీ కుటుంబాలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం' అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
'వైఎస్సార్ చేయూత'ను ప్రారంభించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉద్దేశించిన వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. బడ్జెట్లో వైఎస్సార్ చేయూత పథకానికి రూ.4,700కోట్లు కేటాయించారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ధిపొందనున్నారు. కాగా.. చేయూత లబ్ధిదారుల సాధికారిత కోసం ప్రభుత్వం ఇప్పటికే అమూల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీ అండ్ జీ, జియోమార్ట్ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఔత్సాహిక వ్యాపారస్తులుగా మారడానికి అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలను ఈ కంపెనీలు అందిస్తాయి. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం అవకాశాలను కల్పిస్తాయి. వైఎస్సార్ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మేలు జరుగుతుంది. ఈ కంపెనీల భాగస్వామ్యం వల్ల వారికి జీవనోపాధి కలగడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి. (‘చేయూత’తో పేదరికానికి చెక్) -
బిల్‌గేట్స్‌తో ఆ విషయం చర్చించిన మల్లికా శెరావత్
బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిశారు. మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ తాజాగా.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ని కలిసి మహిళా సాధికారత గురించి చర్చించిందట. వాషింగ్టన్లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసిన పార్టీలో వీరు కలవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ విషయం గురించి మల్లికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. ఆయనతో మహిళా సాధికారత గురించి మాట్లాడడం సంతోషంగా అనిపించిందని మల్లికా తన పోస్ట్‌లో పేర్కొంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్-13లోను మల్లికా శెరావత్ సందడి చేసిన సంగతి తెలిసిందే. (మల్లికా శెరావత్‌కు వింత అనుభవం) View this post on Instagram So enjoyed my conversation with Bill Gates abt female empowerment @thisisbillgates #inspired #billgates #womensrights #femaleempowerment A post shared by Mallika Sherawat (@mallikasherawat) on Jan 27, 2020 at 11:10pm PST -
స్త్రీల ఇతివృత్తంగా కాట్రిన్ మొళి
తమిళసినిమా: సూర్యతో ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటూ పరిపూర్ణ సంసార జీవితాన్ని అనుభవిస్తున్న నటి జ్యోతిక. ఇంతకు ముందు అగ్రకథానాయకిగా వెలిగి నటనకు విరామం ఇచ్చి 36 వయదినిలే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తరువాత మగళీర్ మట్టుం, నాచియార్ అంటూ హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్ బాటలో సాగిపోతున్న జ్యోతిక తాజాగా కాట్రిన్ మొళి అంటూ తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు రాధామోహన్న్దర్శకత్వంలో మొళి చిత్రంలో జ్యోతిక నటించారు. తాజాగా అదే కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కాట్రిన్ మొళి. మొళి చిత్రంలో మూగ యువతిగా కళ్లతోనే నటించిన జ్యోతిక ఈ కాట్రిన్ మొళి చిత్రంలో అందుకు పూర్తి భిన్నంగా సరళంగా మాట్లాడే చురుకైన అమ్మాయిగా కనిపించనున్నారని దర్శకుడు రాధామోహన్ తెలిపారు. ఆయన మరిన్ని వివరాలు తెలుపుతూ ఇది హిందీలో సంచలన విజయం సాధించిన తుమ్హారా సుళు చిత్రానికి రీమేక్ అని, అయితే తమిళ సంస్కృతికి దగ్గరగా చాలా మార్పులు, చేర్పులు చేసి మరి కొన్ని కొత్త పాత్రలను సృష్టించినట్లు తెలిపారు. ఇది స్త్రీల ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం అయినా అన్ని వర్గాల వారు చూసి ఆనందించే విధంగా ఉంటుందన్నారు. ఇందులో విదార్థ్, నటి మంచులక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కాగా నటుడు శింబు అతిథి పాత్రలో నటించడం విశేషం. కుమరవేల్, భాస్కర్, మనోబాలా, మహన్ రామన్, ఉమాపద్మనాభన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఏహెచ్.కాశీఫ్ సంగీతాన్ని, మహేశ్ ముత్తుసామి ఛాయాగ్రహణం అందించారు. దీన్ని బాఫ్టా మీడియా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై జి.ధనుంజయన్, ఎస్. విక్రమ్‌కుమార్,లలిత ధనుంజయన్ నిర్మిస్తున్నారు. -
నెంబర్ 1 అమ్మ
బిడ్డను తల్లి తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది. చూసే వాళ్లకే భారంగా అనిపించే క్షణాలను కూడా తల్లి సంతోషంగానే భరిస్తుంది. జైపూర్‌లోని మంజుదేవి ముగ్గురు పిల్లల తల్లి. ముగ్గురు పిల్లలను కనడానికి ఇరవై ఏడు నెలలు మోసింది. ఇప్పుడు వాళ్లను పోషించడానికి కొన్నేళ్లుగా బరువులు మోస్తోంది. జైపూర్ రైల్వే స్టేషన్లో కూలీగా ప్రయాణికుల పెట్టెలు మోస్తూ పిల్లల్ని బతికించుకుంటోంది. వాయవ్య రైల్వే జోన్లో తొలి మహిళా కూలీ మంజుదేవి. ఈ ఏడాది రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకున్న 112 మంది సాధికార మహిళల్లో మంజుదేవి కూడా ఒకరు. జీవితానికి రెడ్ సిగ్నల్! మంజుదేవి భర్తతో కలిసి జైపూర్‌లో నివసించేది. ఆమె భర్త జైపూర్ రైల్వే స్టేషన్లో లైసెన్స్ ఉన్న పోర్టర్. మంజుదేవి ఏమీ చదువుకోలేదు. చదువు రాకపోవడం వల్ల అప్పటి వరకు ఆమెకు ఎటువంటి ఇబ్బంది కూడా ఎదురవలేదు. పెద్ద పెద్ద కోరికలు, ఆశలు లేకపోవడంతో భర్త సంపాదనతో కాపురం హాయిగా గడిచినంత కాలం గడిచిపోయింది. ఏ కష్టమూ లేకపోతే జీవితం జీవితమే కాదని నిరూపించడానికా అన్నట్లు పదేళ్ల క్రితం భర్త మహదేవ్ అనారోగ్యంతో మంచం పట్టి, మరణించాడు. మంజుదేవికి భర్త తోడు లేని జీవితం ఊహకు కూడా అందలేదు. కానీ ‘నువ్వు ఒక భర్తకు భార్యవు మాత్రమే కాదు, ముగ్గురు బిడ్డలకు తల్లివి కూడా’ అంతరాత్మ హెచ్చరించింది. కూలీగా.. గ్రీన్ సిగ్నల్ భర్త నుంచి వారసత్వంగా మణులు రాలేదు, మాన్యాలూ రాలేదు. అతడికి ఉన్నది, అతడి నుంచి ఆమె చేతికి వచ్చిందల్లా రైల్వే పోర్టర్ లైసెన్స్ మాత్రమే. ఆ లైసెన్స్‌తో అధికారుల దగ్గరకు వెళ్లింది. అనుమతిస్తే సామాన్లు మోసి పిల్లల ఆకలి తీర్చుకుంటానని మొర పెట్టుకుంది. అధికారులు స్పందించి భర్త పేరు మీద ఉన్న లైసెన్స్‌ను ఆమె పేరు మీద మార్చి ఇచ్చారు. ఆ లైసెన్స్‌తోపాటు ఆమెకు నార్త్‌వెస్టర్న్ రైల్వేస్‌లో తొలి మహిళా కూలీ అనే గుర్తింపు కూడా ఆమెకు ఏ మాత్రం తెలియదు. ఆమెకు తెలిసిందల్లా పిల్లలను పోషించుకోవడానికి ఒక పని కావాలి, భర్త పని చేసిన చోట అయితే తోటివాళ్లు తనకు రక్షణగా ఉంటారు.. అంతే. ఆమె ఊహించింది కూడా నిజమే. చదవడం రాని ఆమెకు తోటి మగ పోర్టర్లు అండగా నిలిచారు. ప్లాట్‌ఫామ్ నంబర్లు, రైళ్ల పేర్లు, నంబర్లు, బోగీ వివరాలపై ఆత్మీయంగా అవగాహన కల్పించారు. దేవుడిచ్చిన లైసెన్స్ దేవుడికి పూజలు, ప్రార్థనలు చేస్తే మంచి జరుగుతుందో లేదో తెలియదు. మంచి జరుగుతుందన్నా కూడా అవన్నీ చేసే ఖాళీ కూడా ఉండదు. మంజుదేవికి తెలిసింది పనిని మించిన దైవం లేదని మాత్రమే. రోజూ ఇంట్లో పని ముగించుకుని పోర్టర్ డ్యూటీ కోసం కుట్టించుకున్న కుర్తా, నల్ల పైజామా ధరించి, ‘నార్త్‌వెస్ట్ రైల్వే జైపూర్ నంబర్ 15’ లైసెన్స్‌ను కళ్లకు అద్దుకుని చేతికి కట్టుకుంటుంది. పనికి బయల్దేరుతుంది. కుదరదంటే ఒప్పుకోరు! పోర్టర్‌గా తాను తెలుసుకోవలసినవన్నీ పద్ధతిగానే నేర్చుకుంది మంజుదేవి. అయితే కొందరు ప్రయాణికులు మెట్లెక్కి వెళ్లడానికి బద్దకించి ట్రాక్‌కు అడ్డంగా దాటి వెళ్తుంటారు. వాళ్లు వెళ్లడమే కాకుండా తమ సామాన్లను కూడా తమతోపాటే తెమ్మంటారు. ‘ప్లాట్‌ఫామ్ మీద నుంచి ట్రాక్ మీదకు దిగడం, అడ్డంగా దాటటం తప్పని తెలుసు. కానీ అలా కుదరదంటే ఒప్పుకోరు, ఇంకా మాట్లాడితే పని చేజారిపోతుంది. వచ్చే డబ్బు రాకుండా పోతుంది. ఆ భయంతో అలాగే ట్రాక్ దాటి సామాన్లు తీసుకుపోతుంటాను’ అని చెప్తారు మంజుదేవి. మనిషి బరువు ముప్పై.. మోసే బరువూ ముప్పై ‘నా బరువు ముప్పై కిలోలు. నేను మోసే సూట్‌కేసుల బరువు కూడా ముప్పై కిలోలు ఉంటుంది. అయితే అదేమీ కష్టంగా ఉండదు. ఎందుకంటే నేను మోసే బరువు నా బిడ్డల కోసమే కదా. బిడ్డల బరువు తల్లికి భారం కాదు. ఈ ఉద్యోగంతో పిల్లలను చదివించుకోగలుగుతున్నాను. అందుకే నా పని నాకు దైవంతో సమానం’ అని రాష్ట్రపతి భవన్లో పురస్కారం అందుకున్నప్పుడు మంజుదేవి చెప్పిన మాటలివి. పిల్లల కోసం ‘తల్లి మాత్రమే’ అనగలిగిన గొప్ప మాట ఇది. – మంజీర -
నేను శక్తి కార్యక్రమం హైలెట్స్
-
ఉపాధినిచ్చిన నృత్యం
మంచిర్యాలక్రైం: చిన్నతనంలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు బంధువులు, స్నేహితులు చప్పట్లు కొట్టేవారు. ఆ చప్పట్లే ఆమెను నాట్యం వైపు నడిపించాయి. ఆ నాట్యమే ప్రస్తుతం జీవానోపాధిని కల్పిస్తోంది. మంచిర్యాలకు చెందిన శనిగారపు ఝాన్సీటోని నాట్య ప్రస్థానం ఆమె మాటల్లోనే.. హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్ నిర్వహించిన డ్యాన్స్ ఈవెంట్ షోలో గోదావరిఖనికి చెందిన శనిగారపు వినయ్‌కాంత్(టోని)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరం డ్యాన్సర్లం. మా ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ప్రేమ వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం ఒక బాబు ఫిన్ని రుబేన్(లిరిక్స్)(4) ఉన్నాడు. ఇద్దరం డ్యాన్స్ మాస్టర్లు కావడంతో... ఇద్దరం డ్యాన్స్ మాస్టర్లం కావడంతో డ్యాన్స్‌నే వృత్తిగా మలుచుకుని గోదావరిఖని, మంచిర్యాలలో డ్యాన్స్ స్కూల్‌ను స్థాపించాం. ప్రైవేటు పాఠశాలలోనూ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో ఈవెంట్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వివాహ అనంతరం మా ఇద్దరి కుటుంబాలు కలిశాయి. భర్త ప్రోత్సాహంతోనే నేను డ్యాన్స్ రంగంలో నిలదొక్కుకోగలిగాను. పలు చానెళ్లలో పాల్గొని నాకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను ఏర్పర్చుకున్నాను. 2016లో హైదరాబాద్‌లోని శిల్ప కళావేదిక ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర డ్యాన్స్ ఈవెంట్స్ పోటీల్లో పొల్గొని ప్రథమ బహుమతి రూ. 50 వేలు నగదు అవార్డు అందుకున్నాను. ప్రస్తుతం బిత్తిరి సత్తి హీరోగా నిర్మిస్తున్న ‘తుపాకి రాముడు’ చిత్రంలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటిస్తున్నాను. నేనూ మా ఆయన కలిసి ఇప్పటివరకు ప్రైవేటు కార్యక్రమాల్లో సుమారు 500కు పైగా ఈవెంట్స్ చేశాం. ప్రస్తుతం 30 మందికి ఫోక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, భరతనాట్యం, తదితర డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తున్నాం. ఎంతో మంది కళాకారులను తయారు చేస్తున్నాం. పేద కళాకారులను గుర్తిం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం. మహిళలపై వివక్ష వీడాలి... సమాజంలో మహిళలపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారు పురుషులకంటే ఎందులో తక్కువ లేరు. మహిళలకు అన్నిరంగాల్లో సమానత్వ హక్కులు కల్పించాలి. -
సాధికారత కోసం...
మన రాజ్యాంగ వ్యవస్థ మహిళల రక్షణ కోసం కల్పించిన ముఖ్యమైన సౌకర్యాలు ఇవి. న్యాయపరంగా పోరాడాల్సిన ఈ చట్టాలతో సాధికారత సాధన జరుగుతుందా అంటే... అదొక్కటే మార్గం అని కాదు. న్యాయపోరాటం చివరి అంశమే కావచ్చు. కానీ ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉందనే స్పృహ ఆమెలో భరోసాని కలిగిస్తుంది. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిలో భయానికి కారణమవుతుంది. మహిళ పట్ల గౌరవంతో ఆమెకు ఇబ్బంది కలిగించకుండా మెలిగే సంస్కారం ఉన్నప్పుడు ఇలాంటి చట్టాల అవసరం అంతగా ఉండకపోవచ్చు. అయితే అలాంటి సంస్కారం లోపించినప్పుడు ఇలాంటి చట్టాల రక్షణ గొడుగులు అవసరమే. ఈ చట్టాలన్నీ... మహిళకు సాధికారత సాధనలో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితిని రానివ్వకుండా ఆమెకు తోడుగా ఉండే బాంధవ్యసాధనాలు. -
మహిళాభ్యున్నతి కోసం సాక్షి సంతకం!
-
మహిళా సాధికారత ఎండమావే.
ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో ‘మహిళా సాధికారత’ఎండమావిలాటిందేనని నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది మల్లెల ఉషారాణి అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించటం కేవలం చట్టాలకే పరిమితమయిందని, ఆది ఆచరణలోకి వచ్చిన, సద్వినియోగం చేసుకున్న రోజు ‘మహిళలకు’ నిజమైన పండగని అన్నారు. ‘మహిళా సాధికారత–సమానవకాశాలు’ పై ఉషారాణి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. –కొత్తగూడెం ప్ర: జిల్లాలో మహిళా సాధికారత పరిస్థితి..? జవాబు: మహిళలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని, ఇంటా బయట తగిన గౌరవం పొంది, సమాన హక్కులు కల్గి లింగ వివక్షత లేకుండా, గౌరవ ప్రదంగా జీవించినప్పుడు పూర్తి స్థాయిలో మహిళా సాధికారత’జరిగినట్లు. కానీ దేశంలో ఎక్కడా ఆ దాఖలాలు కనిపించటం లేదు. ప్ర: అందుకు కారణాలు ఏమిటి? జ: మన దేశం మొదటి నుంచి పురుషాధిక్యత గల దేశం. టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా ఆ మూలాలు పోవడంలేదు. ప్రతీ మహిళ దీనిపై తనకు తాను ప్రశ్నించుకోవాలి. ముందడుగు వేయాలి. అప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. ప్ర: తీసుకోవాల్సిన చర్యలు.? జ: ఏజెన్సీ జిల్లాగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెంలో అమాయక గిరిజనులతో పాటు నిరక్షరాస్యులే అధికంగా ఉన్నారు. వారికి మహిళా చట్టాలపై ఎటువంటి అవగాహన లేదు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రతి ఒక్కరికీ చట్టం, న్యాయాలపై అవగాహన కల్పించాలి. మారుమూల గ్రామాలలో ని వారి వద్దకే న్యాయం, చట్టాలను తీసుకెళ్లాలి. ప్ర: మహిళలకు సమానవకాశాలు..? జ: మహిళలకు సమానవకాశాలను కొన్ని రంగాలలోనే ప్రభుత్వం కేటాయించింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో పూర్తి స్థాయి రిజర్వేషన్‌ను కచ్చితంగా, నిష్పక్షపాతంగా అమలు పర్చిన రోజు మహిళలకు సమానవకాశాలు లభించి పురుషులతో సమాన స్థాయిలో హోదాను పొందుతారు. ప్ర: మహిళలపై హింస, దాడులను అరికట్టాలంటే ఏం చేయాలి? జ: మహిళలపై లైంగిక దాడులు, హింస పెరుగుతూనే ఉన్నాయి. నెలల వయసు చిన్నారి నుంచి వృద్ధుల వరకు బాధితులుగా మిగులుతున్నారు. విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, హింసా ప్రవృత్తి గల సినిమాలు కారణమవుతున్నాయి. వీటిపై ప్రభుత్వం నియంత్రణ చేయాలి. దాడులు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు తమ పథకాలను కోట్ల నిధులను ఖర్చు ప్రచారం చేసుకుంటున్నాయి. అంతకు మించి న్యాయం, చట్టం మహిళల చెంతకు చేరే వరకు తగిన ప్రచారం చేయాలి. ప్ర: మీ ఆర్గనైజేషన్ ద్వారా చేసిన కార్యక్రమాలు..? జ: ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత 2013లో ‘’నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్’అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాం. అప్పటి నుంచి మహిళళకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, దాడులపై పలు చోట్ల ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లను నిర్వహించి ఇప్పటి వరకు సుమారు 80 వరకు కేసులను పరిష్కరించాం. -
సింగర్ కౌసల్యతో ఇంటర్వ్యూ
-
బామ్మ బంగారం
ఆమెతో కొద్దిసేపు మాట్లాడితే స్త్రీ స్వేచ్ఛకు అర్థం తెలుస్తుంది. స్వతంత్ర భావాలతో ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఎనిమిది పదుల వయసులోనూ ఆమె చెంగుచెంగున దూకే ‘లేడి’పిల్ల. పురుషాధిక్య సమాజంపై ఏహ్యభావంతో ఆమె పెళ్లికి దూరమైనా.. బంధాలు, అనుబంధాలకు దూరం కాలేదు. వ్యవసాయంపై ఉన్న మమకారాన్ని వదులుకోలేదు. అందుకే బామ్మ బంగారం.. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. – జంగారెడ్డిగూడెం రూరల్ నా పేరు కేసనపల్లి లక్ష్మీకాంతం. మాది జంగారెడ్డిగూడెం. మా తల్లిదండ్రులు పున్నమ్మ, శ్రీరాములు. నాన్న శ్రీరాములు వ్యవసాయం చేసేవారు. అప్పట్లో మాకు సొంతంగా కొంగరగూడెంలో 50 ఎకరాల వ్యవసాయ పొలం ఉండేది. అయితే అప్పట్లో వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో మాకు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. మా తల్లిదండ్రులకు మేము ఏడుగురు సంతానం. నాకు ఒక అన్న.. ఒక తమ్ముడు.. నలుగురు చెల్లెళ్లు. అమ్మాయిల్లో నేనే పెద్దదానిని. ఎనిమిదో తరగతి చదివా.. టీచరయ్యా.. నేను 8వ తరగతి వరకు జంగారెడ్డిగూడెంలో చదువుకున్నాను. అప్పట్లో ఐటీడీఏ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో పనిచేసేందుకు ఉపాధ్యాయులు కావాలని ప్రకటన విడుదలైతే దరఖాస్తు చేశాను. ఉద్యోగం రావడంతో 1954లో విధుల్లో చేరాను. వివధ చోట్ల పనిచేసి 1992లో రిటైరయ్యాను. అప్పట్నుంచి వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం అంటే ఇష్టం మాది చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం కావడంతో అనుకోకుండానే నాకు వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితోనే ఉద్యోగ విరమణ అనంతరం నాకు వచ్చిన పెద్ద మొత్తంతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెం సమీపంలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. నేనే స్వయంగా వ్యవసాయం చేయడం ప్రారంభించాను. ఆయిల్‌పామ్, జామ, కొబ్బరి, కోకో వంటి పంటలు సాగు చేశాను. నాకు నేనుగా అనుభవం ద్వారా వ్యవసాయంలో మెలకువలను నేర్చుకున్నాను. మా తోటలో పండే జామకాయలను ఒరిస్సాలోని కటక్ వరకు ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం ఆయిల్‌పామ్, కోకో సాగు చేస్తున్నాను. ఇంత వయస్సులోనూ పొలానికి వెళ్లి నీళ్లు పెట్టడంతో మొదలు, ఎరువులు వేయడం, తదితర పనులన్నీ నేనే స్వయంగా చేస్తుంటాను. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేచి పనులు ముగించుకుని స్కూటీపై పొలానికి వస్తుంటాను. గోమూత్రం తదితర వాటితో తయారుచేసిన సేంద్రియ ఎరువులనే వ్యవసాయానికి వినియోగిస్తున్నాను. సేంద్రియ ఎరువు వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు. పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే.. సమాజంలో మహిళలపై పురుష ఆధిక్యత అంటే నాకు నచ్చదు. పైగా నాకు అప్పట్లో కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండేవి. అందువల్లనే నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదు. ప్రస్తుతం మా వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. మా అన్న అప్పారావు మాత్రం ప్రస్తుతం నాతోనే ఉంటున్నారు. భార్య చనిపోవడంతో ఆయన బాగోగులు నేనే చూసుకుంటున్నాను. జీవిత అవపానదశలో మమ్మల్ని ఎవరైతే కంటికి రెప్పలా చూసుకుంటారో వారికే నా ఆస్తి రాసి ఇవ్వాలనుకుంటున్నాను. లేదంటే ఏ అనాథాశ్రమానికో రాసేస్తాం.