
న్యూఢిల్లీ : స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా నిలిచామని.. హామీ లేని రుణాలిచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం స్వయం సహాయక సంఘాలతో ప్రధాని వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్‌లో భాగంగా ఈ సమావేశమయ్యారు. సహకార సంఘాల మహిళలతో మాట్లాడారు. ‘‘ 4 లక్షలకుపైగా మహిళా సంఘాలకు ఆర్థికసాయం అందిస్తున్నాం. రూ.1,625 కోట్లు మంజూరు చేస్తున్నాం. తొలివిడతలో 75 మంది మహిళా రైతులకు రూ.4.13 కోట్లు మంజూరు చేశాం. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల కోసం నిధులు ఇస్తున్నాం. 7,500 మహిళా సంఘాలకు రూ.25 కోట్లతో మూలధన నిధి ఏర్పాటు చేస్తున్నాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment