మగ్గం శిక్షణా శిబిరాన్ని పరిశీలిస్తున్న అధికారులు
నారాయణ్‌పేట్: గ్రామీణ ప్రాంతాల మహిళలు సంఘటితమయ్యేలా.. పొదుపుతో మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించేలా.. స్వయం ఉపాధి రంగాల్లో రాణించేలా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు మరిన్ని స్వయం సంఘాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) ఆద్వర్యంలో విజన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందులో బాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు మండలాలు ఎంపిక చేసుకున్న అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి మహిళ కుటుంబాన్ని ఆర్థికంగా ప్రగతి సాధించేందుకు అవసరమైన తోడ్పాటు అందించేలా ప్రణాళిక రూపొదించారు. ప్రభుత్వం అనుమతి అనంతరం ‘విజన్ బిల్డింగ్’ పనులు ముమ్మరంగా చేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా సరికొత్త లక్ష్యం నిర్దేశించుకొని సంఘాల ఏర్పాటును చేపట్టింది. మహిళా పొదుపు సంఘాల ద్వారా రుణాలు పొంది చిరు వ్యాపారాలు, స్వయం సమృద్ధి పథకాలలో రుణాలు తీసుకొని లబ్దిపొందేలా చర్యలు తీసుకోనుంది.
ఆరోగ్యం, విద్య, జోవనోపాధి, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయునున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి కొన్ని మండలాలను నమూనాగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఎంపిక చేసిన మండలాల ఏపీఎంలకు శిక్షణ పూర్తి చేశారు.
మార్గదర్శకాల్లో పంచవర్ష ప్రణాళిక
నమూనా మండల సమాఖ్యలుగా ఎంపికై న పరిధిలోని గ్రామాలోని గ్రామైక్య పొదుపు సంఘాల వారు ప్రతి నెలా రుణ వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లించేలా చూడాలి. తప్పనిసరిగా సమావేశాలు, రుణంతో వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేలా, ప్రస్థుతం ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా తీర్చిదిద్దుతారు.
రుణాలు అవసరమైతే బ్యాంకులు, సీ్త్రనిధి నుంచి ఇప్పిస్తారు. ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యురాలు విజన్ మిషన్ అబ్జెక్టివ్ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్‌నకు తగ్గట్టుగా లక్ష్యాలను ఏర్పరుచుకోని, దానిని ఏటా కొంత వరకు సాదించేలా పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు. రానున్న ఐదేళకలల్లో ఈ లక్ష్యాలను చేరేలా చూసి, మహిళా సమాఖ్యలను ఆదర్శంగా మారుస్తారు.
జిల్లాలో ఇలా ..
జిల్లాలో విజన్ బిల్డింగ్ కార్యక్రమం కోసం మొదటి విడతలో మూడు మండలాలను, రెండో విడతలో మరో మూడు మండలాలను ఎంపిక చేశారు. ఇందులో నారాయణపేట, ఊట్కూర్, నర్వ మండలాలు మొదటి విడుతలో ఉండగా రెండో విడతలో మరో మూడు మండలాలు మాగనూర్, కృష్ణ, మరికల్‌లున్నాయి.
ప్రతి ఏటా రూ.వందల కోట్లు రుణాలు అందిస్తున్నప్పటికి, వ్యాపారాల ఏర్పాటుకు వారి ఆర్థికాభివృద్ధికి ఉపయోగిస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతగా 102 మండల సమాఖ్యలను ఎంపిక చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాలో 16 మండలాలుండగా నారాయణపేట జిల్లాలో ఆరు మండలాలను ఎంపిక చేశారు.
సద్వినియోగం చేసుకోవాలి
మహిళా సమాఖ్యల్లోని సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో రాణిచేందుకు విజన్ బిల్డింగ్ అనే కొత్త కార్యక్రమానికి సెర్ప్ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు జిల్లాలో మూడు మండల సమాఖ్యలను ఎంపిక చేసి మండల ఏపీఎంలకు శిక్షణ ఇచ్చారు. పేదరిక నిర్మూలన కోసం విజన్ డాక్యుమెంట్‌ను ఐదేళ్ళ కోసం తయారు చేశాం. త్వరలో ఈ కార్యక్రమం అమలు చేసేందుకు చేపట్టాల్సిన విధి విధానాలను రూపొందించనున్నారు. – అంజయ్య, ఏపీడీ
ప్రధాన లక్ష్యాలివి..
మహిళా సంఘాల్లోని ప్రతి సభ్యురాలికి సుస్థిర జీవనోపాధితో ఆధాయం వచ్చేలా చర్యలు చేపడతారు. దీనికోసం బ్యాంకు రుణాలు, సీ్త్రనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తారు.
వ్యవసాయం, పశుపోషణ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు వృత్తినైపుణ్యం పెంపొదించడం, కుటిర పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తారు. నెలకు కనీసం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం సమకూరేలా చేస్తారు.
సంఘాల బలోపేతానికి ఆర్థిక సహకారం అందిస్తారు. ఆన్‌లైన్ విధానంలో లావాదేవీలు, యాప్‌ల ద్వారా రికార్డుల నిర్వాహణ చేసేలా వారికి అవగాహన కల్పిస్తారు. సభ్యులందరికి బీమా, ఆర్థిక అక్షరాస్యత కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment