serp organisation
-
ప్రభుత్వాల మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమలుపై అతలాకుతలం!
నిజామాబాద్: న్యాయబద్ధమైన తమ హక్కులను సాధించుకోవడానికి ముడుపులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులు వాపోతున్నారు. గత ప్రభుత్వ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు అడిగినంత ఇచ్చినా పే స్కేల్ అమలులో సరైన న్యాయం జరుగలేదని ఉద్యోగులు సామాజిక మాధ్యమాలల్ల చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సెర్ప్ ఉద్యోగులు ఇప్పుడు గత ప్రభుత్వ పనితీరును తప్పుపడుతూ గత పది రోజుల నుంచి పే స్కేల్ అమలులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై చర్చించుకోవడం గమనార్హం. సెర్ప్ సంస్థలో కమ్యునిటీ కో–ఆర్డినేటర్లు, ఏపీఎం, డీపీఎం, ఏపీడీలు అందరూ గతంలో కాంట్రాక్టు పద్ధతిన నియమించిన వారే. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల వరకు ఉండగా మన జిల్లాలో 216 మంది ఉన్నారు. పే స్కేల్ అమలు చేసినా ఉద్యోగుల క్యాడర్‌ను తగ్గించడంతో తాము ఆశించిన వేతనం లభించడం లేదన్నారు. సీసీలను జూనియర్ అసిస్టెంట్, ఏపీఎంలను సీనియర్ అసిస్టెంట్, డీపీఎంలను సూపరింటెండెంట్, ఏపీడీలను ఎంపీడీవో స్థాయి అధికారులుగా గుర్తించారు. క్యాడర్ గుర్తింపులో తేడా స్పష్టంగా ఉండటంతో పే స్కేల్ వర్తించినా ఆశించిన వేతనం దక్కడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దమొత్తంలో వసూలు చేసిన ఉద్యోగ సంఘం ప్రతినిధులు క్యాడర్ గుర్తించడంలో న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురాలేదని ఉద్యోగులు అంటున్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న పరిణామాలు కొత్త ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి. ఇవి కూడా చదవండి: సీఎం రేవంత్‌రెడ్డి రెడ్‌డైరీలో బోధన్ ఏసీపీ పేరు..! -
అతివకు అండగా..సెర్ఫ్ ఆధ్వర్యంలో‘విజన్ బిల్డింగ్’ కార్యక్రమం
నారాయణ్‌పేట్: గ్రామీణ ప్రాంతాల మహిళలు సంఘటితమయ్యేలా.. పొదుపుతో మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించేలా.. స్వయం ఉపాధి రంగాల్లో రాణించేలా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు మరిన్ని స్వయం సంఘాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) ఆద్వర్యంలో విజన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో బాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు మండలాలు ఎంపిక చేసుకున్న అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి మహిళ కుటుంబాన్ని ఆర్థికంగా ప్రగతి సాధించేందుకు అవసరమైన తోడ్పాటు అందించేలా ప్రణాళిక రూపొదించారు. ప్రభుత్వం అనుమతి అనంతరం ‘విజన్ బిల్డింగ్’ పనులు ముమ్మరంగా చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా సరికొత్త లక్ష్యం నిర్దేశించుకొని సంఘాల ఏర్పాటును చేపట్టింది. మహిళా పొదుపు సంఘాల ద్వారా రుణాలు పొంది చిరు వ్యాపారాలు, స్వయం సమృద్ధి పథకాలలో రుణాలు తీసుకొని లబ్దిపొందేలా చర్యలు తీసుకోనుంది. ఆరోగ్యం, విద్య, జోవనోపాధి, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయునున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి కొన్ని మండలాలను నమూనాగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఎంపిక చేసిన మండలాల ఏపీఎంలకు శిక్షణ పూర్తి చేశారు. మార్గదర్శకాల్లో పంచవర్ష ప్రణాళిక నమూనా మండల సమాఖ్యలుగా ఎంపికై న పరిధిలోని గ్రామాలోని గ్రామైక్య పొదుపు సంఘాల వారు ప్రతి నెలా రుణ వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లించేలా చూడాలి. తప్పనిసరిగా సమావేశాలు, రుణంతో వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేలా, ప్రస్థుతం ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా తీర్చిదిద్దుతారు. రుణాలు అవసరమైతే బ్యాంకులు, సీ్త్రనిధి నుంచి ఇప్పిస్తారు. ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యురాలు విజన్ మిషన్ అబ్జెక్టివ్ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్నకు తగ్గట్టుగా లక్ష్యాలను ఏర్పరుచుకోని, దానిని ఏటా కొంత వరకు సాదించేలా పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు. రానున్న ఐదేళకలల్లో ఈ లక్ష్యాలను చేరేలా చూసి, మహిళా సమాఖ్యలను ఆదర్శంగా మారుస్తారు. జిల్లాలో ఇలా .. జిల్లాలో విజన్ బిల్డింగ్ కార్యక్రమం కోసం మొదటి విడతలో మూడు మండలాలను, రెండో విడతలో మరో మూడు మండలాలను ఎంపిక చేశారు. ఇందులో నారాయణపేట, ఊట్కూర్, నర్వ మండలాలు మొదటి విడుతలో ఉండగా రెండో విడతలో మరో మూడు మండలాలు మాగనూర్, కృష్ణ, మరికల్లున్నాయి. ప్రతి ఏటా రూ.వందల కోట్లు రుణాలు అందిస్తున్నప్పటికి, వ్యాపారాల ఏర్పాటుకు వారి ఆర్థికాభివృద్ధికి ఉపయోగిస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతగా 102 మండల సమాఖ్యలను ఎంపిక చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాలో 16 మండలాలుండగా నారాయణపేట జిల్లాలో ఆరు మండలాలను ఎంపిక చేశారు. సద్వినియోగం చేసుకోవాలి మహిళా సమాఖ్యల్లోని సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో రాణిచేందుకు విజన్ బిల్డింగ్ అనే కొత్త కార్యక్రమానికి సెర్ప్ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు జిల్లాలో మూడు మండల సమాఖ్యలను ఎంపిక చేసి మండల ఏపీఎంలకు శిక్షణ ఇచ్చారు. పేదరిక నిర్మూలన కోసం విజన్ డాక్యుమెంట్‌ను ఐదేళ్ళ కోసం తయారు చేశాం. త్వరలో ఈ కార్యక్రమం అమలు చేసేందుకు చేపట్టాల్సిన విధి విధానాలను రూపొందించనున్నారు. – అంజయ్య, ఏపీడీ ప్రధాన లక్ష్యాలివి.. మహిళా సంఘాల్లోని ప్రతి సభ్యురాలికి సుస్థిర జీవనోపాధితో ఆధాయం వచ్చేలా చర్యలు చేపడతారు. దీనికోసం బ్యాంకు రుణాలు, సీ్త్రనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తారు. వ్యవసాయం, పశుపోషణ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు వృత్తినైపుణ్యం పెంపొదించడం, కుటిర పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తారు. నెలకు కనీసం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం సమకూరేలా చేస్తారు. సంఘాల బలోపేతానికి ఆర్థిక సహకారం అందిస్తారు. ఆన్లైన్ విధానంలో లావాదేవీలు, యాప్‌ల ద్వారా రికార్డుల నిర్వాహణ చేసేలా వారికి అవగాహన కల్పిస్తారు. సభ్యులందరికి బీమా, ఆర్థిక అక్షరాస్యత కల్పించనున్నారు. -
స్త్రీనిధి.. రూ.45 కోట్లు
చుంచుపల్లి: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) 2018–19 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికలను సిద్ధం చేసింది. జిల్లాలోని 18,121 మహిళా సంఘాలకు రూ. 45 కోట్లు అందించేందుకు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు వార్షిక ప్రణాళిక రూపొందించారు. 2017–18లో రుణ లక్ష్యం రూ.25.14 కోట్లు పెట్టుకోగా, మహిళా సంఘాలకు రూ.32.35 కోట్లు పంపిణీ చేశారు. లక్ష్యానికి మించి రూ.7.21 కోట్లు అధికంగా రుణాలు ఇచ్చారు. సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తున్న స్త్రీ నిధి రుణాలతో మహిళలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. జిల్లాలోని 18,121 మహిళా సంఘాల్లో 1,64,867 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ప్రయోజనం కలగనుంది. ఈ ఏడాది రూ.20 కోట్లు పెరిగిన లక్ష్యం మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే రుణాల లక్ష్యం పెరుగుతోంది. స్త్రీనిధి ద్వారా కేవలం రుణ అర్హత సాధించిన సంఘాలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. 2016–17లో మహిళా సంఘాలకు రూ.19.52 కోట్ల రుణం లక్ష్యం పెట్టుకోగా రూ.16.95 కోట్లను అందజేశారు. 3,479 సంఘాలకు అందజేసి లక్ష్యంలో 86.84 శాతం నమోదు చేశారు. 2017–18లో రూ.25.14 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా, రూ.32.35 కోట్లను అందించారు. 5,779 గ్రూపులకు రుణాలు ఇచ్చి లక్ష్యానికి మించి 128 శాతం నమోదు చేశారు. ఇక 2018–19లో గతేడాది కంటే రూ.20 కోట్లు అధికంగా రూ.45 కోట్లు అందించేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మైక్రో, జనరల్, టైనీ రుణాల రూపంలో రూ.1.25 కోట్లను 312 గ్రూపులకు చెల్లించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీకి అధికారులు ఇప్పటికే చేపట్టారు. -
చెంచుల జీవన స్థితిగతులపై అధ్యయనం
మన్ననూర్: సెర్ప్ సంస్థ ఆధ్వర్యంలో బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు చెందిన సిందూరా గణపతి, నరెంధర్లతో కూడిన ఢిల్లీ బృందం సభ్యులు చెంచుల స్థితిగతులు జీవన విధానం, తదితర అంశాలపై అధ్యయనంలో భాగంగా నల్లమల లోతట్టు ప్రాంత చెంచు పెంటల్లో పర్యటించారు. మహబూబ్ నగర్ జిల్లా మల్లాపూర్‌లో ఐకేపీల ద్వారా 7.20 లక్షలు ఖర్చు చేసి ఉపాధి అవకాశంగా చెంచులకు ఇప్పించిన మేకలను, వాటి పోషణను సభ్యులు పరిశీలించారు. అనంతరం మన్ననూర్లోని చెంచు కమ్యూనిటీ భవనంలో చెంచు మహిళా గ్రూపు ప్రతినిధులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సంఘాల పొదుపు సంఘాల పనితీరు తదితర అంశాల గురించి ఇష్టాగోష్టిగా చర్చించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెంచుల అభివృద్ధి కోసం చేపట్టబోయే పలు నిర్ణయాలలో ఇక్కడ మంచి ఫలితాలను ఇచ్చిన పథకాలు అక్కడ రూపకల్పన చేయాలనేది ప్రధాన ఉద్దేశ్యమని బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీడీ సరోజ, యంగ్ ప్రొఫెషనల్ సభ్యులు లక్ష్మి, మల్లేష్, సంతోష్, పోతమ్మ, గురువమ్మ, మాసమ్మ తదితరులు పాల్గొన్నారు.