
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ మహిళా పక్షపాతి. గతంలో ఎవరూ చేయనంతగా మహిళలకు ఈ రెండేళ్లలో జగన్ మేలు చేకూర్చారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మహిళలకు రాజకీయాల్లోనూ ప్రాధాన్యం కల్పించారు. నామినేటెడ్ పోస్టులు, మున్సిపల్ పదవుల్లోనూ 50% శాతం కేటాయించారు. మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని, యాప్‌ను రూపొందించారు. మహిళా సాధికారత కోసం నిరంతరం జగన్ శ్రమిస్తున్నారు. ఇళ్ల పట్టాలు, అమ్మఒడి అన్నీ మహిళల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చేసినవే.
చదవండి: (త్వరలో వైఎస్సార్‌సీపీ సభ్యత్వ నమోదు: విజయసాయిరెడ్డి)
గత ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు జరిగాయి. మొన్న చింతమనేని దగ్గర్నుంచి.. నిన్న వినోద్ జైన్ వరకూ టీడీపీ నేతలు మహిళలపై దాడులు చేసిన వారే. టీడీపీ గందరగోళంలో ఉంది. ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేశాడు. చంద్రబాబు సభకు రానప్పుడు.. ఆయన అనుచరులెందుకు వస్తున్నారు. 160 సీట్లు గెలుస్తామని అచ్చెన్నాయుడు కల కంటున్నాడు. తిరుపతిలో పార్టీ లేదు బొక్కా లేదు అన్నది అచ్చెన్నే కదా. ప్రజలను మభ్య పెట్టడానికే టీడీపీ నేతల ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాటలు అబద్ధాల పుట్ట.
చదవండి: (చంద్రబాబు చెంచాలు మద్యం తాగి మాట్లాడుతున్నారు: పద్మజ)
మేం చెప్పిందే చేశాం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. హామీలు అమలు చేసిన బుక్‌లెట్ కూడా విడుదల చేశాం. రైతు రుణాలు మాఫీ చేస్తానని తప్పించుకున్న ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు 600 హామీలిచ్చి తుంగలో తొక్కాడు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు కూడా వినిపించే అవకాశం కల్పించిన నేత సీఎం జగన్. అసెంబ్లీని రాజకీయ వేదికగా మార్చాలనేదే చంద్రబాబు ప్రయత్నం. ఎవరు ఎవరి గొంతు నొక్కేశారో రికార్డులను పరిశీలించేందుకు మేం సిద్ధం.. బాబు మీరు సిద్ధమా' అంటూ మల్లాది విష్ణు చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment