
తిరుపతి తుడా/నగరి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక వీడియోని విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందుతారని అన్ని సర్వేలు తేల్చాయన్నారు. ఘోరాతి ఘోరంగా ఉప ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించిన చంద్రబాబు, లోకేశ్‌లు తిరుపతిలో సరికొత్త నాటకానికి దిగారని విమర్శించారు.
ప్రతి ఎన్నికల్లో ఇదే పద్ధతిని ఆ పార్టీ నేతలు అవలంబిస్తున్నారన్నారని గుర్తు చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని లోకేశ్ వీరప్పన్ అంటూ విమర్శించడం సిగ్గుచేటన్నారు. నీచ, దిక్కుమాలిన రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయని మండిపడ్డారు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన ఖర్మ వైఎస్సార్‌సీపీకి గాని, సీఎం వైఎస్ జగన్‌కిగానీ లేదన్నారు. ఎక్కడా డబ్బులు పంచకుండా, ఎవరినీ ప్రలోభ పెట్టకుండా, ఏ విధమైన గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment