‘పవన్‌ కల్యాణ్‌ మౌనం ఆశ్చర్యమేసింది’ | north beats south at tirumala, but pan kalyan is mums, asks ap ias officer | Sakshi
Sakshi News home page

‘పవన్‌ కల్యాణ్‌ మౌనం ఆశ్చర్యమేసింది’

Published Mon, May 8 2017 9:53 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

‘పవన్‌ కల్యాణ్‌ మౌనం ఆశ్చర్యమేసింది’ - Sakshi

‘పవన్‌ కల్యాణ్‌ మౌనం ఆశ్చర్యమేసింది’

టీటీడీ ఈవో  పదవి విషయంలో జనసేన నేత, ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌ నోరు విప్పకపోవడంపై ఏపీకి చెందిన ఓ ఐఏఎస్‌ స్థాయి అధికారి విస్మయం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉత్తరాదికి చెందిన ఓ ఐఏఎస్‌ అధికారిని నియమించడంపై దక్షిణాది రాష్ట్రాల ఐఏఎస్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రానికి చెందిన అధికారులను కాదని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి ఈవో పదవి కట్టబెట్టడంపై ఏపీకి చెందిన ఐఏఎస్‌ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు.  ఇదే విషయంపై పవన్‌ ఎందుకు స్పందించడం లేదని రాష్ట్రానికి చెందిన ఓ అధికారి ప్రశ్నిస్తున్నారు. గతంలో చాలా విషయాల్లో కేంద్రంపై ప్రశ్నలు వర్షం కురిపించిన పవన్‌ ..ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అంతేకాకుండా ప్రశ్నించేందుకే జనసేన పుట్టిందన్న ఆయన ఈ విషయంలో మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.

దక్షిణాది రాష్ట్రాలపై  కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ కురిపిస్తోందని గతంలో పవన్‌ చేసిన విమర్శలను ఆ అధికారి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటిది ఏపీ సర్కార్‌... సొంత రాష్ట్రానికి చెందిన అధికారులను పక్కనపెట్టి ఉత్తరాది అధికారికి ఈవో పదవి ఎలా ఇస్తారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్‌ ప్రశ్నించరా అని అన్నారు. దీనిపై స్పందించిన పవన్‌... ప్రభుత్వంతో పాటు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement