బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై తనిఖీలు
తిరుమల: తిరుమలలో సెప్టెంబర్ 16 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ఆదివారం టీటీడీ ఈవో సాంబశివరావు తనిఖీలు నిర్వహించారు. సీవీఎస్‌వో నాగేంద్రకుమార్, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డితో కలిసి శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేశారు.
రద్దీ పెరిగిన సందర్భాల్లో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం క్యూలు కదిలే తీరును, లోటుపాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆలయం వెలుపల అఖిలాండం నుంచి మహారథం వరకు బ్రహ్మోత్సవ వాహన సమయాల్లో భక్తులు వేచి ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. అనంతరం ఎస్వీ మ్యూజియాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు.