
వెంకన్న ఐటీకీ వన్నా క్రై వైరస్
తిరుమల : ప్రపంచాన్ని వణికిస్తున్నవాన్నక్రై వైరస్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తాకింది. సుమారు 30 కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయి. భక్తులకు సమాచారం అందించే వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేదు. కంప్యూటర్లలోని కేవలం పరిపాలనా పరమైన కొన్ని అంశాలకు వైరస్ సోకడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను టీటీడీ వినియోగిస్తున్నప్పటికీ.. కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియకుండా పైరేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన టీటీడీ ఐటీ విభాగం అధికారులు వైరస్ సోకిన కంప్యూటర్లను తొలగించారు. ఇతర వ్యవస్థకు ఇబ్బందుల్లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వానక్రై వైరస్ వల్ల 30 కంప్యూటర‍్లకు వైరస్ సోకిన మాట వస్తావమేనని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం మీడియాతో చెప్పారు. దీనితో పాలనాపరమైన పనులకు కొంత విఘాతం కలిగిందని, ఐటీ అధికారులతో సమీక్షించి తగిన చర‍్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.