
తిరుమలలో మూడు క్యూలైన్ల విధానం
చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు అన్నారు.
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు అన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు, నిఘా పెంచేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం ఏర్పాటు చేసినట్లు దేవస్థానం ఈవో సాంబశివరావు వివరించారు.