
ఈ–దర్శన్ కౌంటర్‌ను పునఃప్రారంభించండి
ఈ–దర్శన్ కౌంటర్‌ను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అవినాష్‌రెడ్డి టీటీడీ ఈవోను కోరారు.
► తిరుమల జేఈఓను కోరిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల : పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ–దర్శన్ కౌంటర్‌ను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి టీటీడీ ఈవో సాంబ శివరావును కోరారు. మంగళవారం తిరుపతిలో ఈవోను కలిసి మాట్లాడారు. ఈనెల 19 నుంచి ఈ–దర్శన్ కౌంటర్‌ను మూసివేశారన్నారు. దీం తో ఈ ప్రాంత ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. వెంటనే ఈ–దర్శన్ కౌంటర్‌ను ప్రారంభించాలని ఆయన ఈవోను కోరారు.