
సాక్షి, తిరుమల : హైకోర్టు తీర్పును శిరసావహించి తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం టీటీడీ ఈవోకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే ఈఓకు లేఖ రాశానని, స్పందించకపోవడంతో ఫోన్ చేసి మాట్లాడానని రమణ దీక్షితులు తెలిపారు. కాగా హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తనకు అందలేదని ఈవో సింఘల్ పేర్కొన్నారు. మరికాసెపట్లో తిరుచానురు ఆలయ మాజీ అర్చకుల తరపు న్యాయవాది హైకోర్టు తీర్పు కాపీని ఈవోను అందజేయనున్నారు. ఈ రోజు సాయంత్రం టీటీడీ ఈవోను రమణ దీక్షితులు కలిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment