దళారుల కట్టడికే ఆన్‌లైన్ టికెట్లు
సాక్షి, తిరుమల: ఆన్‌లైన్‌లో రూ. 300 టికెట్ల విక్రయాల ద్వారా కల్పించే దర్శనంలో అక్రమాలకు అవకాశం లేకుండా అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. గురువారం జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణతో కలిసితో కలసి ఆయన రూ.300 ఆన్‌లైన్ టికెట్ల క్యూను సందర్శించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ రోజుకు 11 వేల టికెట్లు ఇస్తున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను 15వేలకు పెంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకే ఈ ఆన్‌లైన్ దర్శనం ప్రవేశ పెట్టామన్నారు. వస్త్రధారణ, టీటీడీ నిబంధనలను టికెట్లపై అన్ని భాషల్లో ముద్రించే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.