online ticket
-
Pushpa 2 Movie: ‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపు..
-
ఏపీ సర్కారుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
ఆన్లైన్ టికెటింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఆన్లైన్ విధానం వల్ల థియేటర్లు, కార్మికులకు మనుగడ ఉంటుందన్నారు. టికెటింగ్‌పై పారదర్శకత ముఖ్యమన్నారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే . ఈ బిల్లును మెగాస్టార్ చిరంజీవి స్వాగతిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. -
ఆన్లైన్ టికెట్ విధానాన్ని స్వాగతించాలి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ సినిమా టికెట్ విధానాన్ని ప్రతిపక్షాలు, సినీ ఇండస్ట్రీ స్వాగతించాలని, ప్రజల మేలు కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు, తమిళనాడు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. వినోదం పేరుతో ప్రజలను దోపిడీకి గురిచేయడం ఎంతవరకు న్యాయమని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. సినిమా టికెట్లు విచ్చలవిడిగా అమ్మే దోపిడీని అరికట్టకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు కచ్చితంగా వచ్చేదని వెల్లడించారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల్లో పెట్టిపోతే.. సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. -
ఎవరో ఎదో మాట్లాడితే మాకు సంబంధం లేదు
-
పవన్‌కు ఎందుకంత భయం: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు: పవన్ కల్యాణ్ నటించినా, మరే ఇతర నటుడు నటించినా కష్టం అనేది ఒకటే అని మంత్రి అనిల్ కుమార్‌యాదవ్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారని తెలిపారు. ఆన్లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయమని సూటిగా ప్రశ్నించారు. దాని వల్ల జరిగే నష్టం ఏమిటని నిలదీశారు. రాజకీయ ఉనికి కోసమే పవన్ తాపత్రయ పడుతున్నాడని మండిపడ్డారు. తన ఒక్కడి కోసం చిత్రసీమను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కల్యాణ్ మాట్లాడడం సరికాదని దుయ్యబట్టారు. ఇది పవన్ కల్యాణ్ క్రియేషన్ అని, చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్‌ను తిట్టడం పవన్ కల్యాణ్‌కు ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు జడ్పీటీసీలు, ఎంపీటీసీకే తన అడుగులు అంటున్నాడు, స్థానాలు పెరిగే లోపల పార్టీనే చాపచుట్టేయడం ఖాయమన్నారు. పారదర్శకత కోసమే ఆన్లైన్ పోర్టల్ అని, అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు. వాళ్లకు లేని బాధ పవన్ కల్యాణ్‌కు ఎందుకు? సాక్షి, విజయనగరం: సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి, ప్రజలపై భారం వేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ లేకుండా పోతోందని అన్నారు. సినిమ టికెట్ల ఆన్లైన్ అమ్మకాల విధానాన్ని సినిమా డిస్ట్రిబ్యూటర్లే అడిగారని తెలిపారు. వాళ్లకు లేని బాధ పవన్ కల్యాణ్‌కి ఎందుకు అని ప్రశ్నించారు. నోరు ఉందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా? అని మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. -
ఆన్లైన్ టికెట్ విధానం మేమే అడిగాం: నిర్మాత కళ్యాణ్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చలు చాలా ఆనందకరమని టాలీవుడ్ నిర్మాత సి.కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటిని ఓపిగ్గా విని పరిష్కారం చూపుతామని మంత్రి పేర్ని నాని వెల్లడించినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద సహకారం ఇచ్చారని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా అని తెలిపారు. దివంగత వైఎస్సార్ సినీ ఇండస్ట్రీకి ఎంతో చేశారని నేడు సీఎం జగన్ కూడా అలాగే చేస్తున్నారని ప్రశంసించారు. కాగా ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. చదవండి: ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ ఆన్లైన్ టికెట్ విధానం తామే అడిగామని నిర్మాత కళ్యాణ్ పేర్కొన్నారు. దానితో పాటు 4 షోలు 12 గంటలలోపు పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల అంశం, 100 శాతం ఆక్యుపెన్సీపై కూడా చర్చించామన్నారు. అన్ని వర్గాలు ఈ రోజు చర్చల పట్ల ఆనందంగా ఉన్నాయని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని ప్రభుత్వం చెప్పిందని త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ అవుతామని వెల్లడించారు. అన్ని సమస్యలపై చర్చించాం ఆన్లైన్ విధానం వలన సినీ పరిశ్రమకి మేలు జరుగుతుందని నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు తెలిపారు. ఆన్లైన్ విధానంతో పాటు రేట్లు సవరించని కోరినట్లు తెలిపారు. అన్ని సమస్యలపై మంత్రి తో చర్చించామని, ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పిందని వెల్లడించారు. మరో సమావేశం ఉంటుంది సినిమా సమస్యలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నిర్మాత డీఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు. సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యలపై మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చ జరిగిందని దీనివల్ల తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుందన్నారు. తప్పనిసరిగా మరొక సమావేశం ఉంటుందని తెలిపారు. చిన్నా, పెద్ద సినిమా కాకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న డౌట్స్ క్లారిఫై చేశామని పేర్కొన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ అనేది పెద్ద సమస్య కాదని అన్నారు. -
ఆన్లైన్ ధర తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం
తమిళసినిమా: సినిమా టికెట్ల ఆన్లైన్ బుకింగ్ చార్జీలను తగ్గించడానికి చర్చలు జరుపుతున్నట్లు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ తెలిపారు. జీఎస్టీ పన్నుతో సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్ చార్జీలను రూ. 30 నుంచి రూ.10కి తగ్గించడానికి చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అందుకు సొంతంగా ఆన్‌లైన్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. థియేటర్లలో ఉన్న సీట్లు, వసూళ్ల వివరాలు థియేటర్ల యాజమాన్యానికే సరిగా తెలియని పరిస్థితి నెలకొనడంతో కేరళలో అమలు పరస్తున్న ఆన్లైన్ విధానంలో నకిలీ టికెట్ల విక్రయం అరికట్టవచ్చునని విశాల్ అన్నారు. అందుకు చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. నటులు పారితోషికాన్ని తగ్గించుకోవాలి చెన్నై థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ ఈ విషయమై స్పందిస్తూ ఆన్లైన్ బుకింగ్ చార్జీలను తగ్గించడం సాధ్యం కాదన్నారు.అదే విధంగా థియేటర్లలో తినుబండారాల గురించి మాట్లాడుతున్నారని, ముందు నటీనటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలని అన్నారు. ఒక చిత్రం రూ.40 కోట్లు వసూలు చేస్తే అందులో రూ. 30 కోట్లు నటులు పారితోషికం తీసుకుంటున్నారని అన్నారు. ఎంత పెద్ద నటుడైనా కోటి రూపాయలకు మించి పారితోషికం తీసుకోరాదని అభిరామి రామనాథన్ అన్నారు. మరి ఈ చర్చ ఎటు దారి తీస్తుందో వేసి చూడాల్సిందే. -
హైదరాబాద్ స్టార్టప్‌ను కొనుగోలు చేసిన బుక్‌మైషో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ టికెట్ బుకింగ్ దిగ్గజం ‘బుక్‌మైషో’.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మస్తిటికెట్స్ను చేజిక్కించుకుంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. మస్తిటికెట్స్ కొనుగోలు ద్వారా ఉద్యోగులతో పాటూ సంస్థ ఒప్పందాలు కూడా బుక్‌మైషోకు బదిలీ అవుతాయని బుక్‌మైషో సీఈఓ ఆశిష్ హెమ్రాజనీ ఒక ప్రకటనలో తెలిపారు. ముంబై కేంద్రంగా 2007లో ప్రారంభమైన బుక్‌మైషో దేశంలోని 400 పట్టణాల్లో సేవలందిస్తోంది. నిధులు సమీకరించిన వీడెలివర్.. కాగా హైపర్ లోకల్ లాజిస్టిక్ సంస్థ వీడెలివర్ హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌సీపీ హోల్డింగ్స్, ఆస్ట్రేలియాకు చెందిన బాస్ కన్స్ల్టింగ్ నుంచి నిధులు సమీకరించింది. ఎంత మొత్తమనేది మాత్రం వెల్లడించలేదు. ఈ నిధులను టెక్నాలజీ అభివృద్ధి, సేవల విస్తరణ నిమిత్తం వినియోగిస్తామని.. కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీనివాస్ మాధవం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
దళారుల కట్టడికే ఆన్లైన్ టికెట్లు
సాక్షి, తిరుమల: ఆన్లైన్లో రూ. 300 టికెట్ల విక్రయాల ద్వారా కల్పించే దర్శనంలో అక్రమాలకు అవకాశం లేకుండా అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. గురువారం జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణతో కలిసితో కలసి ఆయన రూ.300 ఆన్లైన్ టికెట్ల క్యూను సందర్శించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ రోజుకు 11 వేల టికెట్లు ఇస్తున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను 15వేలకు పెంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకే ఈ ఆన్లైన్ దర్శనం ప్రవేశ పెట్టామన్నారు. వస్త్రధారణ, టీటీడీ నిబంధనలను టికెట్లపై అన్ని భాషల్లో ముద్రించే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
ఆన్లైన్లో మరో 7 వేలు
రూ. 300 టికెట్లు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తిరుమల: వేంకటేశ్వరుని దర్శనం కోసం రూ. 300 ఆన్లైన్ టికెట్లను రోజుకు 11 వేలు కేటాయిస్తుండగా, త్వరలోనే మరో 7వేల టికెట్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో కరెంట్ బుకింగ్ కింద ఇచ్చే రూ. 300 టికెట్లను రద్దు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. రూ. 300 టికెట్లు పోస్టాఫీసులు, మీ సేవ కేంద్రాల్లోనూ ఇచ్చేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇంటెర్నెట్ ద్వారా రూ. 300 ఆన్లైన్ టికెట్లు ప్రస్తుతం ఇంగ్లిష్‌లోనే అందజేస్తున్నారు. ఇకపై భక్తులు సులభంగా టీటీడీ నిబంధనలు తెలుసుకునేలా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ముద్రించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పనలో అధికారులున్నారు. నేటి నుంచిదివ్యదర్శనం టికెట్లు జారీ కాలిబాట భక్తులకు గురువారం నుంచి దివ్యదర్శనం టికెట్లు జారీ చేస్తామని ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తెలిపారు. భక్తుల రద్దీ వల్ల కొన్ని రోజులుగా కాలిబాట టికెట్లను రద్దు చేశామన్నారు. ప్రస్తుతం రద్దీ తగ్గుముఖం పట్టడంతో టికెట్లు ఇస్తామన్నారు. బాసర ఆలయం మూసివేత బాసర : చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదిలాబా ద్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని మూసి ఉంచారు. ఉదయం 6.30 గంటల నుంచి సా. 6.30 గంటల వరకు మూసి వేశారు. చంద్రగ్రహణం తరువాత అమ్మవారికి గోదావరి నీటి తో అర్చకులు సంప్రోక్షణ చేసి పూజలు నిర్వహిం చారు. ఆలయాధికారులు సిబ్బందితో ఆలయ పరిసరాలన్నింటినీ నీటితో శుభ్రం చేశారు. భద్రాద్రి ఆలయ తలుపులు మూసివేత భద్రాచలం : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి ఆలయ తలుపులను బుధవారం ఉదయం 8.30 గంటలకు మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా బుధవారం నిత్యకల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులు రాకపోవడంతో ఆలయ ప్రాంగణం బోసిపోయింది.