ఆన్‌లైన్ టికెటింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఆన్‌లైన్ విధానం వల్ల థియేటర్లు, కార్మికులకు మనుగడ ఉంటుందన్నారు. టికెటింగ్‌పై పారదర్శకత ముఖ్యమన్నారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే . ఈ బిల్లును మెగాస్టార్ చిరంజీవి స్వాగతిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment