
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు విజయవాడకు వచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. గురువారం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లిన చిరంజీవి... తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, గన్నవరం విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానం ఇస్తూ.. ‘సినిమా అంశాలపై సీఎంతో చర్చించేందుకు విజయవాడ వచ్చా. సినీ పరిశ్రమకు చెందిన బిడ్డగా సీఎంతో మాట్లాడేందుకు వచ్చా. సీఎంతో భేటీ తర్వాత అన్ని విషయాలు చెబుతాను’అని సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.