హైదరాబాద్‌ స్టార్టప్‌ను కొనుగోలు చేసిన బుక్‌మైషో! | Bookmyshow.com buys Hyderabad-based MastiTickets | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ స్టార్టప్‌ను కొనుగోలు చేసిన బుక్‌మైషో!

Published Wed, Jan 25 2017 1:19 AM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

హైదరాబాద్‌ స్టార్టప్‌ను కొనుగోలు చేసిన బుక్‌మైషో!

హైదరాబాద్‌ స్టార్టప్‌ను కొనుగోలు చేసిన బుక్‌మైషో!

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ దిగ్గజం ‘బుక్‌మైషో’..  తాజాగా హైదరాబాద్‌కు చెందిన మస్తిటికెట్స్‌ను చేజిక్కించుకుంది. అయితే డీల్‌ విలువను వెల్లడించలేదు.  మస్తిటికెట్స్‌ కొనుగోలు ద్వారా ఉద్యోగులతో పాటూ సంస్థ ఒప్పందాలు కూడా బుక్‌మైషోకు బదిలీ అవుతాయని బుక్‌మైషో సీఈఓ ఆశిష్‌ హెమ్రాజనీ ఒక ప్రకటనలో తెలిపారు. ముంబై కేంద్రంగా 2007లో ప్రారంభమైన బుక్‌మైషో దేశంలోని 400 పట్టణాల్లో సేవలందిస్తోంది.

నిధులు సమీకరించిన వీడెలివర్‌..
కాగా హైపర్‌ లోకల్‌ లాజిస్టిక్‌ సంస్థ వీడెలివర్‌ హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌సీపీ హోల్డింగ్స్, ఆస్ట్రేలియాకు చెందిన బాస్‌ కన్స్‌ల్టింగ్‌ నుంచి నిధులు సమీకరించింది. ఎంత మొత్తమనేది మాత్రం వెల్లడించలేదు. ఈ నిధులను టెక్నాలజీ అభివృద్ధి, సేవల విస్తరణ నిమిత్తం వినియోగిస్తామని..  కంపెనీ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ శ్రీనివాస్‌ మాధవం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement