ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని స్వాగతించాలి | We Will Welcome Online Cinema Ticketing Portal, Kethireddy | Sakshi

ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని స్వాగతించాలి

Oct 4 2021 5:54 PM | Updated on Oct 4 2021 6:00 PM

We Will Welcome Online Cinema Ticketing Portal, Kethireddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ సినిమా టికెట్‌ విధానాన్ని ప్రతిపక్షాలు, సినీ ఇండస్ట్రీ స్వాగతించాలని, ప్రజల మేలు కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఏపీ అధ్యక్షుడు, తమిళనాడు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు.

వినోదం పేరుతో ప్రజలను దోపిడీకి గురిచేయడం ఎంతవరకు న్యాయమని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. సినిమా టికెట్లు విచ్చలవిడిగా అమ్మే దోపిడీని అరికట్టకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు కచ్చితంగా వచ్చేదని వెల్లడించారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల్లో పెట్టిపోతే.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement