ఈడీపీ అధికారులపై టీటీడీ ఈవో ఆగ్రహం
తిరుమల : ఈడీపీ అధికారులపై టీటీడీ కార్యనిర్వహాణాధికారి డి. సాంబశివరావు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రత్యేక దర్శనం టికెట్లు ఇష్టానుసారం విక్రయించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించి...భక్తులను ఇబ్బందులకు గురి చేశారని అధికారులపై సాంబశివరావు మండిపడ్డారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో క్యూలైన్లు తాత్కాలికంగా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. శనివారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారుల తీరుపై వారు మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులపై టీటీడీ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి... క్యూలైన్లు రోడ్డుపైకి వచ్చాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటలు, నడక దారిలో వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది.